2BHK Flat: మీరు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఫ్లాట్ కొంటున్నారా? ఈ విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం

చిన్నదైనా, పెద్దదైనా ప్రతి ఒక్కరూ సొంత ఇల్లు కావాలని కలలు కంటారు. ప్రస్తుతం ఇళ్ల నుంచి ఫ్లాట్లను కొనుగోలు చేసే ట్రెండ్ ఎక్కువగా ఉంది. అయితే ఇంటిని కొనుగోలు చేయాలన్నా.. నిర్మించాలన్నా కొన్ని విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. చాలా..

2BHK Flat: మీరు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఫ్లాట్ కొంటున్నారా? ఈ విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం
2bhk Flat
Follow us
Subhash Goud

|

Updated on: Jul 28, 2023 | 3:39 PM

చిన్నదైనా, పెద్దదైనా ప్రతి ఒక్కరూ సొంత ఇల్లు కావాలని కలలు కంటారు. ప్రస్తుతం ఇళ్ల నుంచి ఫ్లాట్లను కొనుగోలు చేసే ట్రెండ్ ఎక్కువగా ఉంది. అయితే ఇంటిని కొనుగోలు చేయాలన్నా.. నిర్మించాలన్నా కొన్ని విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. చాలా మందికి రెరా లేదా రియల్ ఎస్టేట్ నియంత్రణ, అభివృద్ధి చట్టం గురించి తెలియదు. 2BHK ఫ్లాట్‌కు ఎంత స్థలం ఉండాలి..? ఇంటిని నిర్మించడానికి ఎంత స్థలం పడుతుంది అనేది ఖచ్చితంగా తెలుసుకోవడం ముఖ్యం.

భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలు ఉన్న మధ్యతరగతి కుటుంబానికి 2బీహెచ్‌కే ఇల్లు లేదా ఫ్లాట్ సరిపోతుంది. అయితే మీరు లగ్జరీ లేదా సరసమైన ఫ్లాట్ కొనుగోలు చేయాలా అనేది మీ బడ్జెట్‌పై ఆధారపడి ఉంటుంది. 2BHK ఫ్లాట్ లేదా ఇంట్లో రెండు బెడ్‌రూమ్‌లు, హాల్, వంటగది ఉంటాయి. ఒకటి రెండు బాత్‌రూమ్‌లు ఉంటాయి. బాల్కనీని కలిగి ఉండటం కూడా తప్పనిసరి అయితే రెరా (RERA) చట్టం ప్రకారం అది కార్పెట్ ఏరియాలో చేర్చబడదు.

ప్రతి రాష్ట్రం వేర్వేరు రెరా చట్టాలను కలిగి ఉంది. 2BHK పరిమాణం కూడా చట్టం ప్రకారం ప్రమాణంగా వివిధ రాష్ట్రాల్లో భిన్నంగా ఉంటుంది. చట్టం ప్రకారం.. ఢిల్లీ లేదా ముంబై వంటి మెట్రో సిటీలో ఇల్లు ఉంటే 650 చదరపు అడుగులు లేదా అంతకంటే తక్కువ విస్తీర్ణంలో ఫ్లాట్ ఉంటుంది. ఇతర నగరాల్లో ఆ ప్రాంతం దాదాపు 1000 చదరపు అడుగులు లేదా అంతకంటే తక్కువ ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఖాళీ స్థలం ఉంటే స్వయంగా చక్కని 2BHK ఇంటిని నిర్మించుకోవచ్చు. ఆదర్శవంతమైన విశాలమైన రెండు పడకగదుల ఇంటిలో, హాల్ 12×16 అడుగులు, మాస్టర్ బెడ్‌రూమ్ 12×14 అడుగులు, రెండవ బెడ్‌రూమ్ 10×12 అడుగులు ఉండాలి. వంటగది కనీసం 8X10 అడుగులు ఉండాలి. రెండు బాత్‌రూమ్‌లు కూడా 6X8 అడుగులు ఉండాలి. ఇలా 700 నుంచి 750 చదరపు అడుగుల విస్తీర్ణంలో అందమైన ఇంటిని నిర్మించుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి