మహిళలపై పెరిగిన వేధింపులు.. తగ్గిన క్రైమ్ కేసులు.. 2020 నివేదిక విడుదల చేసిన సీపీ మహేష్..
రాజకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 12 శాతం క్రైమ్ రేట్ తగ్గినట్లుగా సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. కానీ గతేడాదితో పోలీస్తే మహిళలపై దాడులు 11 శాతం పెరిగినట్లుగా
రాజకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 12 శాతం క్రైమ్ రేట్ తగ్గినట్లుగా సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. కానీ గతేడాదితో పోలీస్తే మహిళలపై దాడులు 11 శాతం పెరిగినట్లుగా చెప్పారు. ఈ మేరకు సోమవారం ఆయన 2020 సంవత్సర నివేదిక వెల్లడించారు. 2019లో మహిళలపై వేధింపుల కేసులు 314 నమోదయ్యాయని.. ఈసారి 329 కేసులు నమోదయ్యాయని తెలిపారు. అటు వరకట్న వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న వారి సంఖ్య 9 నుంచి 2020 వరకు 23 కేసులు నమోదయ్యాయని చెప్పారు.
సోమవారం విలేకరుల సమావేశంలో సీపీ మహేష్ భగవత్ మాట్లాడుతూ.. మహిళలపై ఆత్యాచార కేసులు ఎక్కువగా నమోదయ్యాయని.. ఇందులో ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేసివారిపై చీటింగ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. మహిళలకు తమకు జరిగిన అన్యాయాలపై ధైర్యంగా వచ్చి పోలీసు స్టేషన్లలో కేసులు పెడుతున్నారని.. ఇందుకు కారణం షీ టీంల మీద ఏర్పడిన నమ్మకంతోనే అని సీపీ మహేశ్ భగవత్ అన్నారు. కాగా గతేడాది 20,349 కేసులు నమోదుకాగా ఈ సారి 20,641 కేసులు నమోదయ్యాయని చెప్పారు.
కొవిడ్-19 లాక్ డౌన్ తర్వాత రాచకొండ పోలీస్ కమిషనరేట్లో నిర్వహించిన పరీక్షల్లో 1,051 పోలీసులకు కరోనా పాజిటివ్ తేలిందని.. ఒకరు మరణించారని తెలిపారు. మల్కాజ్ గిరి, భువనగిరి ప్రాంతాలతో పోల్చుకుంటే రాచకొండ, LB నగర్ ప్రాంతాలలో ఎక్కువగా కేసులు నమోదయ్యాయన్నారు. మల్కాజ్ గిరిలో 9,119 కేసులు నమోదు కాగా ఈసారి 6,014 కేసులు నమోదయ్యయన్నారు. లాక్ డౌన్ కారణంగా రోడ్డు ప్రమాదాల కేసుల సంఖ్య 2019లో 2,990 నమోదుకాగా ఈసారి 2,047 కేసులు నమోదయ్యాయి. నగరంలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న కేసులు 25 నమోదయ్యాయని తెలిపారు. ప్రాథమిక అంచనాల ప్రకారం సైబర్ క్రైమ్ రేట్ 200 శాతం పెరిగాయి. గతేడాది మొత్తం సైబర్ కేసులు 333 నమోదుకాగా ఈసారి 704 కేసులు నమోదయ్యాయని తెలిపారు.