What’s App Groups: గూగుల్ సెర్చ్‌లో వాట్సప్ గ్రూపులను యాక్సెస్ చేయ్యొచ్చా ? నిపుణులు ఏం అంటున్నారు..
ఇటీవల వాట్సప్ తీసుకువచ్చిన ప్రైవసీ పాలసీ నిబంధన చాలా మంది అనేక రకాల సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటే వాట్సప్‌కు సంబంధించిన పూర్తి విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

ఇటీవల వాట్సప్ తీసుకువచ్చిన ప్రైవసీ పాలసీ నిబంధన చాలా మంది అనేక రకాల సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటే వాట్సప్‌కు సంబంధించిన పూర్తి విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక వాట్సప్ గ్రూపులను గూగుల్ సెర్చ్‌లో యాక్సెస్ చేయ్యొచ్చా ? లేదా ? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఇక గూగుల్ సెర్చ్‌లో ప్రైవేట్ చాట్ ఆధారంగా ఏదైనా వాట్సప్ గ్రూపులోకి మనం జాయిన్ కావోచ్చు. ఈ సమస్యను వాట్సప్ 2019లోనే ఫిక్స్ చేసింది. అయితే ఇది ఇప్పుడు మళ్ళీ రిపీట్ అయ్యిందనే వార్తలు వస్తున్నాయి. అంటే మనం పనిచేసే సంస్థలోని వారు, అలాగే పార్టనర్స్ కలిసి ఉన్న గ్రూపులలోకి తెలియని వ్యక్తి జాయిన్ అయితే.. అతనికి మన కాంటాక్ట్ నెంబర్లు, మన ప్రొఫైల్ ఇమేజెస్ మొత్తం యాక్సెస్ చేసుకోవచ్చు.
తాజాగా ఇదే విషయంపై ఇంటర్నెట్ సెక్యూరిటీ రీసెర్చర్ రాజశేఖర్ రాజహరియా తన ట్విట్టర్ వేదికగా వివరించారు. వాట్సప్ గ్రూపులు ఆన్లైన్ నుంచి యూజర్లను ఎంటర్ అయ్యేందుకు ప్రొత్సహిస్తున్నాయి. థియరిటికల్ ప్రతి ఒక్కరినీ గ్రూపులోకి జాయిన్ అయ్యేందుకు అనుమతి వచ్చేస్తుంది. ఇంగ్లీష్ మీడియా ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కూడా వెబ్ నుంచి వాట్సప్ గ్రూపులు జాయిన్ అవ్వొచ్చని తెలిపింది. దీంతో వాట్సప్ చాట్లను ఎనేబుల్ చేసుకొని.. మనం వెతికిన దానికి తగ్గట్లుగా ప్రైవేట్ గ్రూపులకు కూడా యాక్సెస్ ఇచ్చేయ్యొచ్చు లేదా అందులోకి జాయిన్ అవ్వచ్చు. దాదాపుగా గ్రూపులోకి ఎవరైన కొత్త వ్యక్తి జాయిన్ అయిన వారిని ఎవరు ఎక్కువగా పట్టించుకోరు. అయితే ఎవరో కొత్త వ్యక్తి కాసేపు వరకు గ్రూపులో ఉండి కాంటాక్ట్ వివరాలు.. ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని తర్వాత గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయిపోవచ్చు.
ఇక 2019లో బగ్ వచ్చిన సంగతి తెలిసిందే. దీనిని సెక్యూరిటీ రీసెర్చర్ కనిపెట్టారు. అయితే బగ్‌ను ఫేస్బుక్ వరకు తీసుకెళ్తే ఆ తర్వాత సాల్వ్ చేసి మీడియా అటెన్షన్ కొట్టేశారు. ఆ తర్వాత కొన్ని రోజులు బగ్ గురించి అంతగా ఎవరకు పట్టించుకోలేదు. ప్రస్తుతం దీనితో మరో సమస్య వచ్చినట్లుగా కనిపిస్తోంది. గూగుల్ సెర్చ్‌లో ఇప్పటివరకు గ్రూపుల పేర్లు మాత్రమే వెతికినా.. ఇప్పుడు ప్రొఫైల్ పేర్లు కూడా ఇండెక్స్ అవుతున్నాయి. కొన్నిసార్లు వారి ఫోన్ నెంబర్లతో పాటు ప్రొఫైల్ పిక్చర్క్ కూడా కనిపిస్తున్నాయని 2020 జూన్‌లోనే రిపోర్ట్ చేశారు.
రాజశేఖర్ రాజహరియా ట్వీట్..
Your @WhatsApp groups may not be as secure as you think they are. WhatsApp Group Chat Invite Links, User Profiles Made Public Again on @Google Again. Story – https://t.co/GK2KrCtm8J#Infosec #Privacy #Whatsapp #infosecurity #CyberSecurity #GDPR #DataSecurity #dataprotection pic.twitter.com/7PvLYuM9xD
— Rajshekhar Rajaharia (@rajaharia) January 10, 2021
Also Read: WhatsApp to Stop Working : అనుకున్నదే జరిగింది.. మిలియన్ల కొద్ది ఫోన్లలో నిలిచిపోయిన వాట్సప్ సేవలు..
WhatsApp to Stop Working : 2021 కొత్త సంవత్సరంలో వాట్సప్ పనిచేయకుంటే ఇలా చేయండి..