Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Royal Enfield Electric Bullet: రాయల్ ఎన్‌ఫీల్డ్‌ ఎలక్ట్రిక్ బుల్లెట్ వచ్చేసింది! ధర, ఫీచర్స్‌ ఎలా ఉన్నాయంటే..

ఈ రోజుల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో చాలా ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. అందుకు తగినట్లుగానే వాహనాల తయారీ కంపెనీలు అత్యాధునిక ఫీచర్స్‌ను ఉపయోగించి ఎలక్ట్రిక్‌ వాహనాలను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. ప్రస్తుత మార్కెట్లో ఎలక్ట్రిక్‌ కార్లు, స్కూటర్లు, బైక్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే టూవీలర్స్‌లో చాలా వాహనాలు అందుబాటులోకి రాగా, కార్లు కూడా మార్కెట్లో విడుదలయ్యాయి. దీంతో చాలా మంది వాటివైపే మొగ్గు చూపుతున్నారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ గర్జన శబ్దాన్ని దాదాపు ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. ఈ బుల్లెట్‌ బైక్‌కు ఎంతో మంది అభిమానులుంటారు.

Royal Enfield Electric Bullet: రాయల్ ఎన్‌ఫీల్డ్‌ ఎలక్ట్రిక్ బుల్లెట్ వచ్చేసింది! ధర, ఫీచర్స్‌ ఎలా ఉన్నాయంటే..
Royal Enfield Electric Bullet
Follow us
Subhash Goud

|

Updated on: Jul 28, 2023 | 6:54 PM

ఈ రోజుల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో చాలా ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. అందుకు తగినట్లుగానే వాహనాల తయారీ కంపెనీలు అత్యాధునిక ఫీచర్స్‌ను ఉపయోగించి ఎలక్ట్రిక్‌ వాహనాలను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. ప్రస్తుత మార్కెట్లో ఎలక్ట్రిక్‌ కార్లు, స్కూటర్లు, బైక్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే టూవీలర్స్‌లో చాలా వాహనాలు అందుబాటులోకి రాగా, కార్లు కూడా మార్కెట్లో విడుదలయ్యాయి. దీంతో చాలా మంది వాటివైపే మొగ్గు చూపుతున్నారు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ గర్జన శబ్దాన్ని దాదాపు ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. ఈ బుల్లెట్‌ బైక్‌కు ఎంతో మంది అభిమానులుంటారు. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ను ఒక్కసారైనా నడపాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. అందుకే కొందరు ఎంత ఖరీదైన సరే కొని తీరుతారు. ఇప్పుడు బుల్లెట్‌ ఎలక్ట్రిక్ రూపంలో రాబోతోంది. బెంగళూరుకు చెందిన బుల్లెటీర్ కస్టమ్స్ కూడా అదే పని చేసింది. వారు బుల్లెట్‌ను ఎలక్ట్రిక్ బుల్లెట్‌గా మార్చారు. ఈ ఎలక్ట్రిక్ బుల్లెట్‌కు ‘గ్యాసోలిన్’ అని పేరు పెట్టారు. ఇది రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ (1984 మోడల్) ఆధారంగా రూపొందించబడింది. బైక్‌కు బాబర్ రూపాన్ని అందించడానికి కాస్త డిజైన్‌ను మార్చారు. ఇందులో కొత్త డిజైన్ ఫ్యూయల్ ట్యాంక్ ఇవ్వబడింది.

బైక్ ఇంజన్ తీసేసి బ్యాటరీని అమర్చి పెద్ద ఇంజన్ లా ఉండే కవర్ తో బ్యాటరీని కవర్ చేశారు. ఇది ఇంధన ట్యాంక్ కింద అమర్చారు. ఇందులో మూడు విభిన్న డ్రైవింగ్ మోడ్‌లు ఉన్నాయి. ఇది 5kW BLDC హబ్ మోటార్, 72V 80Ah బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగించింది కంపెనీ. ఈ బైక్ సాధారణ మోడ్‌లో 90 కిమీ వరకు వెళ్లగలదని తెలుస్తోంది. ఎకానమీ మోడ్‌లో 100 కిమీ కంటే ఎక్కువ. దీని బ్యాటరీని దాదాపు 7 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. దీనిని 15 ఆంపియర్ డొమెస్టిక్ సాకెట్ నుంచి ఛార్జ్ చేయవచ్చు. బైక్ గరిష్ట వేగం 110కిలోమీటర్లు.

ఇవి కూడా చదవండి

బైక్ గురించి ఒక ప్రత్యేక విషయం ఏమిటంటే దీనికి చైన్ సిస్టమ్ అమర్చలేదు.దీనికి బదులుగా ఎలక్ట్రిక్ మోటారు నేరుగా వెనుక చక్రానికి కనెక్ట్ చేయబడి ఉంటుందట. ఈ బైక్‌ను సిద్ధం చేసేందుకు దాదాపు రూ.3 లక్షలు వెచ్చించినట్లు సమాచారం.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి