LIC Policy: ఎల్‌ఐసీ నుంచి కొత్త టర్మ్ పాలసీ.. కుటుంబానికి రక్షణతో పాటు మరెన్నో ప్రయోజనాలు

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) తన కస్టమర్ల కోసం గొప్ప జీవిత బీమా పాలసీని ప్రారంభించింది. ఈ పాలసీ పేరు జీవన్ కిరణ్ లైఫ్ ఇన్సూరెన్స్. ఇది నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్ వ్యక్తిగత పొదుపు, జీవిత బీమా పథకం. ఈ పాలసీ ప్రత్యేకత ఏమిటంటే.. బీమా చేయబడిన వ్యక్తి..

LIC Policy: ఎల్‌ఐసీ నుంచి కొత్త టర్మ్ పాలసీ.. కుటుంబానికి రక్షణతో పాటు మరెన్నో ప్రయోజనాలు
Lic Policy
Follow us

|

Updated on: Jul 27, 2023 | 8:11 PM

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) తన కస్టమర్ల కోసం గొప్ప జీవిత బీమా పాలసీని ప్రారంభించింది. ఈ పాలసీ పేరు జీవన్ కిరణ్ లైఫ్ ఇన్సూరెన్స్. ఇది నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్ వ్యక్తిగత పొదుపు, జీవిత బీమా పథకం. ఈ పాలసీ ప్రత్యేకత ఏమిటంటే.. బీమా చేయబడిన వ్యక్తి ఆకస్మికంగా మరణిస్తే అటువంటి పరిస్థితిలో అతని కుటుంబానికి ఆర్థిక సహాయం అందుతుంది. జీవిత బీమా పాలసీ మెచ్యూరిటీ వరకు జీవించి ఉంటే చెల్లించిన మొత్తం ప్రీమియం తిరిగి ఇవ్వబడుతుంది. ఎల్‌ఐసీ ఈ కొత్త పాలసీ గురించి అధికారిక ట్విట్టర్ ద్వారా సమాచారం ఇచ్చింది. విశేషమేమిటంటే ఈ పథకంలో ధూమపానం చేసేవారికి, ధూమపానం చేయనివారికి వేర్వేరు ప్రీమియం రేట్లు నిర్ణయించబడ్డాయి. ఈ పాలసీ కింద కనీస ప్రాథమిక హామీ మొత్తం రూ.15,00,000, గరిష్ట ప్రాథమిక హామీ మొత్తం కోసం గడువు నిర్ణయించలేదు. అలాగే ఈ పథకం గృహిణులు, గర్భిణీ స్త్రీలకు వర్తించదని గుర్తించుకోవాలి.

అయితే ఎల్‌ఐసీ జీవన్ కిరణ్ లైఫ్ ఇన్సూరెన్స్ కోసం అతి తక్కువ పాలసీ వ్యవధి 10 సంవత్సరాలు. అయితే పాలసీ గరిష్ట కాల వ్యవధి 40 సంవత్సరాలు. మీరు కోరుకుంటే మీరు మొత్తం ప్రీమియంను ఒకేసారి చెల్లించవచ్చు. అలాగే ఈ పాలసీ తీసుకున్న వారునెలవారీ, త్రైమాసికం, అర్ధ సంవత్సరం, వార్షికంగా కూడా ప్రీమియం చెల్లించుకునే సదుపాయం ఉంది. మీరు ఇంకా కోవిడ్-19 కోసం టీకాలు వేసుకోకపోతే ఈ పథకాన్ని ఉపయోగించుకోలేరు.

ఎల్‌ఐసీ జీవన్ కిరణ్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే పాలసీ మెచ్యూరిటీ పూర్తయిన తర్వాత మొత్తం సేకరించిన ప్రీమియం మొత్తాన్ని బీమా చేసిన వ్యక్తికి ఒకేసారి చెల్లించబడుతుంది. పాలసీ అమలులో ఉన్నట్లయితే, మెచ్యూరిటీపై హామీ ఇవ్వబడిన మొత్తం సాధారణ ప్రీమియం లేదా సింగిల్ ప్రీమియం చెల్లింపు కింద ఎల్‌ఐసీ ద్వారా పొందే మొత్తం ప్రీమియంలకు సమానంగా ఉంటుంది. అయితే, పాలసీ మెచ్యూరిటీ తేదీ తర్వాత జీవిత బీమా కవరేజ్ వెంటనే రద్దు చేయబడుతుంది. జీవన్ కిరణ్ లైఫ్ ఇన్సూరెన్స్ హోల్డర్ మరణిస్తే అతని కుటుంబానికి రెగ్యులర్ ప్రీమియం చెల్లింపు పాలసీ కింద వార్షిక ప్రీమియం 7 రెట్లు లభిస్తుంది. అదేవిధంగా జీవిత బీమా పొందిన వ్యక్తి మరణించినప్పుడు సింగిల్ ప్రీమియంపై 125 శాతం బెనిఫిట్ పొందవచ్చు. ఇది కాకుండా ప్రాథమిక హామీ మొత్తం కూడా చెల్లించబడుతుంది. విశేషమేమిటంటే ఈ పథకం మొదటి సంవత్సరంలో ఆత్మహత్య కేసు మినహా ప్రమాదవశాత్తు మరణాలతో సహా అన్ని రకాల మరణాలను కవర్ చేస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Latest Articles
12 రాశుల వారికి వార ఫలాలు (మే 19నుంచి మే 25, 2024 వరకు)
12 రాశుల వారికి వార ఫలాలు (మే 19నుంచి మే 25, 2024 వరకు)
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?