Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amery Electric Scooter: వారెవ్వా అమెరీ.. సూపర్ ఫీచర్లతో హై స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ చార్జ్‌పై 140 కిమీ..

ఈ స్ప్రింటో కంపెనీ అమెరీ ఎలక్ట్రిక్ స్కూటర్ పేరిట ఓ హై స్పీడ్ స్కూటర్ ని లాంచ్ చేసింది. ఇది ఈ కంపెనీ నుంచి వస్తున్న రెండో హై స్పీడ్ స్కూటర్. ఇది సింగిల్ చార్జ్ పై 140 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవి..

Amery Electric Scooter: వారెవ్వా అమెరీ.. సూపర్ ఫీచర్లతో హై స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ చార్జ్‌పై 140 కిమీ..
E Sprinto Amery Electric Scooter
Follow us
Madhu

|

Updated on: May 26, 2023 | 5:30 PM

మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు మంచి డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ ను అందిపుచ్చుకునేందుకు అన్ని కంపెనీలు ప్రయత్నం చేస్తున్నాయి. ఆయా సంస్థలు వారి ఉత్పత్తులను మార్కెట్లో లాంచ్ చేస్తున్నాయి. ఇదే క్రమంలో ఈ స్ప్రింటో కంపెనీ అమెరీ ఎలక్ట్రిక్ స్కూటర్ పేరిట ఓ హై స్పీడ్ స్కూటర్ ని లాంచ్ చేసింది. ఇది ఈ కంపెనీ నుంచి వస్తున్న రెండో హై స్పీడ్ స్కూటర్. ఇది సింగిల్ చార్జ్ పై 140 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. రిమోట్ కంట్రోల్ లాక్, యాంటీ-థెఫ్ట్ అలారం, మొబైల్ చార్జింగ్ సాకెట్, ఫైండ్ మై వెహికల్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. ప్రధానంగా అర్బన్ ప్రాంత 20 నుంచి 35 సంవత్సరాల వయస్సున్న వారిని టార్గెట్ చేస్తూ దీనిని ఈ స్ప్రింటో దీనిని లాంచ్ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

స్పెసిఫికేషన్లు ఇవి..

కేవలం 6 సెకెన్లలో ఈ స్కూటర్ 0 నుండి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. గంటకు గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలగుతుంది. 1500వాట్ల బీఎల్డీసీ హబ్ మోటర్ 2500వాట్ల అత్యధిక శక్తిని అందిస్తుంది. ఫ్రంట్ డిస్క్, రియర్ డ్రమ్ బ్రేకులు ఉంటాయి. 60V 50AH సామర్థ్యంతో లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. ఇది సింగిల్ చార్జ్ పై 140 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. బ్యాటరీ 0-100 శాతం ఛార్జ్ చేయడానికి 4 గంటలు పడుతుంది.

ఫీచర్లు ఇవి..

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో అందించిన ఫీచర్ల గురించి చెప్పాలంటే, ఇందులో డిజిటల్ డిస్‌ప్లే, యాంటీ థెఫ్ట్ అలారం, రిమోట్ కంట్రోల్ లాక్, మొబైల్ ఛార్జింగ్ సాకెట్, ఫండ్ మై వెహికల్ యాప్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది 200 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ మరియు 98 కిలోల కర్బ్ వెయిట్ కలిగి ఉంది. ఈ స్కూటర్ 150 కిలోల బరువును మోయగలదు. డిజిటల్ డిస్‌ప్లే ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ధర, లభ్యత..

ఇది మూడు అద్భుతమైన రంగుల్లో లభిస్తుంది. బ్లిస్‌ఫుల్ వైట్, స్టర్డీ బ్లాక్ (మాట్), హై స్పిరిట్ ఎల్లో ఆప్షన్లలో లభిస్తోంది. దేశ వ్యాప్తంగా అన్న అధీకృత ఈ-స్ప్రింటో డీలర్‌షిప్స్, షోరూమ్ ల వద్ద రూ. 1.30లక్షల ఎక్స్ షోరూమ్ ధరకు లభిస్తుంది.

ఇ-స్ప్రింటో సహ-వ్యవస్థాపకులు, డైరెక్టర్ అతుల్ గుప్తా మాట్లాడుతూ “ఇ-స్ప్రింటో నుంచి అత్యాధునిక అమెరీని ప్రవేశపెడుతుండటం సంతోషంగా ఉంది. ఈ బైక్ ను వినూత్నంగా తీర్చిదిద్దాం. దీని వేగం, అత్యాధునికమైన ఫీచర్లు, ఆకర్షించే డిజైన్ అన్ని సాటిలేని రైడింగ్ అనుభూతిని అందిస్తాయి. ఇది పట్టణ ప్రాంత ప్రజలకు అద్భుతమైన ఎంపిక” అని అన్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆది శంకరాచార్య కృతులు అధ్యయన తరగతులు.. ఎలా నేర్చుకోవాలంటే..
ఆది శంకరాచార్య కృతులు అధ్యయన తరగతులు.. ఎలా నేర్చుకోవాలంటే..
కదులుతూ కనిపించిన స్కూల్ బ్యాగ్.. ఏముందా అని చూడగా షాక్..
కదులుతూ కనిపించిన స్కూల్ బ్యాగ్.. ఏముందా అని చూడగా షాక్..
IPL 2025: ఆనాడు ధోనితో ఫొటో కోసం ఎదురుచూపులు.. కట్‌చేస్తే..
IPL 2025: ఆనాడు ధోనితో ఫొటో కోసం ఎదురుచూపులు.. కట్‌చేస్తే..
విమానం బాత్రూమ్ వ్యర్థాలు ఎక్కడికి వెళ్తాయి? నిజం తెలిస్తే..
విమానం బాత్రూమ్ వ్యర్థాలు ఎక్కడికి వెళ్తాయి? నిజం తెలిస్తే..
ఈవారం థియేటర్లలో/ ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు ఇవే..
ఈవారం థియేటర్లలో/ ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు ఇవే..
పెన్ను పట్టుకునే విధానం వ్యక్తిత్వాన్ని వెల్లడిస్తుందని తెలుసా..
పెన్ను పట్టుకునే విధానం వ్యక్తిత్వాన్ని వెల్లడిస్తుందని తెలుసా..
Astrology: కర్కాటక రాశిలోకి కుజుడు.. ఆ రాశుల వారు కాస్త జాగ్రత్త
Astrology: కర్కాటక రాశిలోకి కుజుడు.. ఆ రాశుల వారు కాస్త జాగ్రత్త
Video: ఇక మారవా పరాగ్.. ఫ్యాన్స్‌ ముందు ఇదేం యాటిట్యూట్
Video: ఇక మారవా పరాగ్.. ఫ్యాన్స్‌ ముందు ఇదేం యాటిట్యూట్
తెలంగాణలోని ఈ జిల్లాలకు రెయిన్ అలెర్ట్...
తెలంగాణలోని ఈ జిల్లాలకు రెయిన్ అలెర్ట్...
షారుఖ్ పాస్‌పోర్ట్ మెరూన్ రంగులో ఎందుకు ఉంది? పాస్‌పోర్ట్‌ రకాలు
షారుఖ్ పాస్‌పోర్ట్ మెరూన్ రంగులో ఎందుకు ఉంది? పాస్‌పోర్ట్‌ రకాలు