Gold Price: బంగారం ప్రియులకు షాకింగ్‌ న్యూస్‌.. భారీగా పెరగనున్న ధర.. ఎందుకంటే..!

Gold Price: మహిళలు అత్యంత ప్రాధాన్యతనిచ్చే పసిడి మరింత పరుగులు పెట్టనుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం బంగారం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రం బంగారంపై..

Gold Price: బంగారం ప్రియులకు షాకింగ్‌ న్యూస్‌.. భారీగా పెరగనున్న ధర.. ఎందుకంటే..!
Gold Price
Follow us
Subhash Goud

|

Updated on: Jul 01, 2022 | 12:24 PM

Gold Price: మహిళలు అత్యంత ప్రాధాన్యతనిచ్చే పసిడి మరింత పరుగులు పెట్టనుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం బంగారం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రం బంగారంపై దిగుమతి పన్ను 7.5 శాతం నుంచి 12.5 శాతానికి పెంచింది. రూపాయి రికార్డు కనిష్ట స్థాయికి పడిపోవడంతో దిగుమతులను అరికట్టేందుకు ఈ చర్య తీసుకుంది కేంద్రం. మే నెలలో బంగారం దిగుమతులు మొత్తం 107 టన్నులు కాగా, జూన్‌లో ఎగుమతులు కూడా గణనీయంగా ఉండే అవకాశం ఉంది. మే నెలలో దేశ వాణిజ్య లోటు అత్యధికంగా $24.29 బిలియన్లకు చేరుకుంది. భారతదేశం మేలో 6.03 బిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకుంది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే తొమ్మిది రెట్లు పెరిగింది. ప్రపంచంలో అత్యధికంగా బంగారాన్ని వినియోగించే దేశాల్లో భారతదేశం రెండో దేశంగా ఉంది.

కరోనా మహమ్మారి తర్వాత బంగారంకు డిమాండ్ పెరగడంతో ఇండియా పదేళ్లలో దిగుమతి చేసుకున్నదాకికంటే గత ఏడాది అత్యధికంగా దిగుమతి చేసుకుందని నివేదికలు చెబుతున్నాయి. కాగా, బంగారం అక్రమ రవాణాను తగ్గించేందుకు, బంగారంపై దిగుమతి సుంకాన్ని 7.5 శాతం నుంచి 4 శాతానికి తగ్గించాలని దేశంలోని ప్రముఖ వ్యాపారులు ఈ ఏడాది ప్రారంభంలో ప్రభుత్వానికి విన్నివించుకున్నారు. దీనికి విరుద్దంగా ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని 5 శాతం మేరక పెంచింది. పసిడిపై దిగుమతి సుంకం పెరగడంతో ఈ భారం రిలైల్‌ కొనుగోలుదారులపై పడనుంది. దీంతో బంగారం ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉంది.

కాగా, ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి 10 గ్రాముల బంగారంపై స్వల్పంగా తగ్గుముఖం పట్టగా, ఇదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు 10 గ్రాముల బంగారంపై భారీగా పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1200 వరకు పెరుగగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1310 వరకు ఎగబాకింది. ఇక దేశీయంగా పసిడి ధరలను పరిశీలిస్తే.. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,850 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,200 వరకు చేరుకుంది. ఇక వెండి పరిస్థితి కూడా అంతే. కిలో వెండిపై రూ.400 పెంపుతో ప్రస్తుతం ధర రూ.59,000లకు చేరుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి