AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2000 Note Exchange: రెండు వేల రూపాయల నోట్లు మార్చే సమయంలో ప్రూఫ్స్ సమర్పించాలా? ప్రముఖ బ్యాంకులు చెబుతున్నదిదే..!

శుక్రవారం జారీ చేసిన ఆర్‌బిఐ తాజా మార్గదర్శకాల ప్రకారం ఒక వ్యక్తి ఒకేసారి రూ. 20,000 వరకు పరిమితిని మార్చుకోవచ్చు. అయితే మొదట్లో కొన్ని శాఖలు ఫారమ్‌ను నింపాలని పట్టుబట్టినప్పటికీ తమ ప్రధాన కార్యాలయం నుంచి  సూచనలను స్వీకరించిన తర్వాత ఆ పద్ధతిని నిలిపివేసినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

2000 Note Exchange: రెండు వేల రూపాయల నోట్లు మార్చే సమయంలో ప్రూఫ్స్ సమర్పించాలా? ప్రముఖ బ్యాంకులు చెబుతున్నదిదే..!
Rs 2000 Notes
Nikhil
|

Updated on: May 26, 2023 | 6:15 PM

Share

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత వారం రూ. 2,000 కరెన్సీ నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది, అయితే ఆ నోట్లను ఖాతాల్లో డిపాజిట్ చేయడానికి లేదా వాటిని బ్యాంకుల్లో లేదా ఆర్బీఐ కేంద్రాల్లో మార్చుకోవడానికి సెప్టెంబర్ 30 వరకు ప్రజలకు సమయం ఇచ్చింది. అయితే ఈ నోట్లను మార్చుకోవడానికి ఆర్‌బిఐ చెల్లుబాటు అయ్యే ఐడిని సమర్పించడం లేదా డిపాజిట్ ఫారమ్‌లను నింపడం తప్పనిసరి చేయనప్పటికీ, రుజువుగా గుర్తింపు కార్డులను సమర్పించాలని బ్యాంకులు కస్టమర్లను డిమాండ్ చేస్తున్నాయని కొన్ని చోట్ల ఫిర్యాదులు వచ్చాయి. కొన్ని బ్యాంకులు ఎలక్ట్రానిక్ ఎంట్రీ ద్వారా నోట్లను మార్చుకున్నాయి, మరికొన్ని గుర్తింపు రుజువు ఇవ్వకుండా రిజిస్టర్‌లో తమ పేరు, మొబైల్ నంబర్‌ను రాయమని ఖాతాదారులను కోరుతున్నాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే శుక్రవారం జారీ చేసిన ఆర్‌బిఐ తాజా మార్గదర్శకాల ప్రకారం ఒక వ్యక్తి ఒకేసారి రూ. 20,000 వరకు పరిమితిని మార్చుకోవచ్చు. అయితే మొదట్లో కొన్ని శాఖలు ఫారమ్‌ను నింపాలని పట్టుబట్టినప్పటికీ తమ ప్రధాన కార్యాలయం నుంచి  సూచనలను స్వీకరించిన తర్వాత ఆ పద్ధతిని నిలిపివేసినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే ఈ విషయంలో ఏయే బ్యాంకులు ఏయే విధానాలు అనుసరిస్తున్నాయో? ఓ సారి తెలుసుకుందాం.

ప్రధాన బ్యాంకులు చెబుతున్నదిదే

  • దేశంలో అతిపెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  రూ. 2,000 నోట్లను మార్చుకునేటప్పుడు లేదా డిపాజిట్ చేసేటప్పుడు ఎలాంటి ఫారమ్ లేదా గుర్తింపు రుజువు అవసరం లేదని దాని శాఖలకు తెలిపింది. 
  • అలాగే పీఎన్‌బీ బ్యాంకు కూడా కరెన్సీ మార్పిడికి ఆధార్ లేదా అధికారిక ధ్రువపత్రాలు అవసరం లేదని తెలిపింది.  అలాగే కస్టమర్‌లు దీని కోసం ఎలాంటి ఫారమ్‌ను పూరించాల్సిన అవసరం లేదు. రూ. 2,000 కరెన్సీ నోట్లను మార్చుకోవడానికి అదనపు వ్యక్తిగత సమాచారాన్ని కోరుతూ పాత ఫారమ్‌లు ఆన్‌లైన్‌లో ప్రసారమైన విషయంలో స్పష్టత వచ్చింది.
  • కోటక్, హెచ్‌ఎస్‌బిసి వంటి ప్రైవేట్ బ్యాంకులు అకౌంట్ లేనివారి కోసం ఫారమ్/ఐడి ప్రూఫ్‌ను అడుగుతున్నాయి.
  • యాక్సిస్ బ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్, యెస్ బ్యాంక్, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలాంటి ఫారమ్ లేదా ఐడి ప్రూఫ్‌ను తప్పనిసరి చేయడం లేదని నివేదికలు వెల్లడిస్తున్నాయి. 
  • బ్యాంక్ ఆఫ్ బరోడా తమకు ఎలాంటి ఫారమ్ అవసరం లేదని అయితే ఖాతా లేని వారికి ఐడీ ప్రూఫ్ అవసరమని తెలిపింది.
  • ఐసీఐసీఐ మరియు హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లందరూ ఫారమ్‌లను పూరించాలని చెప్పాయి. అయితే ఖాతా లేనివారికి మాత్రమే ఐడి ప్రూఫ్ అవసరమని స్పష్టం చేశాయి. 
  • అయితే వ్యక్తిగత ఖాతాలో రూ. 50,000 కంటే ఎక్కువ మొత్తం డిపాజిట్ కోసం రూ. 2,000 నోట్లను డిపాజిట్ చేయడానికి ఖాతాదారులు తప్పనిసరిగా పాన్ కార్డ్ నెంబర్ కలిగి ఉండాలి. 

‘మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం