Jio Fiber: జియో ఫైబర్ 398 ప్లాన్‌తో నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్.. బెనిఫిట్స్ ఎంటో తెలిస్తే ఎగిరి గంతేస్తారు!
భారీ వర్షాలతో జనజీవనం స్థంభించిపోయింది. ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. అయితే ఎగతెరిపి లేని వర్షాలతో ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. అలాంటి సమయంలో ఇంట్లో ఉండి మరింత వినోదాన్ని పొందేందుకు జియో అద్భుతమైన ఆఫర్‌తో ముందుకు వచ్చింది. టెలికం రంగంలో..
భారీ వర్షాలతో జనజీవనం స్థంభించిపోయింది. ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. అయితే ఎగతెరిపి లేని వర్షాలతో ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. అలాంటి సమయంలో ఇంట్లో ఉండి మరింత వినోదాన్ని పొందేందుకు జియో అద్భుతమైన ఆఫర్‌తో ముందుకు వచ్చింది. టెలికం రంగంలో రిలయన్స్ జియో దూసుకుపోతున్న జియో ఫైబర్ తన విలువైన కస్టమర్‌లకు నిరంతరాయంగా వినోదం, కనెక్టివిటీని అందించడానికి అసమానమైన ఆఫర్‌తో ముందుకు వచ్చింది. కొత్త జియో ఫైబర్ టీవీ ప్లాన్ ఈ వర్షాకాలంలో అత్యంత విశ్వసనీయమైన, అంతరాయం లేని కేబుల్ టీవీ, ఇంటర్నెట్ సేవలను అందజేస్తోంది. ఇది తెలంగాణలోని నివాసితులకు మంచి ఆప్షన్. తెలంగాణ అంతటా ఉత్తమ బ్రాడ్‌బ్యాండ్ ప్రొవైడర్‌గా ప్రసిద్ధి చెందిన జియో ఫైబర్ తన అత్యంత సరసమైన వినోదం జియో టీవీ ప్లాన్‌ను నెలకు కేవలం రూ.రూ398తో అందిస్తోంది. ఈ ప్లాన్ అద్భుతమైన ప్రయోజనాలను కలిగి ఉంది. ఇది కస్టమర్‌లు ఇంట్లో ఎంటర్‌టైన్‌మెంట్, కనెక్టివిటీని అనుభవించే విధానాన్ని విప్లవాత్మకంగా మారుస్తుంది.
Jio Fiber TV ప్లాన్ బెనిఫిట్స్:
750+ లైవ్ టీవీ ఛానెల్‌లు అందిస్తుంది.Netflix, Amazon Prime, Disney Hot Star, SunNxt, SonyLiv, Zee5, మరిన్నింటితో సహా 14 అత్యంత ప్రజాదరణ పొందిన ప్రీమియం OTT ప్లాట్‌ఫారమ్‌లకు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా యాక్సెస్ అందిస్తోంది. కస్టమర్‌లు ఇప్పుడు తమకు ఇష్టమైన షోలు, సినిమాలను ఎలాంటి పరిమితులు లేకుండా చూడవచ్చు. అలాగే అపరిమిత డేటాతో కాంప్లిమెంటరీ ఇంటర్నెట్ ప్లాన్, ఎలాంటి అడ్డంకులు లేని స్ట్రీమింగ్, బ్రౌజింగ్ అనుభవాలను అందిస్తుంది.
అపరిమిత కాల్‌లతో కూడిన ఉచిత ల్యాండ్‌లైన్, కాల్ ఛార్జీల గురించి చింతించకుండా కస్టమర్‌లు తమ ప్రియమైన వారితో కనెక్ట్ అయ్యేందుకు వీలు కల్పించేందుకు జియో ఫైబర్ ప్రత్యేకమైన మాన్‌సూన్ ఆఫర్‌ను పరిచయం చేస్తోంది. మాన్‌సూన్ ఆఫర్‌ని పొందుతున్న కస్టమర్‌లు ఉచిత 4K సెట్-టాప్ బాక్స్‌తో పాటు రూ.10,000 విలువైన ఉచిత గిగా రూటర్‌ను అందిస్తోంది. వారి హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సెటప్‌ను మరింత అధునాతనంగా, ఆనందించేలా చేస్తుంది. అదనంగా జియో ఫైబర్ అనుభవాన్ని స్వీకరించడానికి కస్టమర్‌లకు ఏవైనా అడ్డంకులు ఉన్నట్లయితే వాటిని తొలగించడానికి జీరో ఇన్‌స్టాలేషన్ ఛార్జీలు, జీరో డిపాజిట్ ఉంటాయి. మాన్‌సూన్ ఆఫర్ ఒక సాధారణ అవసరంతో వస్తుంది. కస్టమర్‌లు ఈ అద్భుతమైన ఆఫర్, పూర్తి సామర్థ్యాన్ని అన్‌లాక్ చేస్తూ 6 నెలల పాటు ముందస్తు రీఛార్జ్‌ని ఎంచుకోవాలి. అద్భుతమైన సేవలు అందించడానికి జియో ఫైబర్ కస్టమర్‌లు ఇప్పుడు తమ ఇళ్లలో నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్‌ను ఆస్వాదించవచ్చు. ఈ ప్లాన్ కోసం మీ సమీప జియో స్టోర్‌ని లేదాwww.jio.com/fiberకి లాగిన్ అయి పొందవచ్చని జియో తెలిపింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి