Jagan Government: ఏపీ నిరుద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. 2021లో కొలువుల జాతర..!
Jagan Government: ఏపీ నిరుద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ అందించనుంది. 2021 కొలువుల జాతర చేయనుంది. మూడు డీఎస్సీ ఎంట్రెన్స్‌లు..
Jagan Government: ఏపీ నిరుద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ అందించనుంది. 2021 కొలువుల జాతర చేయనుంది. మూడు డీఎస్సీ ఎంట్రెన్స్‌లు నిర్వహించేందుకు కసరత్తులు చేస్తోంది. స్పెషల్ డీఎస్సీ, లిమిటెడ్ డీఎస్సీ, రెగ్యులర్ డీఎస్సీ పేరిట నోటిఫికేషన్లను జారీ చేయనుంది. గత డీఎస్సీలోని ఖాళీలను భర్తీ చేసేందుకు ఫిబ్రవరిలో లిమిటెడ్ డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వనుండగా.. దివ్యాంగ విద్యార్ధులకు బోధించేందుకు స్పెషల్ బీఈడీ చేసినవారి కోసం స్పెషల్ డీఎస్సీ నిర్వహించనున్నారు.
ఈ రెండు డీఎస్సీలకు సంబంధించిన ప్రక్రియ మొదలు కాగా.. ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలకు సంబంధించిన కసరత్తు పూర్తయిందని తెలుస్తోంది. ఇక టెట్(టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) తర్వాత రెగ్యులర్ డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడనుంది. కాగా, ఇటీవల ఎస్‌ఈఆర్టీ టెట్ సిలబస్ రూపకల్పన పూర్తి చేయగా.. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన తర్వాత అధికారికంగా ప్రకటించనున్నారు.
Also Read: ఏపీలో కొత్త కరోనా వైరస్ మూలాలు.. న్యూ వేరియంట్‌కు N440K నామకరణం.. హెచ్చరిస్తున్న సైంటిస్టులు..