AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్ మహానగరానికి మరో అంతర్జాతీయ సంస్థ.. భారీ పెట్టుబడితో గ్లోబ‌ల్ కేప‌బిలిటీ సెంట‌ర్‌

హైద‌రాబాద్‌లో భారీ పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకు వ‌చ్చింది అమెరికాకు చెందిన మాస్ మ్యూచువల్ సంస్థ.

హైదరాబాద్ మహానగరానికి మరో అంతర్జాతీయ సంస్థ.. భారీ పెట్టుబడితో గ్లోబ‌ల్ కేప‌బిలిటీ సెంట‌ర్‌
Balaraju Goud
|

Updated on: Jan 11, 2021 | 12:15 PM

Share

US Based mass mutual company : తెలంగాణ‌కు పెట్టుబ‌డుల ప్రవాహం కొన‌సాగుతూనే ఉంది. మరో అతిపెద్ద గ్లోబల్ కంపెనీ హైదరాబాద్‌కు రాబోతుంది. ఈ మేరకు కంపెనీ ప్రతినిధులతో రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీ.రామారావు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అమెజాన్, గూగుల్, ఫేస్‌బుక్, ఆపిల్, ఫియ‌ట్ క్రిస్లర్ సంస్థలు పెట్టుబ‌డులు పెడుతున్నట్లు ప్రక‌టించిన సంగతి తెలిసిందే. ఈ కంపెనీల స‌ర‌స‌న తాజాగా మ‌రో అంత‌ర్జాతీయ కంపెనీ వచ్చి చేరింది.

హైద‌రాబాద్‌లో భారీ పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకు వ‌చ్చింది అమెరికాకు చెందిన మాస్ మ్యూచువల్ సంస్థ. న‌గ‌రంలో గ్లోబ‌ల్ కేప‌బిలిటీ సెంట‌ర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆ సంస్థ ప్రక‌టించింది. అమెరికా వెలుపల రూ. వెయ్యి కోట్ల పెట్టుబ‌డులు పెట్టనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఇందులో భాగంగానే మాస్ మ్యూచువ‌ల్ తరుపున హైద‌రాబాద్‌లో పెట్టుబ‌డులు పెడుతున్నట్లు ప్రక‌టించ‌డంతో రాష్ర్ట ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి హ‌ర్షం వ్యక్తం చేశారు.

ఇదే విషయానికి సంబంధించి మంత్రి కేటీఆర్ ట్వీట్ వేదికగా షేర్ చేశారు. ఈ వారానికి ఇంతకు మించిన శుభారంభం ఏముంటుంది? టాప్ ఫార్చున్ 500 కంపెనీల్లో ఒక‌టైన మాస్ మ్యూచువ‌ల్‌ను రాష్ర్టంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకు రావడంచాలా సంతోషంగా ఉంద‌ని కేటీఆర్ ట్వీట్టర్‌లో పేర్కొన్నారు.

Read Also…. నెంబర్ వన్ స్థానానికి చేరుకున్న ప్రధాని మోదీ.. 6.47 కోట్ల మంది ట్విట్టర్​ ఫాలోవర్లతో మొదటి స్థానం

Follow Us
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!