WhatsApp to Stop Working : 2021 కొత్త సంవత్సరంలో వాట్సప్ పనిచేయకుంటే ఇలా చేయండి..
2021 కొత్త సంవత్సరంలో కొందరికి ఇది బ్యాడ్ న్యూస్. ఎందుకంటే కొన్ని ఫోన్లలో ఇక మెసేజింగ్ యాప్ వాట్సాప్ పనిచేయదు. ప్రతి ఏటా పాత ఓఎస్ వెర్షన్ మొబైళ్లకు సేవలు నిలిపివేస్తున్నట్లుగానే..

WhatsApp to Stop Working : 2021 కొత్త సంవత్సరంలో కొందరికి ఇది బ్యాడ్ న్యూస్. ఎందుకంటే కొన్ని ఫోన్లలో ఇక మెసేజింగ్ యాప్ వాట్సాప్ పనిచేయదు. ప్రతి ఏటా పాత ఓఎస్ వెర్షన్ మొబైళ్లకు సేవలు నిలిపివేస్తున్నట్లుగానే.. ఈ సారి కూడా ఆ దిశగా వాట్సాప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జనవరి 1 నుంచి మిలియన్ల కొద్దీ పాత ఫోన్లకు సేవలు ఆగిపోనున్నాయి. అంతే కాదు కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో కూడా వాట్సప్ పనిచేయదు. ఒక వేళ మీఫోన్లు యాపిల్, ఆండ్రాయిడ్ ఓఎస్ అప్డేట్కు సపోర్ట్ చేయకపోతే వీలైనంత త్వరగా వాట్సాప్ డేటాను రికవరీ చేసుకోవడం మంచిది.
వాట్సప్ పనిచేయని మొబైళ్ల ఇవే..
- ఐఓఎస్ 9 (IOS-9) కన్నా.. పాత వెర్షన్ ఐఫోన్ వాడుతున్న వారికి కొత్త ఏడాది నుంచి వాట్సాప్ సేవలు ఆగిపోనున్నాయి. అంటే ఐఫోన్ 4లో ఇకపై వాట్సాప్ నిలిచిపోతుంది.
- ఐఫోన్ 4ఎస్, 5, 5ఎస్, 5సీ, 6, 6ఎస్ (iPhone 4S, 5, 5S, 5C, 6 and 6S) వంటి ఫోన్లను ఐఓఎస్ 9కి అప్డేట్ చేసుకుంటే వాట్సాప్ వాడుకునేందుకు వీలుంది.
- ఆండ్రాయిడ్ 4.0.3 వెర్షన్ కన్నా పాత వెర్షన్‌తో నడుస్తున్న వాటికి జనవరి 1 నుంచి వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి.
- మీ ఫోన్ ఆండ్రాయిడ్ 4.0.3, అంతకన్నా కొత్త వెర్షన్‌కు అప్‌గ్రేడ్ అయితే అందులో వాట్సాప్ వాడుకునేందుకు వీలుంది.