Ola – Uber Cabs: ఓలా, ఉబర్‌లో ట్రావెల్ చేస్తున్నారా .. ఈ సింపుల్ టిప్స్‌తో మీ డబ్బు ఆదా చేసుకోండి..
Ola - Uber Cabs: చాలా మంది బయటకు వెళ్లాలంటే ఓలా, ఊబర్ వంటి క్యాబ్స్‌ను ఉపయోగిస్తుంటారు. అదే సింగిల్ అయితే ఈమధ్య ర్యాపిడో, ఓలా టూ వీలర్ ఆప్షన్ ఎంచుకుంటున్నారు. ఒక్కోసారి వీటిపై ప్రయాణం చాలా చవకగా ఉంటుంది. కొన్ని సార్లు మాత్రం రేటు చాలా ఎక్కువుగా..
Ola – Uber Cabs: చాలా మంది బయటకు వెళ్లాలంటే ఓలా, ఊబర్ వంటి క్యాబ్స్‌ను ఉపయోగిస్తుంటారు. అదే సింగిల్ అయితే ఈమధ్య ర్యాపిడో, ఓలా టూ వీలర్ ఆప్షన్ ఎంచుకుంటున్నారు. ఒక్కోసారి వీటిపై ప్రయాణం చాలా చవకగా ఉంటుంది. కొన్ని సార్లు మాత్రం రేటు చాలా ఎక్కువుగా ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో హడావుడిగా వెళ్లాల్సి వస్తే ఎక్కువ ఛార్జీలు చెల్లించక తప్పదు. నగరాలు, పట్టణాలకు సైతం ఓలా , ఉబర్, ర్యాపిడో సేవలు చేరుకున్న తర్వాత.. ప్రయాణం సులభతరమైన విషయం అందరికి తెలిసిందే. ఈ క్యాబ్ సేవలు 24 గంటలూ అందుబాటులో ఉండడంతో నగరంలో ఎక్కడికైనా ఎప్పుడైనా ప్రయాణించేందుకు సౌకర్యంగా ఉంటుంది. సాధారణ టాక్సీలతో పోలిస్తే కొన్నిసార్లు ఈ కంపెనీల టాక్సీల ఛార్జీలు కూడా తక్కువగా ఉంటాయి. ఓలా, ఉబర్ యాప్‌లు ప్రయాణ దూరం ఆధారంగా ఛార్జీలు వసూలు చేస్తాయి. అయితే ఈ ఛార్జీలు అన్ని సందర్భాల్లో ఒకేలా ఉండవు . ప్రయాణ సమయం, ప్రయాణించే ప్రాంతంలో టాక్సీల డిమాండ్‌ను బట్టి ఛార్జీలు మారుతూ ఉంటాయి. ఉదాహరణకి ఒక నిర్దిష్ట ప్రాంతానికి ప్రయాణించడానికి సాధారణంగా రూ.100 ఛార్జీ అయితే గిరాకీ ఎక్కువగా ఉంటే ఈ ఛార్జి రూ.150 వరకు పెరిగే అవకాశం ఉంటుంది. ఒక నిర్దిష్ట ప్రాంతంలో డ్రైవర్ల లభ్యత తక్కువగా ఉన్నప్పుడు, ఎక్కువ మంది డ్రైవర్లను ఆ ప్రాంతానికి తరలించడానికి కంపెనీలు ఛార్జీలను పెంచుతూ ఉంటాయి. ఎక్కువ రేట్లను కెప్టెన్‌కు ఆఫర్ చేస్తే ఆ ప్రాంతంలో రైడింగ్‌కు కెప్టెన్స్ ఆసక్తి చూపిస్తుంటారు.
ఏదైనా ప్రాంతంలో డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఛార్జీలు పెంచకపోతే ఆ ప్రాంతంలో ప్రయాణికులు ఎక్కువసేపు వేచి ఉండాల్సి వస్తుంది. ఛార్జీలు వసూలు చేయడం ద్వారా ఎక్కువ మంది డ్రైవర్లు ఆ ప్రాంతానికి వెళ్లడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం దొరుకుందనేది క్యాబ్ సంస్థల ఆలోచన. అత్యవసర పరిస్థితుల్లో హడావుడిగా వెళ్లాల్సి వస్తే ఎక్కువ ఛార్జీలు చెల్లించక తప్పడం లేదు. అయితే రద్దీ లేనప్పుడు ఎక్కువుగా అనిపించే సమయంలో క్యాబ్ ఛార్జిలు తగ్గాలంటే కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవెంటో తెలుసుకుందాం.
డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు లేదా రద్దీ సమయాల్లో క్యాబ్ సర్వీస్‌లను బుక్ చేసుకోవడం మానుకోవాలి. అలా చేస్తే కొద్దిసేపటి తర్వాత ధరలు తగ్గుతాయి. రేట్ల పెంపు రోజంతా ఉండదు. కొంత సేపు వేచి ఉండి, తర్వాత బుక్ చేసుకోవడం ద్వారా అధిక ఛార్జీల నుంచి ఉపశమనం పొందవచ్చు.
ట్యాక్సీ బుక్ చేసుకునే ప్రాంతంలో డిమాండ్ ఎక్కువగా ఉండటం, ఛార్జీలు పెరుగుతున్నట్లు గమనించినట్లయితే, ఆ ప్రాంతం నుంచి కొంచెం ముందుకు నడిచి వెళ్లి టాక్సీని బుక్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. సాధారణంగా కొన్ని ఏరియాలు లేదా ప్రధాన కార్యాలయాల పరిసరాల్లో గిరాకీ ఎక్కువుగా ఉండటంతో ఆ ప్రాంతంలో ఎక్కువ ఛార్జీలు వసూలు చేసే అవకాశం ఉంటుంది. అందుకే కొద్ది దూరం నడిచి గిరాకీ లేని ప్రాంతం నుంచి టాక్సీని బుక్ చేసుకోవడం ద్వారా తక్కువ రేట్లకే సేవలను పొందవచ్చు.
ఒక యాప్ ద్వారా క్యాబ్ బుక్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు ఛార్జీలు పెరిగినట్లు కనిపిస్తే, మరో యాప్‌ని ప్రయత్నించి, ఛార్జీలను సరిపోల్చుకోవడం మంచిది. దీని వల్ల ఆ యాప్ లో తక్కువ రేటుకే ట్యాక్సీ సర్వీస్ లభించే అవకాశం ఉంటుంది. రైడ్ షేరింగ్ ఆప్షన్ ద్వారా మీరు తక్కువ ఛార్జీలతో కూడా ప్రయాణించవచ్చు. ఓలా, ఉబర్‌లో రేట్లు ఎక్కవుగా అనిపిస్తే ఇతర ప్రజాదరణ ఎక్కువుగా లేని యాప్‌లను ఉపయోగించి క్యాబ్ సేవలు పొందండి. చాలా మంది క్యాబ్ సేవలు ఉపయోగించుకునే ప్రయాణీకులు తెలియని అంశం.. ‘షెడ్యూల్ యువర్ ట్రిప్’ ఆప్షన్.. ఈ ఎంపికను ఉపయోగించడం ఉత్తమం. ట్రిప్‌ను ముందుగానే షెడ్యూల్ చేయడం ద్వారా, నిర్ణయించిన ధరను చెల్లిస్తే సరిపోతుంది. ఇకపై క్యాబ్ బుక్ చేసుకోవడానికి వేచి ఉండాల్సిన అవసరం లేదు మరియు ఛార్జీల పెంపుతో సమస్య ఉండదు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..