Enigma Scooters: మార్కెట్‌లోకి నయా ఎలక్ట్రిక్ స్కూటర్లు.. తక్కువ ధరలోనే అధునాత ఫీచర్లు..

తాజాగా ఈవీ తయారీదారు ఎనిగ్మా జీటీ 450, క్రింక్ వీ1 పేరుతో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ల రిలీజ్ చేసింది. ఈ రెండు హై-స్పీడ్ వేరియంట్‌లు వరుసగా రూ. 89,000, రూ. 94,000 (ఎక్స్-షోరూమ్) ధర ఉంటుంది. వినియోగదారులు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను ఎనిగ్మా షోరూమ్‌లలో కొనుగోలు చేయవచ్చు.

Enigma Scooters: మార్కెట్‌లోకి నయా ఎలక్ట్రిక్ స్కూటర్లు.. తక్కువ ధరలోనే అధునాత ఫీచర్లు..
Enigma
Follow us

|

Updated on: May 26, 2023 | 5:45 PM

భారతదేశంలో ఈవీ వాహనాల జోరు నడుస్తుంది. ముఖ్యంగా టాప్ కంపెనీల నుంచి కొత్తగా వచ్చే స్టార్టప్ కంపెనీల వరకూ ప్రతి కంపెనీ ఈవీ వాహనాలను తయారు చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ వాహనాల్లో స్కూటర్లు ఎక్కువగా జనాధరణ పొందుతున్నాయి. పెరుగుతున్న పెట్రోల్ ధరల నుంచి రక్షణకు పట్టణ ప్రాంత ప్రజలు ఎక్కువగా ఈవీ స్కూటర్ల కొనుగోలుకు మక్కువ చూపుతున్నారు. తాజాగా ఈవీ తయారీదారు ఎనిగ్మా జీటీ 450, క్రింక్ వీ1 పేరుతో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ల రిలీజ్ చేసింది. ఈ రెండు హై-స్పీడ్ వేరియంట్‌లు వరుసగా రూ. 89,000, రూ. 94,000 (ఎక్స్-షోరూమ్) ధర ఉంటుంది. వినియోగదారులు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను ఎనిగ్మా షోరూమ్‌లలో కొనుగోలు చేయవచ్చు. అలాగే గ్రీవ్స్ కాటన్ అవుట్‌లెట్‌ల వద్ద కూడా ఈ స్కూటర్లు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా ఎనిగ్మా తన వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ఆర్డర్ ఫారమ్‌ను ప్రారంభించేందుకు కృషి చేస్తోందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ రెండు స్కూటర్లు గ్రే, గోల్డ్, వైట్, సిల్వర్, బ్లూ, మ్యాట్ బ్లాక్‌తో సహా ఆరు రంగు ఎంపికలలో అందుబాటులో ఉంటాయి. ఈ రెండు స్కూటర్ల స్పెసిఫికేషన్లు ఎలా ఉంటయో? ఓ సారి తెలుసుకుందాం. 

జీటీ 450 ప్రో

ఈ జీటీ 450 ప్రో 40 ఏహెచ్ లిథియ అయాన్ బ్యాటరీతో పని చేస్తుంది. ఇది ఓ సారి చార్జ్ చేస్తే 120 కిలో మీటర్ల మైలేజ్ ఇస్తుంది. అలాగే గరిష్ట వేగం గంటకు 60 కి.మీగా ఉంటుంది. ఈ స్కూటర్‌ను 10 ఏఎంపీ ఛార్జర్‌ని ఉపయోగించి బ్యాటరీని 3.5 గంటల్లో ఛార్జ్ చేయవచ్చు. ఎనిగ్మా జీటీ 450 ప్రో లోడ్ సామర్థ్యం 200 కిలోలు. అలాగే ఇది 68 కిలోల బరువును కలిగి ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ముందు డిస్క్, వెనుక డ్రమ్ బ్రేక్‌ను పొందుతుంది.

ఎనిగ్మా క్రింక్ వీ1

ఎనిగ్మా క్రింక్ వీ1 అనేది 36 ఏహెచ్ లిథియం-అయాన్ బ్యాటరీతో వస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 140 కి.మీ వరకు మైలేజ్ వస్తుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్టంగా 70 కిమీ వేగంతో వెళ్తుంది. అలాగే 210 కిలోల లోడింగ్ కెపాసిటీని కలిగి ఉంటుంది. 10 ఏఎంపీ ఛార్జర్‌తో 3.5 గంటల్లో చార్జ్ అవతుంది. ఈ స్కూటర్‌లో ముఖ్యంగా ముందు, వెనుక డిస్క్ బ్రేక్‌లను అందించారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..