Electric Scooter: అనువైన ధర.. యునిక్ మోడల్లో ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ చార్జ్ పై 120 కిలోమీటర్లు..

ఢిల్లీకి చెందిన AMO ఎలక్ట్రిక్ ఓ కొత్త ఎలక్ట్రిక్ వాహనాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని పేరు జాంటీ ప్లస్. ఇది మెరుగైన పనితీరుతో సూపర్‌ డిజైన్‌ను కలిగి ఉంది. ఏఎంఓ స్టార్టప్ నుంచి వస్తున్న మొట్టమొదటి హై స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే కావడం విశేషం.

Electric Scooter: అనువైన ధర.. యునిక్ మోడల్లో ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ చార్జ్ పై 120 కిలోమీటర్లు..
Amo Jaunty Plus Electric Scooter
Follow us

|

Updated on: May 14, 2023 | 10:41 AM

మనదేశ ఆటో రంగంలో ఎలక్ట్రిక్ వాహనాల హవా కొనసాగుతోంది. ప్రతి రోజూ ఏదో ఒక కొత్త ఎలక్ట్రిక్ వాహనం విడుదలవుతోంది. వాటిల్లో ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎక్కువగా ఉంటున్నాయి. వినియోగదారుల నుంచి స్కూటర్లకు అధిక డిమాండ్ కూడా ఉంటోంది. ఈ క్రమంలో ఢిల్లీకి చెందిన AMO ఎలక్ట్రిక్ ఓ కొత్త ఎలక్ట్రిక్ వాహనాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని పేరు జాంటీ ప్లస్. ఇది మెరుగైన పనితీరుతో సూపర్‌ డిజైన్‌ను కలిగి ఉంది. ఏఎంఓ స్టార్టప్ నుంచి వస్తున్న మొట్టమొదటి హై స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే కావడం విశేషం. అంతేకాక దీనిలోని బ్యాటరీ సింగిల్ చార్జ్ పై 120 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ ను అందిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

బ్యాటరీ, మోటార్ సామర్థ్యం..

ఏఎంఓ జాంటీ ప్లస్ స్కూటర్ లో బ్రష్‌లెస్ డీసీ మోటార్‌ను కలిగి ఉంటుంది. 1.265kw సామర్థ్యంతో మోటార్ ఉంటుంది. అలాగే 60V/40Ah అధునాతన లిథియం బ్యాటరీని ఈ స్కూటర్లో ఉపయోగించారు. దీనిని పూర్తిగా చార్జ్ చేయడానికి ఐదు గంటల సమయం పడుతుంది. ఫాస్ట్ చార్జర్ వినియోగిస్తే నాలుగు గంటల్లోనే చార్జ్ అవుతుంది. ఈ బ్యాటరీ సింగిల్ చార్జ్ పై 120 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది.

ఫీచర్లు ఇవే..

ఈ-బైక్‌లో క్రూయిజ్ కంట్రోల్ స్విచ్, ఎలక్ట్రానిక్ అసిస్టెడ్ బ్రేకింగ్ సిస్టమ్ (ఈఏబీఎస్), యాంటీ-థెఫ్ట్ అలారం ఉన్నాయి. ఇది కాకుండా టెలిస్కోపిక్ ఫోర్క్ సస్పెన్షన్, హై గ్రౌండ్ క్లియరెన్స్, సైడ్ స్టాండ్ సెన్సార్, సెంట్రల్ లాకింగ్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్, డీఆర్ఎల్ లైట్లు, ఇంజన్ కిల్ స్విచ్ ఉన్నాయి. జాంటీ ప్లస్ క్రూయిజ్ కంట్రోల్ ఆప్షన్‌తో సహా అనేక మంచి ఫీచర్లతో వస్తుంది. యూఎస్బీ చార్జింగ్ పోర్టు ఉంటుంది. డిజిటిల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ధర, లభ్యత..

కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రెడ్-బ్లాక్, గ్రే-బ్లాక్, బ్లూ-బ్లాక్, వైట్-బ్లాక్, ఎల్లో-బ్లాక్ కలర్ అనే ఐదు రంగులలో పరిచయం చేసింది. అంతేకాకుండా మూడు సంవత్సరాల వారంటీని అందిస్తుంది. అయితే కొన్ని నిబంధనలు, షరతులు ఉన్నాయి. దీని ధర రూ. 1,10,460 ఎక్స్ షోరూమ్ ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..