Swiggy Credit card: ఫుల్ ప్యాక్‌డ్ ప్రయోజనాలతో స్విగ్గీ క్రెడిట్ కార్డు.. అదిరే ఆఫర్లు, క్యాష్ బ్యాక్‌లు.. పూర్తి వివరాలు ఇవి..
ప్రముఖ ప్రైవేట్ రంగ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ తో కలిసి స్విగ్గీ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్‌ను ప్రారంభించింది. మాస్టర్ కార్డు నెట్ వర్క్ పై దీనిని కో బ్రాండెడ్ కార్డుగా దీనిని స్విగ్గీ ఆవిష్కరించింది. ఈ కార్డు సాయంతో స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు 10శాతం క్యాష్ బ్యాక్ వస్తుంది.

ఇటీవల కాలంలో అన్ని ఆన్ లైన్. ఇది అది అని కాదు, వేసుకొనే వస్త్రాల దగ్గర నుంచి తినే ఆహారం వరకూ అన్ని ఆన్ లౌన్ లోనే దొరకుతున్నాయి. పైగా డోర్ డెలివరీ సదుపాయం ప్రజలకు మరింత సౌఖ్యాన్ని, సౌలభ్యాన్ని అందిస్తున్నాయి. ముఖ్యంగా ప్రజల ఆహార అవసరాలకు తీర్చేందుకని వచ్చిన ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ లు ఈ వర్షాల సీజన్ లో మరింత ఉపయుక్తంగా మారుతున్నాయి. ఈ క్రమంలో తమ బిజినెస్ మరో లెవల్ కు తీసుకెళ్లాలని ప్రణాళిక చేసిన ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ ఒక అడుగు ముందుకేసింది. అదేంటంటే స్విగ్గీ క్రెడిట్ కార్డు. ప్రముఖ ప్రైవేట్ రంగ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ తో కలిసి స్విగ్గీ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్‌ను ప్రారంభించింది. మాస్టర్ కార్డు నెట్ వర్క్ పై దీనిని కో బ్రాండెడ్ కార్డుగా దీనిని స్విగ్గీ ఆవిష్కరించింది. ఈ కార్డు సాయంతో స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు 10శాతం క్యాష్ బ్యాక్ వస్తుంది. అలాగే ప్రముఖ ఈ-కామర్స్ వెబ్ సైట్లో చేసే షాపింగ్ పై కూడా 5శాతం క్యాష్ బ్యాక్ ఉంటుందని హెచ్ డీఎఫ్సీ తన అధికారిక వెబ్ సైట్లో పేర్కొంది.
క్యాష్ బ్యాక్ లు.. రివార్డులు..
స్విగ్గీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ రాహుల్ బోత్రా ఓ ప్రకటనలో మాట్లాడుతూ ఆధునిక వినియోగదారులు తమ ఖర్చులకు విలువను జోడించే రివార్డ్‌లు, ఆఫర్‌లు, క్యాష్‌బ్యాక్ ప్రోగ్రామ్‌లను కోరుకుంటున్నారని తాము గుర్తించామన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తో పాటు మాస్టర్‌కార్డ్ భాగస్వామ్యంతో ఈ ఆల్-ఇన్‌కమ్‌పాసింగ్ కార్డ్‌ని ప్రారంభించామని వివరించారు.
ప్రయోజనాలు ఇవి..
క్రెడిట్ కార్డ్ వినియోగదారులు ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్ కిరాణా డెలివరీ, డైనింగ్ అవుట్ వంటి వాటిపై 10 శాతం క్యాష్‌బ్యాక్ వస్తుంది. అమెజాన్, ఫ్లిప్ కార్ట్, మిన్ త్రా, నైకా, ఓలా, ఉబెర్, ఫార్మ్ ఈజీ, నెట్ మెడ్స్, బుక్ మై షో వంటి ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో ఈ క్రెడిట్ కార్డుతో షాపింగ్ చేస్తే 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను కూడా అందుకుంటారు. ఈ 5% క్యాష్‌బ్యాక్ ప్రయోజనం నైక్, హెచ్ అండ్ ఎం, అడిడాస్, జరా వంటి ఇతర టాప్ బ్రాండ్ వెబ్ సైట్లకు కూడా వర్తిస్తుంది. అంతేకాక స్విగ్గీ మనీ రూపంలో ఖర్చులపై ఒకశాతం క్యాష్ బ్యాక్ పొందుతారు.
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ పేమెంట్ బిజినెస్, కన్స్యూమర్ ఫైనాన్స్, టెక్నాలజీ, డిజిటల్ బ్యాంకింగ్ కంట్రీ హెడ్ – పరాగ్ రావ్ మాట్లాడుతూ డైనింగ్, గ్రోసరీ వంటివి కస్టమర్ రోజువారీ అవసరాలలో ప్రధానమైనవి. వీటిలో ఖర్చుచేసే మొత్తంపై తమ వినియోగదారులకు గొప్ప విలువను క్యాష్ బ్యాక్ రూపంలో అందిస్తున్నామన్నారు. ఈ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు ప్రత్యేకమైన డీల్‌లు, ఉత్పత్తులు, సేవల శ్రేణిపై అసమానమైన సౌలభ్యాన్ని ఆస్వాదించగలరు.
స్విగ్గీ వన్ సభ్యత్వం ఉచితం..
వెల్‌కమ్ ఆఫర్‌లో భాగంగా, కార్డ్ హోల్డర్‌లు 3 నెలల స్విగ్గీ వన్ సభ్యత్వాన్ని ఉచితంగా పొందుతారు. మెంబర్‌షిప్ ప్రోగ్రామ్ ఆహారం, కిరాణా, డైనింగ్ అవుట్, పిక్-అప్ అండ్ డ్రాప్ సర్వీస్‌లలో ప్రయోజనాలను అందిస్తుంది. అదనంగా, స్విగ్గీ హెచ్ డీఎఫ్సీ కార్డ్ హోల్డర్‌లు ఉచిత బస, భోజనం, కాంప్లిమెంటరీ లాయల్టీ మెంబర్‌షిప్‌లు వంటి ప్రపంచ స్థాయి మాస్టర్‌కార్డ్ ప్రయోజనాలను కూడా పొందుతారు. వచ్చే పది రోజుల్లో స్విగ్గీ యాప్ లో ఈ క్రెడిట్ కార్డు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక క్రెడిట్ కార్డు యాన్యువల్ ఫీజు రూ. 500గా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..