AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fixed Deposit: గుడ్ న్యూస్.. భారీగా పెరిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లు.. ఏకంగా 9.11శాతం.. ఏ బ్యాంకో తెలుసా?

ఫిన్ కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్(ఎఫ్ఎస్ఎఫ్బీ) కూడా ఫిక్స్ డ్ డిపాజిట్ రేట్లను సవరించింది. ఫిన్ కేర్ వినియోగదారులకు కనీసం రూ. 5000 విలువైన ఎఫ్‌డీలపై సాధారణ ప్రజలకు 8.51శాతం వరకూ, సీనియర్ సిటిజెన్స్ కు అయితే ఏకంగా 9.11శాతం వడ్డీని అందిస్తున్నట్లు బ్యాంకు ప్రకటించింది.

Fixed Deposit: గుడ్ న్యూస్.. భారీగా పెరిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లు.. ఏకంగా 9.11శాతం.. ఏ బ్యాంకో తెలుసా?
FD
Madhu
|

Updated on: May 27, 2023 | 3:30 PM

Share

ఫిక్స్‌డ్ డిపాజిట్లు ప్రజల్లో బాగా ఆదరణ పొందాయి. ప్రజలకు స్థిరమైన ఆదాయాన్ని అందించే పథకాన్ని ప్రారంభించేందుకు చాలా మంది వినియోగదారులు ఆసక్తి చూపుతుంటారు. ఇదే క్రమంలో పలు ప్రైవేటు, స్మాల్ ఫైనాన్స్ కంపెనీలు అత్యధిక వడ్డీని అందిస్తూ వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంటాయి. ఫిన్ కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్(ఎఫ్ఎస్ఎఫ్బీ) కూడా ఫిక్స్ డ్ డిపాజిట్ రేట్లను సవరించింది. ఫిన్ కేర్ వినియోగదారులకు కనీసం రూ. 5000 విలువైన ఎఫ్‌డీలపై సాధారణ ప్రజలకు 8.51శాతం వరకూ, సీనియర్ సిటిజెన్స్ కు అయితే ఏకంగా 9.11శాతం వడ్డీని అందిస్తున్నట్లు బ్యాంకు ప్రకటించింది. ఈ సవరించిన వడ్డీ రేట్లు 2023, మే 25 నుంచి అమలవుతున్నట్లు పేర్కొంది.

రోజుల వారీగా వడ్డీ రేట్లు ఇలా..

  • 1000 రోజుల కాల వ్యవధితో తీసుకొనే ఎఫ్‌డీలపై సీనియర్ సిటిజెనులకు ఫిన్ కేర్ బ్యాంకు 9.11శాతం వడ్డీ రేటు అందిస్తోంది. అలాగే సాధారణ ప్రజలకు ఇదే 1000 రోజుల ఎఫ్‌డీలపై 8.51శాతం వడ్డీని అందిస్తోంది.
  • కనీసం 59 రోజుల తర్వాత ఒక రోజు నుంచి 66 నెలల వరకూ సీనియర్ సిటీజెనులకు 8.6శాతం, సాధారణ పౌరులకు 8శాతం వడ్డీ రేటును అందిస్తుంది.
  • అలాగే 66 నెలల తర్వాత ఒక రోజు నుంచి 84 నెలల వరకూ సీనియర్ సిటిజెనులకు ఎఫ్డీలపై 7.6శాతం, ఇతరులకు 7శాతం వడ్డీ రేటును ఫిన్కేర్ బ్యాంకు అందిస్తుంది.
  • అలాగే 36 నెలల తర్వాత ఒక రోజు నుంచి 42 నెలల వరకూ 8.85శాతం సీనియర్ సీటిజెన్స్ కు , సాధారణ ప్రజలకు 8.25 శాతం వడ్డీ రేటును బ్యాంకు అందిస్తుంది.
  • ఈ ఫిన్ కేర్ బ్యాంకులో ఎఫ్ డీని ప్రారంభించాలనుకొనే వారు బ్యాంకు బ్రాంచ్ లో సంప్రదించవచ్చు. లేదా ఇంటర్ నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్ ద్వారా కూడా ఖాతాను ప్రారంభించవచ్చు.

ఆర్థిక స్వేచ్ఛ..

ఫిన్ కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎండీ అండ్ సీఈఓ రాజీవ్ యాదవ్ మాట్లాడుతూ తమ బ్యాంకు వినియోగదారులకు అవసరమైన విధంగా సేవలకు అందిస్తుందన్నారు. అదే ఇప్పుడు ఈ ఎఫ్ డీ రేట్లపై చూపించిందన్నారు. షార్ట్ టర్మ్ లేదా లాంగ్ టర్మ్ ఆర్థిక లక్ష్యాలను అధిగమించేందుకు తమ బ్యాంకు మంచి వడ్డీ రేట్లను అందిస్తుందన్నారు. ఏడు రోజుల నుంచి 10ఏళ్ల వరకూ వివిధ కాల వ్యవధుల్లో మంచి వడ్డీతో కూడిన ఎఫ్డీలను అందిస్తున్నామని, వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
స్టార్ హీరో గ్యారేజ్‌లోకి కొత్త మహీంద్రాEV..మైండ్ బ్లోయింగ్ రేంజ్
స్టార్ హీరో గ్యారేజ్‌లోకి కొత్త మహీంద్రాEV..మైండ్ బ్లోయింగ్ రేంజ్
'ధురంధర్' నటిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో వైరల్.. కారణమిదే
'ధురంధర్' నటిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో వైరల్.. కారణమిదే
డేంజర్లో ఆ నలుగురు భారత ఆటగాళ్ల కెరీర్
డేంజర్లో ఆ నలుగురు భారత ఆటగాళ్ల కెరీర్
'చెన్నై లవ్ స్టోరీ' అనగానే నాకు ఆ జ్ఞాపకాలే గుర్తు కొచ్చాయి
'చెన్నై లవ్ స్టోరీ' అనగానే నాకు ఆ జ్ఞాపకాలే గుర్తు కొచ్చాయి
భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. మూడు రోజుల్లోనే సీన్ రివర్స్..
భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. మూడు రోజుల్లోనే సీన్ రివర్స్..
60 ల్లో కూడా తాతలు ఉక్కులా ఉన్నారంటే రీజన్ ఇదే..
60 ల్లో కూడా తాతలు ఉక్కులా ఉన్నారంటే రీజన్ ఇదే..
స్పెషల్ TETకు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? DEd, BEdవాళ్లు రాయొచ్చా?
స్పెషల్ TETకు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? DEd, BEdవాళ్లు రాయొచ్చా?
జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..
జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..