AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bzinesslite E-scooter: ఈవీ ఇండస్ట్రీలో సంచలనం.. 12 నిమిషాల్లో చార్జ్ అయ్యే సూపర్ ఈవీ స్కూటర్ రిలీజ్

తాజాగా లాగ్9కు సంబంధించి అల్ట్రా-ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీ టెక్ ద్వారా ఆధారితమైన క్వాంటం ఎనర్జీ బిజినెస్ లైట్ భారతదేశంలో లాస్ట్-మైల్ డెలివరీ విభాగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని చూస్తోంది. స్పీడ్ ఛార్జింగ్ సమయానికి అనుగుణంగా బ్యాటరీ ప్యాక్ రూపొందించాలని చూస్తోంది. బెంగుళూరుకు చెందిన బ్యాటరీ టెక్ స్టార్టప్ లాగ్9 బిజినెస్ లైట్ కార్గో ఇ-స్కూటర్‌ను విడుదల చేయడానికి హైదరాబాద్ ఈవీ ఓఈఎం క్వాంటం ఎనర్జీతో జతకట్టింది.

Bzinesslite E-scooter: ఈవీ ఇండస్ట్రీలో సంచలనం.. 12 నిమిషాల్లో చార్జ్ అయ్యే సూపర్ ఈవీ స్కూటర్ రిలీజ్
Ev Scoooter
Nikhil
|

Updated on: Jun 03, 2023 | 6:45 PM

Share

భారతదేశంలో రోజురోజుకూ ఈవీ వాహనాల డిమాండ్ విపరీతంగా పెరగుతుంది. పెరిగిన పెట్రోల్ ధరల నుంచి రక్షణకు అందరూ ఈవీ వాహనాలను ప్రత్యామ్నాయంగా చూడడంతో వీటికి డిమాండ్ బాగా పెరిగింది. అయితే ఈవీ వాహనాల్లో స్కూటర్లు మాత్రం తమదైన శైలిలో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. అయితే ఎంత ఆదరణ లభించినా ఈవీ వాహనాల్లో చార్జింగ్ సమస్య అందరినీ వేధిస్తుంది. ఈవీ వాహనాలు చార్జ్ కావడానికి చాలా సమయం పడుతుంది. దీంతో దూర ప్రాంతాలకు ప్రయాణించడానికి ఈవీ వాహనాలు అనుకూలంగా ఉండడం లేదు. దీంతో ఈవీ వాహనాలకు సంబంధించి చార్జింగ్ సమస్య నుంచి బయటపడడానికి చాలా కంపెనీలు వివిధ పరిశోధనలు మొదలుపెట్టాయి. తాజాగా లాగ్9కు సంబంధించి అల్ట్రా-ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీ టెక్ ద్వారా ఆధారితమైన క్వాంటం ఎనర్జీ బిజినెస్ లైట్ భారతదేశంలో లాస్ట్-మైల్ డెలివరీ విభాగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని చూస్తోంది. స్పీడ్ ఛార్జింగ్ సమయానికి అనుగుణంగా బ్యాటరీ ప్యాక్ రూపొందించాలని చూస్తోంది. బెంగుళూరుకు చెందిన బ్యాటరీ టెక్ స్టార్టప్ లాగ్9 బిజినెస్ లైట్ కార్గో ఇ-స్కూటర్‌ను విడుదల చేయడానికి హైదరాబాద్ ఈవీ ఓఈఎం క్వాంటం ఎనర్జీతో జతకట్టింది. హైపర్‌లోకల్ డెలివరీల కోసం హైదరాబాద్‌లోని విజ్జీ లాజిస్టిక్స్‌తో మొదటి 200 బిజినెస్‌లైట్ ఈ-స్కూటర్‌లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి.

లాగ్9, క్వాంటమ్ ఎనర్జీ ప్రస్తుతం భారతదేశంలో విక్రయిస్తున్న అత్యంత వేగవంతమైన ఛార్జింగ్ 2-వీలర్ కమర్షియల్ ఎలక్ట్రిక్ వాహనంగా సరికొత్త బిజినెస్ లైట్ కార్గో ఎలక్ట్రిక్ స్కూటర్ అని పేర్కొంది. క్వాంటం ఎనర్జీ బిజినెస్ లైట్ స్కూటర్ లాగ్ 9కు ర్యాపిడ్ ఎక్స్ 2000 ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీలను ఉపయోగిస్తుంది. కొత్త బిజినెస్ లైట్ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ ప్యాక్ కేవలం 12 నిమిషాల్లో సున్నా నుంచి పూర్తిగా ఛార్జ్ అవుతుందని ఆయా కంపెనీలు ప్రతినిధులు పేర్కొంటున్నారు. క్వాంటం ఎనర్జీ, లాగ్9 నుంచి కొత్త బిజినెస్ లైట్ స్కూటర్‌ను విడుదల చేయడం రెండు ఈవీ పరిశ్రమ స్టార్టప్‌ల మధ్య సహకారంలో భాగంగా మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఈ రెండు కంపెనీలు పరస్పర సహకారంతో మార్చి 2024 నాటికి భారతదేశం అంతటా 10,000 వాణిజ్య ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ రెండు కంపెనీలు ఈ 2 డబ్ల్యూఎస్ రైడర్‌లు/డ్రైవర్లు, ఆపరేటర్‌లను ఫాస్ట్ ఛార్జింగ్, లాంగ్ లైఫ్ సైకిల్ వాహనాల ప్రయోజనాలకు పరిచయం చేస్తాయి, ఇవి రోజంతా అంతరాయం లేని చివరి-మైల్ డెలివరీలను సులభతరం చేయడంలో సహాయపడతాయి. క్వాంటం, లాగ్9 రెండు కంపెనీల కలయిక వల్ల భవిష్యత్‌లో వాణిజ్య అవసరాలకు సరిపడే స్కూటర్ల రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని అంచనా వేస్తున్నట్లు రెండు కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..