Electric Car Maintenance: ఎలక్ట్రిక్ కారుకు మెయింటెనెన్స్ ఉండదా? నిజమేనా? అసలు విషయం ఇది..
సాధారణంగా సంప్రదాయ పెట్రోల్, డీజిల్ కార్లకు సర్వీసింగ్ చేయాలంటే సమయం, ఖర్చు అధికంగా వెచ్చించాల్సి ఉంటుంది. అదే సమయంలో ఈ ఎలక్ట్రిక్ కార్లలో తిరిగే భాగాలు తక్కువగా ఉండటంతో దీని మెయింటెనెన్స్ చాలా తక్కువ ఖర్చుతో పాటు సులభంగా అయిపోతోంది. అయితే ఈ ఎలక్ట్రిక్ కారు సర్వీసింగ్ చేయించేటప్పుడు కొన్ని అంశాలను కారు యజమానులు క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం..

దేశ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. కార్లు, స్కూటర్లు, బైక్‌లు పెద్ద ఎత్తున మార్కెట్లో కొలువుదీరుతున్నాయి. పర్యావరణ హిత వాహనాలకు ప్రభుత్వం ప్రోత్సహిస్తుండటం కూడా దీనికి ఓ కారణం. ఈ వాహనాలు రేట్లు కాస్త ఎక్కువగా ఉంటున్నా.. రన్నింగ్ కాస్ట్ తక్కువ కావడంతో వీటిని కొనుగోలు చేయడానికి వినియోగదారులు మొగ్గుచూపుతున్నారు. అయితే వీటికీ సాధారణ కారుకు అవసరమైన విధంగానే మెయింటెనెన్స్ అవసరం. అందుకోసం అధికారిక సర్వీస్ సెంటర్ కు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. సాధారణంగా సంప్రదాయ పెట్రోల్, డీజిల్ కార్లకు సర్వీసింగ్ చేయాలంటే సమయం, ఖర్చు అధికంగా వెచ్చించాల్సి ఉంటుంది. అదే సమయంలో ఈ ఎలక్ట్రిక్ కార్లలో తిరిగే భాగాలు తక్కువగా ఉండటంతో దీని మెయింటెనెన్స్ చాలా తక్కువ ఖర్చుతో పాటు సులభంగా అయిపోతోంది. అయితే ఈ ఎలక్ట్రిక్ కారు సర్వీసింగ్ చేయించేటప్పుడు కొన్ని అంశాలను కారు యజమానులు క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం..
ఆలస్యం చేయవద్దు.. ఏ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ కారు అయిన సమయానుగుణమైన సర్వీస్ అవసరం. కారు మాన్యువల్ల్లో ఇచ్చిన విధంగా కారు తిరిగిన కిలోమీటర్లు లేదా సమయం ఆధారంగా కంపెనీ అధికారిక సర్వీస్ సెంటర్లలో మీ కారును సర్వీసింగ్ చేయించాల్సి ఉంటుంది. దీనిని ఎప్పుడూ ఆలస్యం చేయకూడదు. ఎప్పటికప్పుడు చేయిస్తూ ఉండాలి.
సర్వీస్ సెంటర్‌లో చెప్పండి.. మీరు మీ ఎలక్ట్రిక్ కారును సర్వీసింగ్ కోసం కంపెనీకి తీసుకెళ్లినప్పుడల్లా, కారుకు సంబంధించిన మీ గుర్తించిన ఇతర సమస్యలు వారికి తెలియజేయాలి. అప్పుడు వాటిని కూడా టెక్నీషియన్ తనిఖీ చేసి, అవసరమైన మరమ్మతులు చేస్తారు. ఇది భవిష్యత్తులో ఉత్పన్నమయ్యే సమస్యలను కూడా నివారించేందుకు వీలవుతుంది.
మోటార్, బ్యాటరీ తనిఖీ.. ఎలక్ట్రిక్ కారులో ప్రధానంగా రెండు ముఖ్య భాగాలుంటాయి. వాటిల్లో ఒకటి మోటార్ కాగా, రెండోది బ్యాటరీ. వీటి సామర్థ్యాల గురించి మీకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి, వాటిని కూడా తనిఖీ చేసుకోవాలి. అవసరమైతే కారు సాఫ్ట్‌వేర్ ను కడూఆ అప్‌డేట్ చేసుకోవాలి. దీని వల్ల కారు పనితీరు మెరుగవడంతో పాటు కారు రేంజ్ పెరుగుతుంది.
ఈ భాగాలపై కూడా శ్రద్ధ అవసరం.. మీరు కారును సర్వీస్ చేసినప్పుడల్లా, డోర్లు, బానెట్, ట్రంక్, బ్రేక్‌లు, లైట్లు, గేర్ ఆయిల్ వంటి వాటిని చెక్ చేసుకోవడం అవసరం. ఎలక్ట్రిక్ కారుకు ఇంజిన్ ఉండదు.. అందుకే ఇంజన్ ఆయిల్, ఇంజన్ సంబంధిత సమస్యలు ఉండవు. కానీ ఇతర కార్ల మాదిరిగానే ఇందులో బ్రేకులు, లైట్లు, స్టీరింగ్, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి అంశాలు ఉన్నాయి. కాబట్టి వాటిని తనిఖీ చేసుకోవాలి.
నిర్వహణ సులభం.. సంప్రదాయ పెట్రోల్, డీజిల్ ఇంజిన్లతో పోల్చితే ఈ ఎలక్ట్రిక్ కార్లను మెయింటేన్ చేయడం, సర్వీసింగ్ చేయించడం సులభం. ఎందుకంటే వీటిల్లో ఇంజిన్ ఉండదు, చక్రాలు తప్ప ఇతర తిరిగే భాగాలు ఉండవు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..