RunR HS Ev: సింపుల్‌ డిజైన్‌.. క్యూట్‌ లుక్‌.. అదరగొడుతున్న కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. సింగిల్‌ చార్జ్‌పై 100కిమీ..

గుజరాత్‌కు చెందిన ఈవీ స్టార్టప్ రన్ఆర్ మొబిలిటీ ఒక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేసింది. రన్ఆర్ హెచ్‍ఎస్ ఈవీ పేరుతో దీనిని పరిచయం చేసింది. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 100 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇచ్చే బ్యాటరీ ఉంటుంది.

RunR HS Ev: సింపుల్‌ డిజైన్‌.. క్యూట్‌ లుక్‌.. అదరగొడుతున్న కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. సింగిల్‌ చార్జ్‌పై 100కిమీ..
Runr Hs Electric Scooter
Follow us
Madhu

|

Updated on: May 27, 2023 | 3:00 PM

విద్యుత్‌శ్రేణి వాహనాలు మార్కెట్లో క్యూ కడుతున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్‌ స్కూటర్లను పెద్ద ఎత్తున వినియోగదారులు కొనుగోలు చేస్తుండటంతో పెద్ద సంస్థలతో స్టార్టప్‌ కంపెనీలు, పలు దేశీయ సంస్థలు కూడా విద్యుత్‌శ్రేణి స్కూటర్లను లాంచ్‌ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే గుజరాత్‌కు చెందిన ఈవీ స్టార్టప్ రన్ఆర్ మొబిలిటీ ఒక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేసింది. రన్ఆర్ హెచ్‍ఎస్ ఈవీ పేరుతో దీనిని పరిచయం చేసింది. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 100 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇచ్చే బ్యాటరీ ఉంటుంది. దీనిలో యాంటీ థెఫ్ట్ అలారమ్, డివైజ్ లొకేటర్ వంటి అత్యాధునిక ఫీచర్లు కూడా ఉన్నాయి. రన్ఆర్ హెచ్‍ఎస్ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

డిజైన్‌ లుక్‌.. రన్ఆర్ హెచ్‍ఎస్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ క్యూట్‌ లుక్‌లో కనిపిస్తోంది. ఎల్ఈడీ టైల్ లైట్లను కలిగి ఉంది. అల్లాయ్‌ వీల్స్‌ ఉంటాయి. ఇందులో హెడ్‌ల్యాంప్‌లో చిన్న ట్యూబ్ లాంటి లైటింగ్ ఎలిమెంట్ ఉంది. సీటు ఒక ఫ్లాట్ డిజైన్‌ను కలిగి ఉంది. వెనుకవైపు సాధారణ గ్రాబ్ రైల్ ఉంది.

బ్యాటరీ సామర్థ్యం.. ఈ స్కూటర్‌లో 60V 40 AH లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 100 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుంది. బీఎంఎస్ ఫీచర్ కూడా ఉంటుంది. రైడర్‌కు రియల్ టైమ్ బ్యాటరీ ఇన్ఫర్మేషన్‍ను ఈ బీఎంఎస్ టెక్నాలజీ చూపిస్తుంది. 1.5kw బీఎల్‌డీసీ మోటార్ ఈ స్కూటర్‌కు శక్తినిస్తుంది. గంటకు 70 కిలోమీటర్లు గరిష్ట వేగంతో ప్రయాణిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఫీచర్లు ఇవి.. ఈ స్కూటర్లో యాంటీ థెఫ్ట్ అలారమ్, డివైజ్ లొకేటర్ ఫీచర్ల వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే ఎల్‍సీడీ డిస్‍ప్లేతో ఈ స్కూటర్ వచ్చింది. ఈ డిస్‍ప్లేలో విభిన్నమైన ఫీచర్లు యాక్సెస్ చేసుకోవచ్చు. సమాచారం కనిపిస్తుంది.

ధర లభ్యత.. రన్ఆర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రారంభ ధర రూ.1.25లక్షలుగా ఉంది. టాప్ వేరియంట్ ధర రూ.1.30లక్షలుగా ఉంటుంది. ఇవి సబ్సిడీకి ముందు ఎక్స్-షోరూమ్ ధరలు. వైట్, బ్లాక్, గ్రే, రెడ్, గ్రీన్ కలర్ ఆప్షన్‍లలో ఈ స్కూటర్‌ అందుబాటులో ఉంటుంది. ఇటీవలే ఈవీ సూపర్ స్టోర్ చైన్ అయిన ఎలక్ట్రిక్ వన్ ఎనర్జీతో రన్ఆర్ మొబిలిటీ సంస్థ భాగస్వామ్యం ఏర్పరుచుకుంది. దీంతో ఎలక్ట్రిక్ వన్ ఎనర్జీ షోరూమ్‍ల్లోనూ ఈ రన్ఆర్ ఎలక్ట్రిక్ స్కూటర్లు లభిస్తాయి. దేశవ్యాప్తంగా 100 డీలర్స్ వద్ద ఈ స్కూటర్లు అమ్మకానికి ఉంటాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..