Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Home Insurance: హోమ్ ఇన్సూరెన్స్ ఎందుకు తప్పనిసరి? దీనికి ఎంత ఖర్చు అవుతుంది?

మార్కెట్‌లో ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాలను భర్తీ చేయడానికి వివిధ బీమా ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. గృహ బీమా కోసం, 'భారత్ గృహ రక్ష' అనేది అన్ని సాధారణ బీమా కంపెనీలు ఒకే పేరుతో అందించే ప్రామాణిక పాలసీ. ఇది ఇంటి నిర్మాణాన్ని.. ఎలక్ట్రికల్ ఫిక్చర్‌లు, బాత్రూమ్ ఫిట్టింగ్‌లు.. గ్యారేజ్ వంటి వస్తువులను కూడా కవర్ చేస్తుంది. భారతదేశంలో ఇన్సూరెన్స్ గ్యాప్ ఎంత ఉందో చూద్దాం.. ప్రకృతి వైపరీత్యాల కారణంగా 2022లో ప్రపంచవ్యాప్తంగా 22.56 లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ఎస్‌బిఐ ఎకోవ్రాప్ నివేదిక పేర్కొంది.

Home Insurance: హోమ్ ఇన్సూరెన్స్ ఎందుకు తప్పనిసరి? దీనికి ఎంత ఖర్చు అవుతుంది?
Home Insurance
Follow us
Subhash Goud

|

Updated on: Jul 28, 2023 | 5:32 PM

హిమాచల్ ప్రదేశ్‌లో ఈమధ్య వచ్చిన వరదల సమయంలో మండిలోని అనిల్ సింగ్ ఇల్లు అతని కళ్లముందే కొట్టుకుపోయింది. క్షణాల వ్యవధిలో అనిల్ జీవితకాల సంపాదన అంతా మాయమైపోయింది. అతను ఇప్పుడు తన కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో.. వారితో కలిసి ఎక్కడ తలదాచుకోవాలో అర్ధం కాక ఇబ్బంది పడుతున్నాడు. ఈ ప్రకృతి వైపరీత్యాల బారిన పడి నష్టపోయిన వాళ్ళలో అనిల్ ఒక్కడు మాత్రమే కాదు. వరదలు, కొండచరియలు విరిగిపడటంతో ఆ రాష్ట్రంలో 5000కు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి.

హోమ్ ఇన్సూరెన్స్: ప్రకృతి వైపరీత్యాల నష్టాన్ని పూడ్చుకోవడానికి అతను హోమ్ ఇన్సూరెన్స్ తీసుకుని ఉండి ఉంటే.. ఈ రోజు అతనికి ఆందోళన చెందవలసిన పరిస్థితి వచ్చేది కాదు. దురదృష్టవశాత్తు చాలా కొద్ది మంది మాత్రమే తమ ఇళ్లు.. వ్యాపారాలకు బీమా కవరేజీని ఎంచుకుంటారు.

భారతదేశంలో ఇన్సూరెన్స్ గ్యాప్ ఎంత ఉందో చూద్దాం.. ప్రకృతి వైపరీత్యాల కారణంగా 2022లో ప్రపంచవ్యాప్తంగా 22.56 లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ఎస్‌బిఐ ఎకోవ్రాప్ నివేదిక పేర్కొంది. ఇందులో 10.25 లక్షల కోట్ల రూపాయలు బీమా పరిధిలోకి వచ్చాయి. అంటే బీమా చేయని నష్టం 54%గా ఉంది. భారతదేశంలో, 2020లో, వరదల కారణంగా మొత్తం 52,500 కోట్ల రూపాయల ఆర్థిక నష్టం జరిగింది. అయితే బీమా రక్షణ కేవలం 11% మాత్రమే. ఈసారి, వరదలు – కొండచరియలు విరిగిపడటం వల్ల దేశం 15,000 కోట్ల రూపాయల ఆర్థిక నష్టాన్ని చవిచూడవచ్చని అంచనా వేశారు. అయితే ఇన్సూర్ కవర్ ఆస్తిలో 8% మాత్రమే. ఈ విధంగా, దేశంలో ఇన్సూరెన్స్ గ్యాప్ 92%గా అర్ధం అవుతోంది.

ఇవి కూడా చదవండి

ప్రకృతి వైపరీత్యాల విషయంలో మన దేశం ఏ స్థానంలో ఉంది అనే విషయాన్ని తెలుసుకుందాం. 1990 నుంచి యునైటెడ్ స్టేట్స్ – చైనా తర్వాత భారతదేశం అత్యంత ఎక్కువ ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొంది. ఈ విపత్తులలో వరదలు, కొండచరియలు, తుఫానులు, భూకంపాలు, కరువులు ఉన్నాయి. దేశం 1900 నుంచి 764 ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొంది. 1900 నుంచి 2000 వరకు.. భారతదేశం 402 ప్రకృతి వైపరీత్యాలను చూసింది. అయితే 2001 నుంచి 2022 వరకు, అటువంటి సంఘటనలు 361 ఉన్నాయి.

భారతదేశంలో వరదలు అత్యంత సాధారణ ప్రకృతి వైపరీత్యం. రిపోర్ట్స్ చెబుతున్నాడాని ప్రకారం.. దాదాపు 41% ప్రకృతి వైపరీత్యాలు వరదలకు సంబంధించినవి. వరదల తరువాత, దేశం ఎక్కువగా తుపానులను ఎదుర్కొంటోంది.

అసలు ఇన్సూరెన్స్ ఎందుకు తప్పనిసరిగా తీసుకోవాలని చెబుతారో తెలుసుకుందాం. ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో ప్రకృతి వైపరీత్యాల ప్రమాదం చాలా ఎక్కువ. చాలా మందికి సొంత ఇంటి కలను నెరవేర్చుకోవడానికి వారి జీవితకాలంలో గణనీయమైన పెట్టుబడి అవసరం అని బజాజ్ అలయన్జ్ జనరల్ ఇన్సూరెన్స్ చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ (CTO), T.A. రామలింగం చెబుతున్నారు. ఈ కలను సాధించడానికి తరచుగా హోమ్ లోన్ తీసుకోవడం అవసరం. మీరు కారును కొనుగోలు చేసినప్పుడు ఇన్సూరెన్స్ కొనుగోలు చేసినట్లే, మీ ఇంటికి కూడా ఇన్సూరెన్స్ తీసుకోవడం అంతే ముఖ్యం. మీ ఇంటికి .. దానిలోని విలువైన విషయాలకు సంభావ్య నష్టాలకు పరిహారం అందించడం వలన గృహ బీమా చాలా అవసరం. హోమ్ ఇన్సూరెన్స్ మీ ఇంటికి రక్షణ కవచంగా పనిచేస్తుంది, ఊహించని నష్టాల నుంచి దానిని కాపాడుతుంది.

సరైన బీమాను ఎలా ఎంచుకోవాలి?

మార్కెట్‌లో ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాలను భర్తీ చేయడానికి వివిధ బీమా ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. గృహ బీమా కోసం, ‘భారత్ గృహ రక్ష’ అనేది అన్ని సాధారణ బీమా కంపెనీలు ఒకే పేరుతో అందించే ప్రామాణిక పాలసీ. ఇది ఇంటి నిర్మాణాన్ని.. ఎలక్ట్రికల్ ఫిక్చర్‌లు, బాత్రూమ్ ఫిట్టింగ్‌లు.. గ్యారేజ్ వంటి వస్తువులను కూడా కవర్ చేస్తుంది.

కొన్ని ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ అన్ని రకాల నష్టాలను కవర్ చేయడానికి రూపొందించినవి. వీటిని రెసిడెంట్ పాలసీలు అంటారు. ఈ ఎంపికల నుండి, మీరు మీ నిర్దిష్ట అవసరాల ఆధారంగా ఎంచుకోవచ్చు. మీరు మీ పాలసీకి అవసరమైన రైడర్‌లను జోడించడం ద్వారా మీ ఇన్సూరెన్స్ కవరేజీని కూడా పెంచుకోవచ్చు.

ఈ ఇన్సూరెన్స్ పాలసీ ధరలు ఎలా ఉంటాయి?

ప్రాపర్టీ ఇన్సూరెన్స్ సాధారణంగా దీర్ఘకాలానికి ఉద్దేశించినది. సాధారణంగా ఒకే ప్రీమియం పాలసీగా అందిస్తారని ఇన్సూరెన్స్ ఎక్స్ పర్ట్ టీఏ రామలింగం వివరించారు. ప్రామాణిక ఆస్తి బీమా పాలసీ, ‘భారత్ గృహ రక్ష’ అనేది 10 సంవత్సరాల పాలసీ. దీని ప్రీమియం వెయ్యి రూపాయల బీమాకు దాదాపు 17 పైసలు కాగా, గృహనిర్వాహక పాలసీల కోసం, ప్రీమియం వెయ్యి రూపాయలకు 25 పైసలు. మొత్తంమీద ఈ రకమైన బీమా ప్రీమియం చాలా తక్కువ ఖరీదైనదని చెప్పవచ్చు.

ఉదాహరణకు, మీరు ‘గృహ రక్ష’ పాలసీని కొనుగోలు చేస్తుంటే.. మీ ఫ్లాట్ విలువ 40 లక్షల రూపాయలు అయితే, సుమారుగా 10,000 రూపాయలకు 10 సంవత్సరాల బీమా రక్షణ పొందవచ్చు. ఈ విధంగా, మీరు రోజుకు ఒక కప్పు టీ ధర కంటే కూడా తక్కువ ఖర్చుతో మీ ఇంటికి బీమా పొందవచ్చు.

ఇప్పుడు ఒక ప్రశ్న తలెత్తుతుంది. ప్రజలు తమ ఇళ్లకు బీమా ఎందుకు తీసుకోరు? నిపుణుల అభిప్రాయం ప్రకారం, గృహ బీమాపై ప్రజల్లో అవగాహన కొరవడింది. ప్రభుత్వం.. బీమా నియంత్రణ సంస్థ, IRDA, చొరవ తీసుకుని ఏప్రిల్ 2021లో ‘భారత్ గృహ రక్ష’ అనే ప్రామాణిక పాలసీని ప్రారంభించింది. అయితే, బీమా కంపెనీలు ఈ పాలసీని విక్రయించడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఎక్కడో హిమాచల్ ప్రదేశ్‌లో సంభవించే ప్రకృతి వైపరీత్యాలు తమ ప్రాంతంలో జరగవని ప్రజలు భావించడం దీనికి ఒక కారణం. అందువల్ల, వారికి గృహ బీమా అవసరం లేదని వారు నమ్ముతారు. ఈ అవగాహన కారణంగా, సాపేక్షంగా సరసమైనది అయినప్పటికీ, ప్రజలు హోమ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనే ఆలోచనే చేయరు. అయితే ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే ఈ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం కూడా చాలా అవసరం. ఎందుకంటే ఇది మీ ఇంటికి ఊహించని సంఘటనల నుంచి కీలకమైన రక్షణను అందిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి