Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tesla EV Car: భారత్‌లో టెస్లా ఈవీ యూనిట్‌.. ఇక తక్కువ ధరకే ఈవీ కార్లు..

తాజాగా పలు నివేదికల ప్రకారం టెస్లా భారతదేశంలో ఈవీ కార్ల యూనిట్‌ నెలకొల్పనుందని పేర్కొంటున్నారు. టెస్లా ఈవీ కార్ల దిగుమతి సమస్యకు పరిష్కారం చూపుతూ ఎట్టకేలకు టెస్లా భారతదేశంలో తయారీ యూనిట్‌ను నెలకొల్పనుంది. దాదాపు రెండేళ్ల తర్వాత టెస్లా భారతదేశంలో ఉత్పత్తి యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. వచ్చే ఏడాది జరగనున్న వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్‌లో ఈ మేరకు ప్రకటన రానుందని తెలస్తుంది.

Tesla EV Car: భారత్‌లో టెస్లా ఈవీ యూనిట్‌.. ఇక తక్కువ ధరకే ఈవీ కార్లు..
Tesla
Follow us
Srinu

| Edited By: Ravi Kiran

Updated on: Nov 25, 2023 | 9:15 PM

ప్రపంచవ్యాప్తంగా ఈవీ వాహనాల అమ్మకాలు జోరు మీద ఉన్నాయి. ఊహించని అనూహ్య డిమాండ్‌ మేరకు టాప్‌ కంపెనీల నుంచి స్టార్టప్‌ కంపెనీల వరకూ ఈవీ వాహనాలను రిలీజ్‌ చేస్తున్నాయి. అయితే ప్రీమియం కార్ల కస్టమర్లకు టెస్లా కంపెనీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా టాప్‌ 10 కార్ల ఉత్పత్తి సంస్థల్లో టెస్లా కూడా ఒకటి. అయితే తాజాగా పలు నివేదికల ప్రకారం టెస్లా భారతదేశంలో ఈవీ కార్ల యూనిట్‌ నెలకొల్పనుందని పేర్కొంటున్నారు. టెస్లా ఈవీ కార్ల దిగుమతి సమస్యకు పరిష్కారం చూపుతూ ఎట్టకేలకు టెస్లా భారతదేశంలో తయారీ యూనిట్‌ను నెలకొల్పనుంది. దాదాపు రెండేళ్ల తర్వాత టెస్లా భారతదేశంలో ఉత్పత్తి యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. వచ్చే ఏడాది జరగనున్న వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్‌లో ఈ మేరకు ప్రకటన రానుందని తెలస్తుంది. కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాలు టెస్లా ఉత్పత్తి యూనిట్‌ను ఉంచే రేసులో పాల్గొంటాయని భావిస్తున్నారు. టెస్లా తయారీ యూనిట్‌ను గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

టెస్లా ఎలక్ట్రిక్ కార్లు యూనిట్‌ కోసం అధిక ప్రమాణాలతో దేశంలో ఉత్పత్తి యూనిట్‌ను స్థాపించడానికి కనీసం 2 బిలియన్ల యూఎస్‌ డాలర్లు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. టెస్లా 15 బిలియన్ల యూఎస్‌ డాలర్ల  విలువైన భాగాలను స్థానికంగా సోర్స్ చేయగలదని నివేదికలు సూచిస్తున్నాయి. టెస్లా తన ఈవీ కార్ల ధరను తగ్గించడానికి దేశీయంగా బ్యాటరీ ప్యాక్‌లను ఉత్పత్తి చేస్తుందని మునుపటి నివేదికలు పేర్కొన్నాయి. ఈ చర్యలతో టెస్లాకు సంబంధించిన మొదటి మేడ్-ఇన్-ఇండియా ఉత్పత్తి ధర రూ. 17 లక్షలు మాత్రమే అని అనేక నివేదికలు వెల్లడిస్తున్నాయి. 

భారత ప్రభుత్వం, బ్రాండ్ మధ్య సంబంధాలు కూడా మెరుగుపడినందున టెస్లా ప్రవేశం ఇప్పుడు కచ్చితంగా ఉంటుందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇటీవల కేంద్ర వాణిజ్య మంత్రి యూఎస్‌ఏలోని టెస్లా ఫ్యాక్టరీని సందర్శించారు. ఎలోన్ మస్క్ అనారోగ్యంతో పీయూష్ గోయెల్‌ను కలవలేకపోయినందున అతను తర్వాత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో క్షమాపణలు చెప్పాడు. మంత్రి పీయూష్ గోయెల్ అత్యాధునిక తయారీ యూనిట్‌ను సందర్శించడంపై సంతోషం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తెలుగు ఐకానిక్ సాంగ్‌కు అసభ్యకర డాన్స్..
తెలుగు ఐకానిక్ సాంగ్‌కు అసభ్యకర డాన్స్..
వేసవిలో ఎండుద్రాక్షఎలా తినాలో తెలుసా.. లేదంటే ఆరోగ్యానికి హానికరం
వేసవిలో ఎండుద్రాక్షఎలా తినాలో తెలుసా.. లేదంటే ఆరోగ్యానికి హానికరం
ఇది గమనించారా.. SRH ఓటమికి కాటేరమ్మ కొడుకే కారణం?
ఇది గమనించారా.. SRH ఓటమికి కాటేరమ్మ కొడుకే కారణం?
బిగ్ షాక్.. TGPSC గ్రూప్ 1 నియామకాలు నిలిపివేస్తూ హైకోర్టు స్టే..
బిగ్ షాక్.. TGPSC గ్రూప్ 1 నియామకాలు నిలిపివేస్తూ హైకోర్టు స్టే..
పెండింగ్ పనులు పూర్తి అయ్యేందుకు ఏకాదశి రోజున ఈ పరిహారాలు చేయండి
పెండింగ్ పనులు పూర్తి అయ్యేందుకు ఏకాదశి రోజున ఈ పరిహారాలు చేయండి
JEE Main 2025 ఫలితాలపై వీడని ఉత్కంఠ.. ఫైనల్ కీ ఎందుకు తొలగించారో?
JEE Main 2025 ఫలితాలపై వీడని ఉత్కంఠ.. ఫైనల్ కీ ఎందుకు తొలగించారో?
కోహ్లీ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. పంజాబ్‌తో మ్యాచ్ రద్దయ్యేనా?
కోహ్లీ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. పంజాబ్‌తో మ్యాచ్ రద్దయ్యేనా?
అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ట్విట్టర్ రివ్యూ
అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ట్విట్టర్ రివ్యూ
శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల జూలై నెల కోటా విడుదల ఎప్పుడంటే..
శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల జూలై నెల కోటా విడుదల ఎప్పుడంటే..
భోజనానికి పిలిచినా ఇలాంటి వారింటికి వెళ్ళవద్దన్న చాణక్య ఎందుకంటే
భోజనానికి పిలిచినా ఇలాంటి వారింటికి వెళ్ళవద్దన్న చాణక్య ఎందుకంటే