EV Charger: మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా మారాల్సిందే.. ప్రతి ఇంట్లో అది తప్పనిసరి మరి
ఇటీవల కాలంలో దేశం ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపు పరివర్తన చెందుతుంది. కాబట్టి కచ్చితంగా ఇంట్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఛార్జింగ్ చేసుకునే సదుపాయం ఏర్పరచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ప్రారంభంలోనే ఈవీ ఛార్జర్‌ను ఏర్పాటు చేసుకుంటే భవిష్యత్‌లో అదనపు ఖర్చు నుంచి తప్పించుకోవచ్చు.

మారుతున్న కాలాని అనుగుణంగా మనం కూడా మారాలని అందరూ చెబుతుంటారు. భారతదేశంలో చాలా మంది సొంతిల్లు అనేది ఓ కలగా ఉంటుంది. భవిష్యత్‌కు అనుగుణంగా ఇల్లు నిర్మించుకుంటూ ఉంటారు. ఇటీవల కాలంలో దేశం ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపు పరివర్తన చెందుతుంది. కాబట్టి కచ్చితంగా ఇంట్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఛార్జింగ్ చేసుకునే సదుపాయం ఏర్పరచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ప్రారంభంలోనే ఈవీ ఛార్జర్‌ను ఏర్పాటు చేసుకుంటే భవిష్యత్‌లో అదనపు ఖర్చు నుంచి తప్పించుకోవచ్చు. ఇళ్లల్లో ఈవీ వాహనాల ఛార్జింగ్ కోసం సంప్రదాయ 15 ఏఎంపీ హోమ్ సాకెట్‌లను ఏర్పాటు చేసుకోవడం మంచిది. అయితే ఈ చార్జర్ ఏర్పాటు చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో? ఓ సారి తెలుసకుందాం.
మార్కెట్లో అనేక రకాల ఈవీ చార్జింగ్ యూనిట్‌లు ఉన్నప్పటికీ అదనపు సౌలభ్యం కోసం మరింత శక్తివంతమైన వేగవంతమైన ఛార్జింగ్ సామర్థ్యం ఉన్న యూనిట్‌ను సెటప్ చేయడం మంచిది. ముఖ్యంగా అన్ని గృహాలు ఈవీ ఛార్జర్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి అర్హత కలిగి ఉండవు. మీ ఇంటి ఎలక్ట్రికల్ సిస్టమ్ విధిగా ఉందో లేదో తెలుసుకోవడానికి మీరు మీ స్థానిక విద్యుత్ బోర్డుతో తనిఖీ చేయాలి. మీరు స్థానిక అధికారుల నుంచి అనుమతిని కూడా పొందాల్సి ఉంటుంది.
ఛార్జర్, స్థలం
ఈవీ ఛార్జర్‌లలో రెండు ప్రధాన రకాలు ఉన్నాయి లెవల్ 1, లెవెల్ 2. లెవల్ 2. ఛార్జర్‌లు 240-వోల్ట్ అవుట్‌లెట్‌ను ఉపయోగిస్తాయి. లెవల్ 1 ఛార్జర్‌ల కంటే చాలా వేగంగా ఉంటాయి. మీరు మీ అవసరాలకు సరైన ఛార్జర్‌ను ఎంచుకోవాలి. ఛార్జర్ పాయింట్‌ను నీరు, ఇతర ప్రమాదాలకు దూరంగా సురక్షితమైన ప్రదేశంలో అమర్చాలి.



ఛార్జర్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవడం
ఛార్జర్‌ను మీరే ఇన్‌స్టాల్ చేసుకోవడం మీకు సౌకర్యంగా లేకుంటే మీ కోసం దీన్ని చేయడానికి మీరు ఎలక్ట్రీషియన్ సంప్రదించాలి. ఎలక్ట్రీషియన్ 240 వోల్ట్ అవుట్‌లెట్, ఛార్జర్‌ను ఇన్‌స్టాల్ చేయాలి.
ఛార్జర్‌ని పరీక్షించడం
ఛార్జర్‌ని ఇన్‌స్టాల్ చేసిన తర్వాత, అది సరిగ్గా పని చేస్తుందో లేదో నిర్ధారించుకోవడానికి మీరు దాన్ని పరీక్షించాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
