Rice Export Ban: మోడీ సర్కార్‌ నిర్ణయం అమెరికాపై ప్రభావం.. బియ్యం కొనుగోలు కోసం బారులు తీరిన జనాలు..

అమెరికా నుంచి ఆస్ట్రేలియా, కెనడా వరకు ప్రజలు బియ్యం కొనడానికి పెద్ద సంఖ్యలో బారులు తీరుతున్నారు.ఈ దేశాల్లో నివసిస్తున్న ఎన్నారైలు, ఆఫ్రికన్ పౌరులు పెద్దఎత్తున బియ్యం ప్యాకెట్లను కొనుగోలు చేసి ఇళ్లలో నిల్వ చేసుకుంటున్నారు. రానున్న కాలంలో..

Rice Export Ban: మోడీ సర్కార్‌ నిర్ణయం అమెరికాపై ప్రభావం.. బియ్యం కొనుగోలు కోసం బారులు తీరిన జనాలు..
Rice Export Ban
Follow us
Subhash Goud

|

Updated on: Jul 28, 2023 | 3:22 PM

అమెరికా నుంచి ఆస్ట్రేలియా, కెనడా వరకు ప్రజలు బియ్యం కొనడానికి పెద్ద సంఖ్యలో బారులు తీరుతున్నారు.ఈ దేశాల్లో నివసిస్తున్న ఎన్నారైలు, ఆఫ్రికన్ పౌరులు పెద్దఎత్తున బియ్యం ప్యాకెట్లను కొనుగోలు చేసి ఇళ్లలో నిల్వ చేసుకుంటున్నారు. రానున్న కాలంలో బియ్యం ధరలు పెరిగే అవకాశాలు ఉండటంతో బియ్యం కొరత ఏర్పడే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. రిటైల్ దుకాణాల్లో ప్రజలు పెద్ద ఎత్తున క్యూలో నిల్చున్న వీడియోలు, చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందుకే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆయా దేశాల రిటైల్ దుకాణాలు కూడా బియ్యం ధరలను విపరీతంగా పెంచేశాయి.

భారతదేశ ఎగుమతి నిషేధం ఎఫెక్ట్‌తో..

జూలై 20, 2023న, భారత ప్రభుత్వం సన్నబియ్యం ఎగుమతిని నిషేధించింది. ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం ఎగుమతి చేసే దేశం భారత్. ప్రపంచ ఎగుమతుల్లో 40 శాతం భారత్‌దే. కానీ దేశీయ మార్కెట్‌లో ధరలు పెరగడంతో పాటు 2024 లోక్‌సభ ఎన్నికల్లో ద్రవ్యోల్బణం విషయంలో రాజీపడకుండా మోదీ ప్రభుత్వం బియ్యం ఎగుమతిపై నిషేధం విధించింది. దీని తర్వాత మాత్రమే అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాల్లో ఎన్నారైలు, ఆఫ్రికా మూలాలున్న పౌరులు బియ్యాన్ని కొనుగోలు చేసి నిల్వ చేస్తున్నారు. బాస్మతీయేతర బియ్యం ఎగుమతిపై నిషేధం విధిస్తూ భారత్ తీసుకున్న నిర్ణయం కారణంగా ప్రపంచ మార్కెట్‌లో బియ్యం ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది.

ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన తర్వాత, సరఫరా సమస్యల కారణంగా ప్రపంచ ఆహార సంక్షోభం ఏర్పడింది. గోధుమల ధరలు విపరీతంగా పెరిగినప్పుడు వంటనూనెల ధరలు కూడా పెరిగాయి. ఆ సమయంలో కూడా దేశీయ మార్కెట్‌లో ధరలను నియంత్రించడానికి భారతదేశం గోధుమల ఎగుమతిని నిషేధించింది. ఇప్పుడు బియ్యం ఎగుమతిపై నిషేధం విధించారు. ప్రపంచవ్యాప్తంగా వరి ఉత్పత్తిపై ప్రభావం పడే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

భారత్‌పై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని ఐఎంఎఫ్‌ కోరింది. గ్లోబల్ ఫుడ్ క్రైసిస్ దృష్ట్యా, అంతర్జాతీయ ద్రవ్య నిధి చీఫ్ ఎకనామిస్ట్ పియర్-ఒలివర్ గౌరించాస్ కూడా భారతదేశం నుంచి ఎగుమతులపై నిషేధాన్ని తొలగించాలని అభ్యర్థించారు. ఇది మొత్తం ప్రపంచంలో సంక్షోభాన్ని సృష్టించవచ్చు. ఈ తరహా నిషేధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆహార పదార్థాల ధరలు భారీగా పెరిగిపోతున్నాయన్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..