AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mother’s Day Gift Ideas: మదర్స్ డే రోజు మీ అమ్మకు ఎవ్వరూ ఇవ్వని గిఫ్ట్ ఇవ్వాలా? అయితే ఈ ఈవీ స్కూటర్లను ట్రై చేయండి..

మారుతన్న కాలంలో లెక్కలేనన్ని బహుమతి ఎంపికలు ఉన్నప్పటికీ బహిరంగ కార్యకలాపాల కోసం ఉపయోగపడే ఓ ప్రత్యేక గిఫ్ట్ ఐడియాతో ఈ సారి మేము మీ వచ్చాం. ముఖ్యంగా గృహ అవసరాలకు బయటకు వెళ్లే తల్లికి బహుమతిగా ఎలక్ట్రిక్ స్కూటర్ అనే అద్భుతమైన ఎంపికగా ఉంటుంది.

Mother’s Day Gift Ideas: మదర్స్ డే రోజు మీ అమ్మకు ఎవ్వరూ ఇవ్వని గిఫ్ట్ ఇవ్వాలా? అయితే ఈ ఈవీ స్కూటర్లను ట్రై చేయండి..
Ev Scooters
Nikhil
|

Updated on: May 12, 2023 | 5:00 PM

Share

మదర్స్ డే అంటే అమ్మపై ప్రేమను చూపించుకోవడానికి ఓ ప్రత్యేక సందర్భంగా చాలా మంది భావిస్తారు. ముఖ్యంగా ఈ రోజు ప్రత్యేక బహుమతులు ఇస్తూ ఉంటారు. ప్రస్తుతం మారుతన్న కాలంలో లెక్కలేనన్ని బహుమతి ఎంపికలు ఉన్నప్పటికీ బహిరంగ కార్యకలాపాల కోసం ఉపయోగపడే ఓ ప్రత్యేక గిఫ్ట్ ఐడియాతో ఈ సారి మేము మీ వచ్చాం. ముఖ్యంగా గృహ అవసరాలకు బయటకు వెళ్లే తల్లికి బహుమతిగా ఎలక్ట్రిక్ స్కూటర్ అనే అద్భుతమైన ఎంపికగా ఉంటుంది. ఎలక్ట్రిక్ స్కూటర్‌లు పర్యావరణ అనుకూలమైనవి. తక్కువ ఖర్చుతో సులభంగా ఆపరేట్ చేసేలా ఉంటాయి. వీటిని అన్ని వయసుల తల్లులకు ఆదర్శవంతమైన బహుమతిగా అందించవచ్చు. మదర్స్ డే రోజు తల్లులకు ఉపయోగపడేలా ఉండే ఎలక్ట్రిక్ స్కూటర్ల కలెక్షన్‌ను ఓ సారి చూద్దాం. 

బౌన్స్ ఇన్ఫినిటీ ఈ 1

బౌన్స్ ఇన్ఫినిటీ ఈ 1 ఒక హబ్ మోటార్‌తో జత చేసి వస్తుంది. 2 కేడబ్ల్యూ హెచ్ 48వీ 39 హెచ్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. అలాగే ఇది గంటకు 65 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందిస్తుంది. 2.9 బీహెచ్‌పీ గరిష్ట పవర్ అవుట్‌పుట్, 83 ఎన్ఎం గరిష్ట టార్క్‌తో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎకో, స్పోర్ట్‌ అని రెండు రైడ్ మోడ్‌లతో వస్తుంది. ఐపీ 67 రేటెడ్ లిథియం అయాన్ బ్యాటరీ నాలుగు నుంచి ఐదు గంటల ఛార్జింగ్ సమయంతో ఒకే ఛార్జ్‌పై 85 కిమీ పరిధిని అందజేస్తుందని పేర్కొంది. ఈ స్కూటర్ ధర రూ.59999గా ఉంది. 

హీరో ఆప్టిమా సీఎక్స్

ఆప్టిమా సీఎక్స్ 550 వాట్స్ బీఎల్‌డీసీ మోటారు ద్వారా శక్తిని పొందుతుంది, ఇది 52.2వీ, 30ఏహెచ్ లిథియం ఫాస్ఫేట్ బ్యాటరీతో జత చేయబడి 1.2 బీహెచ్‌పీ గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది పూర్తిగా ఛార్జ్ చేయడానికి 4-5 గంటలు పడుతుంది. కంపెనీ ఈ స్కూటర్‌ను సింగిల్, డబుల్ బ్యాటరీ వేరియంట్‌లలో అందిస్తోంది, వీటి ధర వరుసగా రూ.62,190, రూ.77,490. డబుల్ బ్యాటరీ వెర్షన్ ఒకే ఛార్జ్‌పై 140 కిమీల పరిధిని కలిగి ఉంది. అలాగే గరిష్టంగా గంటకు 45 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది.

ఇవి కూడా చదవండి

ఆంపియార్ మాగ్నస్ ఈఎక్స్ 

ఇంటిగ్రేటెడ్ యూఎస్‌బీ పోర్ట్, ఎల్‌సీడీ స్క్రీన్, కీలెస్ ఎంట్రీ, యాంటీ-థెఫ్ట్ అలారంతో వస్తున్న ఆంపియర్ మాగ్నస్ ఈఎక్స్ ఒక ఫీచర్ రిచ్ ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది గంటకు 55 కిలోమీటర్ల గరిష్ట వేగంతో దూసుకుపోతుంది. 1.2 కేడబ్ల్యూ మోటార్‌‌తో పాటు 60వీ, 30 ఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఇది 5 ఏఎంసీ సాకెట్‌ని ఉపయోగించి 0-100% నుంచి ఛార్జ్ చేయడానికి 6 నుంచి 7 గంటలు పడుతుంది. ఈ స్కూటర్ ఓ సారి చార్జ్ చేస్తే 121 కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది. అలాగే ఈ స్కూటర్ ధర రూ.73,999గా ఉంది. 

ఒడిస్సే లైటర్ రేస్ వీ2

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ శక్తివంతమైన వాటర్‌ప్రూఫ్ మోటార్‌తో వస్తుంది. ఈ స్కూటర్‌లోని దాని డ్యూయల్ బ్యాటరీ సిస్టమ్‌తో మీరు చార్జింగ్‌తో సంబంధం లేకుండా ఎక్కువ రైడ్‌లను ఆస్వాదించవచ్చు. లిథియం-అయాన్ బ్యాటరీ మూడు-నాలుగు గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుందని, అలాగే 75 కిలో మీటర్ల పరిధిని అందిస్తుంది. ఈ స్కూటర్‌లో ఎల్ఈడీ లైట్లతో పాటు పెద్ద బూట్ స్పేస్‌తో వస్తుంది. యాంటీ-థెఫ్ట్ లాక్‌తో ప్రకాశవంతమైన ఎరుపు, పాస్టెల్ పీచ్, నీలమణి నీలం, పిస్తా, పెర్ల్ వైట్. కార్బన్ బ్లాక్ వంటి ఆకర్షణీయమైన రంగులలో లభిస్తుంది, ఈ స్కూటర్ ధర రూ.77,250గా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..