Honda Electric Moped: హోండా నుంచి కొత్త ఎలక్ట్రిక్ మోపెడ్.. అదిరే లుక్.. అత్యాధునిక ఫీచర్లు..

అర్బన్ అవసరాల కోసం హోండా ప్రత్యేకంగా ఓ ఎలక్ట్రిక్ మోపెడ్ ను తీసుకొచ్చింది. రిమూవబుల్ బ్యాటరీతో కూడిన ఈ స్కూటర్ పేరు హోండా ఎలక్ట్రిక్ మోపెడ్1(ఈఎం1). ఈ మోపెడ్ 2 వాట్ల సామర్థ్యంతో ఉంటుంది.

Honda Electric Moped: హోండా నుంచి కొత్త ఎలక్ట్రిక్ మోపెడ్.. అదిరే లుక్.. అత్యాధునిక ఫీచర్లు..
Honda Em1
Follow us
Madhu

|

Updated on: May 13, 2023 | 7:18 PM

యువతే లక్ష్యంగా.. అర్బన్ అవసరాల కోసం హోండా ప్రత్యేకంగా ఓ ఎలక్ట్రిక్ మోపెడ్ ను తీసుకొచ్చింది. రిమూవబుల్ బ్యాటరీతో కూడిన ఈ స్కూటర్ పేరు హోండా ఎలక్ట్రిక్ మోపెడ్1(ఈఎం1). ఈ మోపెడ్ 2 వాట్ల సామర్థ్యంతో ఉంటుంది. గతేడాది సెప్టెంబర్ లోనే హోండా ఈ స్కూటర్ ను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. 2025 నాటికి 10 ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేయాలన్న సంకల్పంతో ఉన్నట్లు.. అలాగే 2040 నాటికి పూర్తిగా ఎలక్ట్రిక్ వేరియంట్లే తయారు చేసేలా కసరత్తు చేస్తున్నట్లు తన ఫ్యూచర్ ప్లాన్ ను గతేడాది ప్రకటించింది. దానిలో భాగంగానే యూరోప్ లో ఈ ఈఎం1 ఎలక్ట్రిక్ స్కూటర్ ను ఆవిష్కరించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

బ్యాటరీ సామర్థ్యం..

ఈ స్కూటర్ లో 10.3 కేజీల బరువున్న లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. ఇది మార్చుకోదగిన విధంగా ఉంటుంది. దీని సామర్థ్యం 50.3V, 9.4 Ah, 1.47 kwh ఉంటుంది. 270 వాట్ల ఏసీ చార్జర్ ఉంటుంది. ఇది కేవలం ఆరు గంటల్లో సున్నా నుంచి 100 శాతం బ్యాటరీని చార్జ్ చేస్తుంది. 25 నుంచి 75శాతం చార్జ్ అవడానికి రెండు గంటల 40నిమిషాలు పడుతుంది. దీనిలో బ్రష్ లెస్ మోటార్ ఉంటుంది. దీని సామర్థ్యం 0.58kw కాగా పీక్ అవుట్ పుట్ 1.7kw ఉంటుంది. ఈ స్కూటర్ గరిష్టంగా గంటకు 45 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.

డిజైన్, లుక్..

ఎల్సీడీ ఇన్ స్ట్రుమెంట్ ప్యానల్, రెండు వైపు ఎల్ఈడీ లైటింగ్ ఉంటుంది. ముందు వైపు ఎల్ఈడీ సిగ్నేచర్ డీఆర్ఎల్ ఉంటుంది. ఇది మోడర్న్ లుక్ ను అందిస్తుంది. పొడవైన సీటు, ఆప్షనల్ 35లీటర్ల టాప్ బాక్స్ ఉంటుంది. సీటు కింద 3.3 లీటర్ల స్టోరేజ్ స్పేస్ ఉంటుంది. ముందు వైపు హ్యాండిల్ కింద 500ఎంల్ వాటర్ బాటిల్ స్పే స్ ఉంటుంది. యూఎస్సీ టైప్ ఏ చార్జింగ్ పోర్టు ఉంటుంది.

ఇవి కూడా చదవండి

లభ్యత..

ఇది పెరల్ సన్ బీమ్ వైట్, డిజిటల్ సిల్వర్ మెటాలిక్, మ్యాటే బాలిస్టిక్ బ్లాక్ మెటాలిక్ వంటి కలర్ ఆప్షన్లలో లభ్యమవుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..