GPF: వడ్డీ లేకుండా రుణం! ఎప్పుడు? ఎక్కడ? ఎలా?
వడ్డీ లేకుండా రుణం.. నిజమా? ఎక్కడో చెప్పండి.. వెంటనే వెళ్లి తీసుకుంటాం అని అడగాలి అనిపిస్తోందా? ఆగండాగండి.. ఇది అందరికీ కాదు. కేవలం ప్రభుత్వం ఉద్యోగులకు మాత్రమే. అది కూడా 2004కు ముందు ఉద్యోగంలో చేరిన వారికి మాత్రమే. సాధారణంగా ప్రభుత్వం, ప్రభుత్వ ఉద్యోగులకు వారి ఉద్యోగ సమయంలో చాలా సదుపాయాలు ఉంటాయి. వాటితో పాటు ప్రత్యేక రుణ సౌకర్యం కూడా ఉంటుంది.

వడ్డీ లేకుండా రుణం.. నిజమా? ఎక్కడో చెప్పండి.. వెంటనే వెళ్లి తీసుకుంటాం అని అడగాలి అనిపిస్తోందా? ఆగండాగండి.. ఇది అందరికీ కాదు. కేవలం ప్రభుత్వం ఉద్యోగులకు మాత్రమే. అది కూడా 2004కు ముందు ఉద్యోగంలో చేరిన వారికి మాత్రమే. సాధారణంగా ప్రభుత్వం, ప్రభుత్వ ఉద్యోగులకు వారి ఉద్యోగ సమయంలో చాలా సదుపాయాలు ఉంటాయి. వాటితో పాటు ప్రత్యేక రుణ సౌకర్యం కూడా ఉంటుంది. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తన ఉద్యోగ సమయంలో ఈ రుణ సదుపాయన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఇందులో చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే, రుణాన్ని తిరిగి చెల్లించడానికి ఆ ఉద్యోగికి పూర్తి స్వేచ్ఛ లభిస్తుంది. పైగా దానిపై ఎటువంటి వడ్డీ వసూలు చేయరు. దీనిక సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
వాస్తవానికి, 2004 సంవత్సరానికి ముందు, ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారి కోసం జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (జీపీఎఫ్) అమలులో ఉండేది. ఈ ఖాతాలో, ఉద్యోగి జీతం నుంచి ప్రతి నెలా కొంత మొత్తం కట్ చేసి, ఈ ఖాతాలో జమ చేస్తారు. ఇది పదవీ విరమణ లేదా ఉద్యోగం సమయంలో అవసరానికి అనుగుణంగా అందుబాటులో ఉంటుంది. ఈ ఖాతాలో అతి పెద్ద ఫీచర్ ఎంటంటే దీనిలోని మొత్తాన్ని మీరు రుణ రూపంలో తీసుకోవచ్చు. దీనిపై ఎటువంటి వడ్డీ వసూలు చేయరు. అయితే 2004 నుంచి కొత్త పెన్షన్ స్కీమ్ నేషనల్ పెన్షన్ స్కీమ్(ఎన్‌పీఎస్) అమలులోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎఫ్ ఖాతాలు ప్రారంభించడాన్ని నిలిపివేశారు.
జీపీఎఫ్ ఖాతాలో డిపాజిట్ నియమం..
ప్రతి నెలా, ప్రభుత్వ ఉద్యోగి బేసిక్, డీఏ జీతంలో 6 శాతం జీపీఎఫ్ ఖాతాలో జమ చేస్తారు. ఇది కనిష్ట మొత్తం, గరిష్టంగా 100 శాతం కూడా డిపాజిట్ చేయవచ్చు. దీనిపై ప్రభుత్వం నుంచి ప్రతి సంవత్సరం వడ్డీ కూడా లభిస్తుంది. ప్రస్తుతం జీపీఎఫ్‌పై వార్షిక వడ్డీ 7.1 శాతంగా ఉంది, ఇది ప్రతి త్రైమాసికంలో మారుతూ ఉంటుంది.
మీరు ఎంత డబ్బు రుణంగా తీసుకోవచ్చు..
జీపీఎఫ్ ఖాతాలో జమ చేసిన మొత్తం మొత్తంలో 75 శాతం వరకు రుణం తీసుకోవచ్చు. 2021 సంవత్సరంలో, ప్రభుత్వం దీనిపై పరిమితి విధించింది. మొత్తంలో 10 శాతం నుంచి 50 శాతం మాత్రమే విత్‌డ్రా చేసుకునే వెసులుబాటును కల్పించింది. అయితే, తర్వాత దాని పరిమితిని తిరిగి 90 శాతానికి మార్చారు. ఉద్యోగి మొత్తం సర్వీస్ వ్యవధి ఆధారంగా డబ్బు ఉపసంహరణ పరిమితి నిర్ణయిస్తారు. అయితే రుణం తిరిగి చెల్లించేందుకు దానిపై వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదు.
రెండు రకాల రుణాలు..
జీపీఎఫ్ నుంచి రెండు రకాల రుణాలు తీసుకోవచ్చు. 15 సంవత్సరాల ఉద్యోగ జీవితం గడిచినట్లయితే, ఉద్యోగి శాశ్వత రుణాన్ని తీసుకోవచ్చు. దీనిలో గరిష్టంగా 75 శాతం, కొన్ని సందర్భాల్లో 90 శాతం మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. దీనిపై ఎలాంటి వడ్డీ విధించరు. పదవీ విరమణకు మీకు 10 సంవత్సరాల కంటే తక్కువ సమయం ఉంటే, ఈ డబ్బును తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు ఇష్టమైతే ఈఎంఐ రూపంలో తిరిగి చెల్లించొచ్చు. కానీ మీ నుంచి రికవరీ మాత్రం ప్రభుత్వం చేయదు. 15 సంవత్సరాల కంటే తక్కువ సర్వీస్ ఉన్న ఉద్యోగులకు తాత్కాలిక రుణం ఇస్తారు. ఇందులో కూడా డిపాజిట్ చేసిన మొత్తంలో 75 శాతం, కొన్ని సందర్భాల్లో 90 శాతం విత్‌డ్రా చేసుకోవచ్చు. దీనిపై వడ్డీ కూడా వసూలు చేయరు. అయితే 24 సమాన వాయిదాలలో విత్‌డ్రా చేసిన డబ్బును తిరిగి ఇవ్వాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..