AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EV Charging Centers: గ్రేటర్‌లో ఎలక్ట్రిక్ వాహనాల కోసం పబ్లిక్ ఛార్జింగ్ సెంటర్లు.. ప్రయోగాత్మకంగా 14 ఏర్పాటు.. ఎక్కడెక్కడ అంటే..!

EV Charging Centers: ఎలక్ట్రికల్ వాహన దారులకు జిహెచ్ఎంసి ద్వారా నగరంలో పబ్లిక్ ఛార్జింగ్ సెంటర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. దినదినాభివృద్ది..

EV Charging Centers: గ్రేటర్‌లో ఎలక్ట్రిక్ వాహనాల కోసం పబ్లిక్ ఛార్జింగ్ సెంటర్లు.. ప్రయోగాత్మకంగా 14 ఏర్పాటు.. ఎక్కడెక్కడ అంటే..!
Subhash Goud
|

Updated on: Jul 01, 2022 | 1:44 PM

Share

EV Charging Centers: ఎలక్ట్రికల్ వాహన దారులకు జిహెచ్ఎంసి ద్వారా నగరంలో పబ్లిక్ ఛార్జింగ్ సెంటర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. దినదినాభివృద్ది చెందుతున్న నగరంలో రోడ్ల అభివృద్దికి ప్రాధాన్యతనివ్వడం సిగ్నల్ ఫ్రీ నగరంగా అభివృద్ధి చేయడం జరిగింది. దాంతో వాహన సంఖ్య పెరగడంతో వాహన కాలుష్యం పెరిగింది. వాహన కాలుష్యం, చమురు వినియోగాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రికల్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశేష కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలక్ట్రికల్ వాహనాల ప్రజల్లో మక్కువ పెరుగుతున్నది. వాహన ఖరీదు ఎక్కువైనా పెరుగుతున్న ఇంధన ధరల వలన ప్రజలు మక్కువ కనబరుస్తున్నారు. దానికి తోడు ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు, ప్రోత్సాహకాల వలన కూడా ఎలక్ట్రికల్ వాహనాల వాడకం పెరుగుతున్నది. దేశంలో 2030 నాటికి అన్ని రకాల వాహనాల ఈ -వెహికిల్ లైనా రెండు, మూడు చక్రాల వాహనాలు, బస్సులు, కార్లు ఎక్కువ శాతం వినియోగానికి తీసుకొని రావడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక పాలసీ రూపొందించి ఎలక్ట్రికల్ వాహనాల కంపెనీల ఏర్పాటు చేసేందుకు విశేషంగా కృషి చేసున్నది.

ఈ – వాహనాల పాలసీనీ కూడా విడుదల చేశారు. ఈ పాలసీ లో స్టీరింగ్ కమిటీతో పాటు ఆయా శాఖల స్టేక్ హోల్డర్ గా వ్యవహరించనున్నాయి. ఇవి ఐటి శాఖ ఎలక్ట్రానిక్ వింగ్, రవాణా శాఖ,టి యస్ రెడ్ కో, TSSPDCL/TS NPDCL,MAUD,TS RTC, అయా శాఖలు ఈ – వెహికిల్ పాలసీ ఆపరేషన్ గైడ్ లైన్స్, సబ్సిడీ, పబ్లిక్ ఛార్జింగ్ వసతులు, సీలింగ్ కాస్ట్, ఎలక్ట్రిసిటీ టారిఫ్, అర్బన్ ఏరియాలో పబ్లిక్ ఛార్జింగ్ ఏర్పాట్లు, అర్టీసీలో ఛార్జింగ్ ఏర్పాట్లకు కావాల్సిన వసతులు ఆయా శాఖలు చేయవల్సిన అంశాలను ఈ పాలసీలో నిర్దేశించారు.

ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాల పాలసీకి రాష్ట్ర నోడల్ ఏజెన్సీ అయిన తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ లిమిటెడ్(Telangaba state Renewable Energy Development Corporation Ltd, TS REDCO.) నగరంలో పలు చోట్ల ఎలక్ట్రికల్ వాహనాల కోసం పబ్లిక్ ఛార్జింగ్ సెంటర్ ఏర్పాటుకు జీహెచ్‌ఎంసీతో ఒప్పందం చేసుకోనుంది. వాహన ప్రవాహం ఎక్కువగా ఉన్న కారిడార్‌లో, జాతీయ, రాష్ట్ర రహదారులకు సమీపంలో ఏర్పాటుకు లొకేషన్‌లను జీహెచ్‌ఎంసీ లొకేషన్ లను గుర్తించి టి.ఎస్ రెడ్కోకు జాబితాను ఇస్తారు. ఈ నేపథ్యం లో j 230 లొకేషన్ లు జి హెచ్ ఏం సి ద్వారా , హెచ్ ఏం డి ఎ పరిధిలో 100 లొకేషన్ జాబితా టి యస్ రెడ్ కో కు అందజేశారు. ప్రతి లొకేషన్‌లో ఫాస్ట్ స్పీడ్ ఛార్జింగ్, స్లో స్పీడ్ ఛార్జింగ్ సెంటర్లు ఉంటాయి. ఫీజిబిలిటీ బట్టి యుద్ద ప్రాతిపదికన పబ్లిక్ ఛార్జింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తారు. ఇంధన సంస్థలు కూడా వారి వారి అనుకూలతను బట్టి ఛార్జింగ్ సెంటర్లను ఏర్పాటు చేసుకుంటారు.

ఇవి కూడా చదవండి

జీహెచ్‌ఎంసీ పరిధిలో ఏర్పాటు చేసే పబ్లిక్ ఛార్జింగ్ సెంటర్ల వినియోగంతో పాటు తద్వారా వచ్చే ఆదాయాన్ని అంచనా వేసేందుకు ప్రయోగాత్మకంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 14 లొకేషన్ లో ఏర్పాటుకు టీఎస్‌ రెడ్‌కో నిర్ణయించింది. TS REDCO వారు పబ్లిక్ ఛార్జింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేసిన తర్వాత యూనిట్‌కు 1 రూపాయి చొప్పున జీహెచ్‌ఎంసీకి ప్రతి మూడు నెలల కొకసారి చెల్లింపులు చేస్తారు. ఈ పక్రియను కొనసాగించేందుకు జీహెచ్‌ఎంసీతో TS REDCO ఒప్పందం చేసుకోవాల్సి ఉంది. ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసే ఈ- వెహికిల్ పబ్లిక్ ఛార్జింగ్ సెంటర్లు జీహెచ్‌ఎంసీ పరిధిలో ఫాస్ట్ ఛార్జింగ్ గల DC -001(15KW) కెపాసిటీ గల ఒక్కొక్క సెంటర్‌లో ఒకటి చొప్పున మొత్తం 14 లొకేషన్ లో ఏర్పాటు చేయనున్నారు. అదే లొకేషన్లలో లోఛార్జింగ్ గల C (122-150 KW ) సామర్థ్యం గలవి ఒక్కొక్క లోకేష్ లో 2 చోపున టీఎస్ రెడ్కో ఏర్పాటు చేస్తారు.

ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసే పబ్లిక్ ఛార్జింగ్ సెంటర్లు:

1. ఇందిరా పార్కు (ల్యాండ్ మార్కు: పార్కింగ్ ప్లేస్)

2. కేబీఆర్‌ పార్క్ గేట్1 ( గేట్ 1 పార్కింగ్)

3. కేబీఆర్‌ పార్క్ గేట్ 3 (గేట్ 3 పార్కింగ్)

4. కేబీఆర్‌ పార్క్ గేట్ 6 (గేట్ 6 పార్కింగ్ NTR క్యాన్సర్ హాస్పిటల్)

5. ట్యాంక్ బండ్ (కందుకూరి వీరేశ లింగం విగ్రహం వద్ద)

6. బషీర్ బాగ్ రోడ్డు (ఒత్రిస్ రెస్టారెంట్ ఎదురుగా)

7. గన్ ఫౌండ్రీ (మహా బూబియ గర్ల్స్ జూనియర్ కళాశాల)

8. మునిసిపల్ పార్కింగ్ అబిడ్స్ (జి పీ ఓ)

9. నానాక్ రామ్ గుడా (GHMC స్పోర్ట్స్ కాంప్లెక్స్)

10. మహావీర హరినవస్తలి నేషనల్ పార్క్(అనన్య రిసార్ట్)

11. శిల్ప రామం 2 నాగోల్ బ్రిడ్జి (మెట్రో ఆఫీస్)

12. ఉప్పల్ (మెట్రో స్టేషన్ పార్కింగ్)

13. ఓవైసీ హాస్పిటల్ (ఇన్నర్ రింగ్ రోడ్డు సంతోష్ నగర్)

14. తాజ్ త్రి స్టార్ హోటల్ (యస్ డి రోడ్డు)

ఎలక్ట్రికల్ వాహన దారులకు పబ్లిక్ ఛార్జింగ్ సెంటర్ల ద్వారా అందుబాటులోకి రానున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి