Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maruti Suzuki: ఎదురుచూపులకు ఫుల్ స్టాప్.. 2024లో ఆ కార్ల గ్రాండ్ ఎంట్రీ..

గత కొన్నేళ్లుగా మన దేశం మార్కెట్లో అన్ని రకాల కార్లలోనూ తన ముద్ర వేయాలని మారుతి సుజుకీ తలపోస్తోంది. ఈ క్రమంలో 2024లో కూడా కొత్త ఉత్పత్తులను లాంచ్ చేసేందుకు సిద్ధం చేసింది. వాటిల్లో కొన్ని ఎలక్ట్రిక్ వేరియంట్ కూడా ఉన్నాయి. 2023 ఫ్రిబవరీలో జరిగిన ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించిన ఈవీఎక్స్ ఎలక్ట్రిక్ ఎస్ యూవీ కాన్సెప్ట్ ను వచ్చ ఏడాదిలో లాంచ్ చేయనుంది. అలాగే న్యూ జనరేషన్ స్విఫ్ట్ కూడా 2024లోనే వచ్చే అవకాశం ఉంది.

Maruti Suzuki: ఎదురుచూపులకు ఫుల్ స్టాప్.. 2024లో ఆ కార్ల గ్రాండ్ ఎంట్రీ..
Maruti Suzuki Evx
Follow us
Madhu

| Edited By: Shaik Madar Saheb

Updated on: Dec 21, 2023 | 7:32 PM

ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకీ 2023లో కొన్ని ఎక్సైటింగ్ కార్లను లాంచ్ చేసింది. బాలెనో ఆధారంగా రూపొందించిన ఫ్రాంక్స్ క్రాస్ ఓవర్, ఎంతో కాలంగ ఎదురుచూస్తున్న జిమ్నీ ఎస్ యూవీ, ఇన్విక్టో ప్రీమియం ఎంపీవీ వంటి మోడళ్లను పరిచయం చేసింది. గత కొన్నేళ్లుగా మన దేశం మార్కెట్లో అన్ని రకాల కార్లలోనూ తన ముద్ర వేయాలని మారుతి సుజుకీ తలపోస్తోంది. ఈ క్రమంలో 2024లో కూడా కొత్త ఉత్పత్తులను లాంచ్ చేసేందుకు సిద్ధం చేసింది. వాటిల్లో కొన్ని ఎలక్ట్రిక్ వేరియంట్ కూడా ఉన్నాయి. 2023 ఫ్రిబవరీలో జరిగిన ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించిన ఈవీఎక్స్ ఎలక్ట్రిక్ ఎస్ యూవీ కాన్సెప్ట్ ను వచ్చ ఏడాదిలో లాంచ్ చేయనుంది. అలాగే న్యూ జనరేషన్ స్విఫ్ట్ కూడా 2024లోనే వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో 2024లో మారుతి సుజుకీ నుంచి లాంచ్ కానున్న టాప్ మోడళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

కొత్త జనరేషన్ మారుతి సుజుకీ స్విఫ్ట్..

వచ్చే ఏడాది మారుతి సుజుకీ కొత్త జనరేషన్ స్విఫ్ట్ కారును మన దేశంలో లాంచ్ చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే దీనిని జపాన్లో ఆవిష్కరించింది. ప్రస్తుతం ఇక్కడ టెస్టింగ్ దశలో ఉంది. ఇది నాలుగో తరం స్విఫ్ట్ వాహనం. దీనిలో డిజైన్ పరంగా కీలక మార్పులు చేశారు. కొన్ని కొత్త ఫీచర్లను జోడించారు. 360డిగ్రాల కెమెరాలు, అడాస్ ఫీచర్లు, డ్యూయల్ సెన్సార్ బ్రేక్ సపోర్టు, అడాప్టివ్ హై బీమ్ అసిస్ట్, డ్రైవర్ మోనిటరింగ్ సిస్టమ్, కొలిజన్ మిటిగేషన్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి కొత్త ఫీచర్లు అదనపు భద్రతను అందిస్తాయి. ఈ కొత్త వెర్షన్ స్విఫ్ట్ కారులో జెడ్ సిరీస్ ఇంజిన్ ఉంటుంది. ప్రస్తుతం ఉన్న స్విఫ్ట్ కారులో కే సిరీస్ 1.2 లీర్ ఇంజిన స్థానంలో జెడ్ సిరీస్ ఇంజిన్ వస్తోంది. ఈ కారుకు సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్లు ఇంకా విడుదల కాలేదు.

మారుతి సుజుకీ ఈవీఎక్స్..

భారత దేశంలో అత్యధిక మార్కెట్ కలిగిన మారుతి సుజుకీ.. ఇప్పటి వరకూ ఒక్క ఎలక్ట్రిక్ కారును కూడా తీసుకురాలేదు. ఈ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఆటో ఎక్స్ పోలో తన తొలి ఈవీ కాన్సెప్ట్ ను ఆవిష్కరించింది. పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ ఎస్ యూవీగా దీనిని ప్రదర్శించింది. ఈవీఎక్స్ పేరుతో దీనిని తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇది సింగిల్ చార్జ్ పై 550 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే 60 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉంటుంది. 4,300ఎంఎం పొడవులు, 1800ఎంఎం వెడల్పు, 1600ఎంఎం ఎత్తు ఉంటుంది. ఈ కారు టాటా నెక్సాన్ ఈవీ, మహీంద్రా ఎక్స్ యూవీ400 కార్లతో పోటీ పడే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మారుతి సుజుకీ డిజైర్..

ఎస్ యూవీ రాకతో సెడాన్ కార్లకు మార్కెట్లో డిమాండ్ తగ్గిపోయింది. అయినప్పటికీ సెడాన్ రకంలో కార్లలో అత్యధికంగ అమ్ముడవుతున్న కారు ఈ డిజైర్. మార్కెట్లో దీనికున్న డిమాండ్ కు అనుగుణంగా దీనిని అప్ గ్రేడ్ చేసి కొత్త జనరేషన్ కారుగా రీలాంచ్ చేసేందుకు మారుతి సుజుకీ ఏర్పాట్లు చేస్తోంది. డిజైన్ లో కూడా మార్పులు చేసి, అదనపు ఫీచర్లను జోడించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

స్త్రీలకు సౌభాగ్యాన్ని ఇచ్చే కామద ఏకాదశి ఎప్పుడు? పూజా విధానం
స్త్రీలకు సౌభాగ్యాన్ని ఇచ్చే కామద ఏకాదశి ఎప్పుడు? పూజా విధానం
ఏప్రిల్‌ నెలలో వచ్చే సరికొత్త స్మార్ట్‌ ఫోన్లు.. ఫీచర్స్‌ ఇవే..!
ఏప్రిల్‌ నెలలో వచ్చే సరికొత్త స్మార్ట్‌ ఫోన్లు.. ఫీచర్స్‌ ఇవే..!
బాత్రూంలోకి వచ్చిన పాము.. నీ కష్టం పగవాడికి కూడా రాకూడదు బ్రో..
బాత్రూంలోకి వచ్చిన పాము.. నీ కష్టం పగవాడికి కూడా రాకూడదు బ్రో..
నీటి అడుగున రైలు మార్గం..ముంబై టూ దుబాయ్‌..కేవలం రెండు గంటల్లోనే!
నీటి అడుగున రైలు మార్గం..ముంబై టూ దుబాయ్‌..కేవలం రెండు గంటల్లోనే!
నార్త్ సినిమాల్లో సౌత్ మిక్చర్‌... సక్సెస్‌ కోసం బాలీవుడ్ పాట్లు
నార్త్ సినిమాల్లో సౌత్ మిక్చర్‌... సక్సెస్‌ కోసం బాలీవుడ్ పాట్లు
అందాలతో సెగలు రేపుతున్న పాయల్.. ఫొటోస్ చూస్తే మతిపోవాల్సిందే!
అందాలతో సెగలు రేపుతున్న పాయల్.. ఫొటోస్ చూస్తే మతిపోవాల్సిందే!
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు బంద్.. ఏయే రోజుల్లో అంటే..!
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు బంద్.. ఏయే రోజుల్లో అంటే..!
భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తిని భర్త ఏం చేశాడో తెలుసా?
భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తిని భర్త ఏం చేశాడో తెలుసా?
రాత్రైదంటే వింత శబ్దాలు.. ఊరంతా భయం తో రచ్చ రచ్చ..
రాత్రైదంటే వింత శబ్దాలు.. ఊరంతా భయం తో రచ్చ రచ్చ..
ర్డీ సాయిబాబా సంస్థాన్ సంచలన నిర్ణయం.. భక్తులకు ఉచిత బీమా సౌకర్యం
ర్డీ సాయిబాబా సంస్థాన్ సంచలన నిర్ణయం.. భక్తులకు ఉచిత బీమా సౌకర్యం