ePluto 7G Pro: ఆ స్కూటర్‌కు కొనసాగింపుగా మరో ఈవీ స్కూటర్.. సింపుల్ డిజైన్‌తో మతిపోగుడుతున్న ఫీచర్స్
ప్యూర్ ఈవీ కంపెనీ ఈప్లూటో 7 జీ ప్రో పేరుతో ఓ కొత్త ఎలక్ట్రిక్ వాహనాన్ని రిలీజ్ చేసింది. సూపర్ డిజైన్‌తో అధునాతన ఫీచర్లతో ఉన్న ఈ స్కూటర్ కచ్చితంగా వినియోగదారుల మనస్సును గెలుచుకుంటుందని కంపెనీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే ఈ స్కూటర్ బుకింగ్స్‌ను కంపెనీ తమ వెబ్‌సైట్‌లో ఓపెన్ చేసింది.

భారతదేశంలో ఈవీ వాహనాల మార్కెట్ విపరీతంగా పెరగుతుంది. అమెరికా, చైనా తర్వాత భారత్‌లోనే అత్యధికంగా ఈవీ వాహనాలు అమ్ముడవుతున్నాయి. ముఖ్యంగా ఈవీ వాహనాల శ్రేణిలో ఈవీ స్కూటర్లు అమ్మకాల్లో తమ మార్క్‌ను చూపిస్తున్నాయి. పెరుగుతున్న పెట్రోల్ ధరలకు ప్రత్యామ్నాయంగా సగటు మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఈవీ వాహనాల కొనుగోలుకు మక్కువ చూపుతున్నారు. దీంతో స్టార్టప్ కంపెనీల దగ్గర నుంచి టాప్ కంపెనీల వరకూ ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ ఈవీ స్కూటర్లతో వినియోగదారులను పలుకరిస్తున్నారు. ఇప్పటికే కొన్ని కంపెనీలు ఈవీ రంగంలో అమ్మకాల్లో దున్నెస్తున్నాయి. వీటిగా పోటీగా కొన్ని కంపెనీలు నిలుస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఈవీ కంపెనీ ఓలాకు పోటీగా ప్యూర్ ఈవీ కంపెనీ ఈప్లూటో 7 జీ ప్రో పేరుతో ఓ కొత్త ఎలక్ట్రిక్ వాహనాన్ని రిలీజ్ చేసింది. సూపర్ డిజైన్‌తో అధునాతన ఫీచర్లతో ఉన్న ఈ స్కూటర్ కచ్చితంగా వినియోగదారుల మనస్సును గెలుచుకుంటుందని కంపెనీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే ఈ స్కూటర్ బుకింగ్స్‌ను కంపెనీ తమ వెబ్‌సైట్‌లో ఓపెన్ చేసింది. అలాగే బుక్ చేసుకున్న కస్టమర్లకు మే నెలాఖరకు మొదటి బ్యాచ్ స్కూటర్లను అందిస్తామని కంపెనీ వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. అయితే ఇప్లూటో 7 జీ ప్రో స్కూటర్ ధర ఫీచర్ల గురించి ఓ సారి తెలుసుకుందాం.
ఈవీ ప్యూర్ కంపెనీ రిలీజ్ చేసిన ఇప్లూటో 7 జీ ప్రో ధర రూ.94,999(ఎక్స్ షోరూమ్)గా ఉంటుందని కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే ఇప్పటికే ఉన్న ఇప్లూటో 7 జీ స్కూటర్ మాదిరిగా ఈ స్కూటర్ కూడా రెట్రో డిజైన్‌తో వస్తుందని తెలుస్తోంది. అలాగే బాడీ ప్యానెల్‌తో పాటు ఎల్ఈడీ లైట్లు కూడా 7 జీలానే ఉంటాయని కంపెనీ రిలీజ్ చేసిన చిత్రాలను బట్టి తెలుస్తుంది. మ్యాట్ బ్లాక్, గ్రే, వైట్ రంగుల్లో ఈ స్కూటర్ అందరికీ అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. 3.0 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో పాటు స్మార్ట్ బీఎంఎస్‌తో వచ్చే ఈ స్కూటర్‌లో మూడు వేర్వేరు మోడ్స్ ఉంటాయి. అలాగే ఈ స్కూటర్ ఓ సారి చార్జి చేస్తే 100-150 కిలో మీటర్ల మైలేజ్‌ను ఇస్తుంది. ఈ స్కూటర్ 2.4 కేడబ్ల్యూ కంట్రోల్ యూనిట్‌తో 1.5 కేడబ్ల్యూ మోటర్‌తో వస్తుందని కంపెనీ వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. అలాగే ఈ స్కూటర్ లాంచ్ అయిన మొదటి నెలలోనే రెండు వేలకు పైగా బుకింగ్స్ ఆశిస్తున్నట్లు కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు.



మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..