Health News: చలికాలంలో ఈ పండ్లను తింటే ఎంతో మేలు చేస్తాయి.. అవేంటో చూసేద్దామా..

ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో చలి తీవ్రత మరింత ఎక్కువైంది. దీంతో చాలా మంది తమ శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటారు.

Health News: చలికాలంలో ఈ పండ్లను తింటే ఎంతో మేలు చేస్తాయి.. అవేంటో చూసేద్దామా..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 29, 2020 | 1:37 PM

ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో చలి తీవ్రత మరింత ఎక్కువైంది. దీంతో చాలా మంది తమ శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. శరీరానికి వేడినిచ్చే ఆహర పదార్థాలను తీసుకుంటున్నారు. అయితే చలికాలంలో చర్మ సమస్యలతో చాలా ఇబ్బందులు పడుతుంటారు. సీజనల్ వ్యాధులతోపాటు, చర్మం పగలడం చాలా మందికి కలిగే ఇబ్బందులు. ఇందు కోసం రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తుంటారు. ఇకా అలాంటి ఆహారాల్లో కివీ పండ్లు ముఖ్యమైనవి.

చలికాలంలో కివి పండ్లను తప్పనిసరిగా తీసుకోవాలంట. వీటిల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. వీటివల్ల చలీకాలంలో శరీరానికి కావాల్సిన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సీజనల్ వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి. అలాగే చర్మం పగలకుండా మృదవుగా ఉండటంతోపాటు సురక్షితంగా ఉంటుంది. ఈ పండ్లలో విటమిన్ ఇ, ఫోలేట్, పొటాషియం తదితర పోషకాలు ఉండడం వలన.. చలీకాలంలో వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్లు రాకుండా చూస్తాయి. కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా దాదాపు తగ్గుతాయి. శరీరంలో ఉండే కొవ్వును కివీలోని పోషకాలు తగ్గిస్తాయి. దీంతో బరువు నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా చలికాలంలో చాలా మందికి జీర్ణక్రియ సరిగా పనిచేయదు. దీంతో చాలా రకాల సమస్యలు ఎదుర్కోంటారు. కివీ పండ్లను రోజు తింటే జీర్ణ వ్యవస్థ సరిగా పనిచేస్తుంది. అంతే కాకుండా మహిళలను ఈ పండ్లను పేస్ట్‏గా చేసి ఫేస్ ప్యాక్‏లా వేసుకుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది. చలికాలం వల్ల చర్మం పగలకుండా ఉంటుంది. మరీ ఎందుకు ఆలస్యం ఈ రోజూవారీ దినచర్యలో కివీ పండ్లను కూడా ఒక భాగం చేసుకోండి.