Pure ev eco dryft: మార్కెట్లోకి దూసుకొస్తున్న కొత్త ఎలక్ట్రిక్ బైక్.. ఒక్క సారి ఛార్జ్ చేస్తే ఏకంగా..
మార్కెట్లో ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలు హల్చల్ చేస్తున్నాయి. రోజురోజుకీ పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలో నేపథ్యంలో జనాలు ఎలక్ట్రిక్ వాహనాలకు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వాలు సైతం రాయితీలు ప్రకటిస్తుండడంతో కంపెనీలు పెద్ద ఎత్తున విద్యుత్ ఆధారిత వాహనాల..
మార్కెట్లో ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలు హల్చల్ చేస్తున్నాయి. రోజురోజుకీ పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలో నేపథ్యంలో జనాలు ఎలక్ట్రిక్ వాహనాలకు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వాలు సైతం రాయితీలు ప్రకటిస్తుండడంతో కంపెనీలు పెద్ద ఎత్తున విద్యుత్ ఆధారిత వాహనాల తయారీ చేపడుతున్నాయి. ఇక ఎలక్ట్రిక్ టూ వీలర్స్ విషయానికొస్తే ఇప్పటి వరకు ఎక్కువగా స్కూటీలు మాత్రమే అందుబాటులోకి వస్తున్నాయి. ఎలక్ట్రిక్ బైక్ వెర్షన్స్‌లో రివోల్ట్ తప్ప పెద్దగా చెప్పుకునే బైక్స్ లేవని చెప్పాలి.
ఈ నేపథ్యంలోనే తాజాగా ప్యూర్ ఈ వీ కంపెనీ కొత్త మోటర్ సైకిల్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. ప్యూర్ ఈవీ ఎకో డ్రిఫ్ట్ పేరుతో తీసుకొస్తున్న ఈ బైక్ త్వరలోనే మార్కెట్లో సందడి చేయనుంది. హైదరాబాద్‌కు చెందిన ప్యూర్ ఈవీ స్టార్టప్ వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ బైక్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ ఎలక్ట్రిక్ బైక్‌లో 3 కిలోవాట్ అవర్ బ్యాటరీతొ రూపొందించారు. ఈ బ్యాటరీని ప్యూర్ ఈవీ సంస్థ స్వయంగా తయారు చేయడం విశేషం.
ఈ బైక్ బ్యాటరీని ఒక్కసారి రీఛార్జ్ చేస్తే నాన్‌స్టాప్‌గా 135 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. గంటకు 75 కి.మీల వేగంతో దూసుకెళ్లడం ఈ బైక్ ప్రత్యేకత. ఇంతటి స్పీడ్‌లో వెళ్లినా బైక్‌లో ఎలాంటి షేక్స్ ఉండవని కంపెనీ చెబుతోంది. సాధారణ బైక్‌లతో పోల్చితే ఈ ఎలక్ట్రిక్ బైక్ ఎందులోనూ తీసుపోదని చెబుతున్నారు. జనవరిలో ధరను ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ బైక్‌లో 18 ఇంచెస్ ఫ్రంట్, 17 ఇంచెస్ రెయిర్ అలాయ్ వీల్స్‌ను ఇవ్వనున్నారు. రెడ్, గ్రే, బ్లూ మూడు రంగుల్లో బైక్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇక ఈ ఎలక్ట్రిక్ బైక్ కేవలం 5 సెకండ్లలో 0 నుంచి 40 కి.మీ/గంటకు వేగాన్ని అందుకోవడం మరో విశేషం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..