Income Tax Return: ఐటీఆర్ ఫైలింగ్ ఫెయిల్ అయ్యిందా? రీఫండ్ కావడం లేదా? ఇలా చేస్తే మీ సమస్య పరిష్కారం..
దేశ వ్యాప్తంగా నాలుగో కోట్ల మంది ఐటీఆర్ ని ఫైల్ చేశారు. అందులో కేవలం 2.4 కోట్ల మంది ఐటీఆర్ లు మాత్రమే ప్రాసెస్ అయ్యాయి. చాలా మంది పన్ను చెల్లింపు దారులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాటిల్లో రీఫండ్ డిలే లేదా ఫెయిల్యూర్, రిస్ట్రిక్టిడ్ రీఫండ్ అని, నో ఎలిజిబుల్ ఫర్ రీఫండ్ అని ఇన్ కమ్ ట్యాక్స్ పోర్టల్ లో చూపిస్తోంది.

ఆర్థిక సంవత్సరం 2022-23నకు ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడానికి తుది గడువు సమీపిస్తోంది. ఇంకా కేవలం నాలుగు రోజు మాత్రమే సమయం ఉంది. జూలై 31తో గడువు ముగిసిపోతోంది. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా నాలుగో కోట్ల మంది ఐటీఆర్ ని ఫైల్ చేశారు. అందులో కేవలం 2.4 కోట్ల మంది ఐటీఆర్ లు మాత్రమే ప్రాసెస్ అయ్యాయి. చాలా మంది పన్ను చెల్లింపు దారులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాటిల్లో రీఫండ్ డిలే లేదా ఫెయిల్యూర్, రిస్ట్రిక్టిడ్ రీఫండ్ అని, నో ఎలిజిబుల్ ఫర్ రీఫండ్ అని ఇన్ కమ్ ట్యాక్స్ పోర్టల్ లో చూపిస్తోంది. అలాంటి సందర్భంలో చాలా మంది టెన్షన్ పడిపోతున్నారు. అయితే ఐటీఆర్ రీఫండ్ ఫెయిల్యూర్ అయితే ఏమి చేయాలి? నిపుణులు చెబుతున్నది ఏంటి? తెలుసుకుందాం రండి.
ఇన్ కమ్ ట్యాక్స్ ఫెయిల్యూర్ కి కారణాలు ఏంటి?
సమాచారం తప్పుగా ఇవ్వడం.. పన్ను చెల్లింపుదారులు బ్యాంక్ ఖాతా నంబర్లు, పేర్లు లేదా చిరునామాలు వంటి వివరాలు కచ్చితమైనవి ఇవ్వాలి. అన్నింట్లోనూ ఒకే రకమైన ఇన్ఫో ఉండాలి. ఇవి తప్పుగా ఇస్తే రీఫండ్ క్రెడిట్ కావడంలో విఫలం కావచ్చు. ముఖ్యంగా పాన్, బ్యాంక్ ఖాతా వివరాలు సరిపోలాలి.
తప్పుగా ఫైల్ చేయడం.. పన్ను రిటర్న్‌లో తప్పులు, తప్పుడు లెక్కలు లేదా అసంపూర్ణ సమాచారం ఉంటే రీఫండ్ రాకపోవచ్చు.
అవుట్ స్టాండింగ్ డిమాండ్.. పన్ను చెల్లింపుదారు ప్రభుత్వానికి డబ్బు చెల్లించాల్సి ఉంటే, ఆదాయపు పన్ను డిమాండ్‌ను భర్తీ చేయడానికి ఈ రీఫండ్ ను ఉపయోగించవచ్చు.
రీఫండ్ ఫెయిల్ అయితే ఏం చేయాలి..
ఒకవేళ మీ ఆదాయ పన్ను రీఫండ్ అవడం ఫెయిల్ అయితే ఈ విధం చేయండి..
- మొదట సమాచారాన్ని ధ్రువీకరించండి.
- ఐటీఆర్ రీఫండ్ స్థితిని తనిఖీ చేయండి. రీఫండ్ విడుదల కోసం అభ్యర్థనను మళ్లీ సమర్పించండి.
- రిటర్న్‌ను సరిదిద్దండి/ సవరించండి.
- బాకీ ఉన్న డిమాండ్ ఏదైనా ఉంటే క్లియర్ చేయండి.
- ఇది కాకుండా, మీ బ్యాంక్ ఖాతా ఆదాయపు పన్ను పోర్టల్‌లో వెరిఫై చేయండి. ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్ ప్రకారం, ఆదాయపు పన్ను రీఫండ్ ను స్వీకరించడానికి ముందుగా వెరిఫై చేసిన బ్యాంక్ ఖాతా మాత్రమే నామినేట్ చేయబడుతుంది.
- విజయవంతమైన ముందస్తు ధ్రువీకరణ కోసం, మీరు తప్పనిసరిగా ఈ-ఫైలింగ్‌తో రిజిస్టర్ అయిన చెల్లుబాటు అయ్యే పాన్, ఆ పాన్ లింక్ అయ్యి ఉ న్న యాక్టివ్ బ్యాంక్ ఖాతాను కలిగి ఉండాలి.
ఐటీ వెబ్‌సైట్ ప్రకారం, పన్ను చెల్లింపుదారులు బహుళ బ్యాంక్ ఖాతాలను ముందుగా ధృవీకరించవచ్చు. ఆదాయపు పన్ను రీఫండ్ కోసం ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాలను నామినేట్ చేయవచ్చు.
కేవలం సేవింగ్ బ్యాంక్ ఖాతాలు, కరెంట్ ఖాతాలు, ఓవర్‌డ్రాఫ్ట్ ఖాతా, ఎన్ఆర్ఓ ఖాతా, నగదు క్రెడిట్ ఖాతాలు మాత్రమే రీఫండ్ కోసం ముందుగా ధృవీకరించబడతాయి. ఈ ప్రయోజనం కోసం లోన్ లేదా పీపీఎఫ్ ఖాతాలను ముందుగా ధ్రువీకరించడం సాధ్యం కాదు.
ముందస్తు ధ్రువీకరణ ప్రక్రియ స్వయంచాలకంగా ఉంటుంది. మీ అభ్యర్థనను సమర్పించిన తర్వాత, అది మీ బ్యాంక్‌కి పంపబడుతుంది. మీ ఈ-ఫైలింగ్ ఖాతాలో ధ్రువీకరణ స్థితి 10-12 పని దినాలలో అప్ డేట్ అవుతుంది.
మీ ఐటీఆర్ రీఫండ్ స్థితిని ఎలా తనిఖీ చేయాలి
- ఈ-ఫైలింగ్ పోర్టల్‌ని సందర్శించండి.
- మెనూలో క్విక్ లింక్స్ సెక్షన్ లోకి వెళ్లి దానిలో నో యువర్ రిఫండ్ స్టేటస్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయండి.
- దానిలో పాన్ నంబర్, అసెసెమెంట్ ఇయర్(2023-24), మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి.
- ఆ వెంటనే మీకు ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేస్తే ఇప్పుడు, ఇది ఆదాయపు పన్ను రీఫండ్ స్థితిని చూపుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..







