AC Buying Guide: ఏసీ కొనాలనుకునే వారికి అలర్ట్‌! ఈ విషయాలు తెలుసుకోకపోతే చాలా నష్టపోతారు..

మీరు ఒకవేళ కొత్త ఏసీ కొనుగోలు చేసే ఉద్దేశంలో ఉంటే ఈ కథనాన్ని అస్సలు మిస్‌ అవ్వొద్దు. ఎందుకంటే ఏసీ కొనే ముందు తప్పక తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలున్నాయి. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

AC Buying Guide: ఏసీ కొనాలనుకునే వారికి అలర్ట్‌! ఈ విషయాలు తెలుసుకోకపోతే చాలా నష్టపోతారు..
Air Conditioner
Follow us
Madhu

|

Updated on: Apr 05, 2023 | 2:00 PM

మార్చి ముగిసింది. ఏప్రిల్‌ మాసంలో అప్పుడే ఐదు రోజులు గడిచిపోయాయి. రానురానూ వేసవి ముదురుతోంది. భానుడు తన ప్రతాపం చూపడం ప్రారంభించాడు. వేడి గాలులు, ఉక్కుపోత వంటి ఇబ్బందులు మొదలయ్యాయి. దీంతో అందరూ గోడలవైపు చూస్తున్నారు. గోడలవైపు చూడటం ఏమిటని అనుకొంటున్నారా? అదేనండీ ఏసీ ఆన్‌లో ఉందా లేదా అని చూసుకొంటున్నారు. మరికొందరు కొత్త ఏసీలు కొనుగోలు చేసేందుకు ప్రణాళిక చేసుకొంటున్నారు. మీరు ఒకవేళ కొత్త  ఎయిర్ కండీషనర్ (ఏసీ) కొనుగోలు చేసే ఉద్దేశంలో ఉంటే ఈ కథనాన్ని అస్సలు మిస్‌ అవ్వొద్దు. ఎందుకంటే ఏసీ కొనే ముందు తప్పక తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలున్నాయి. ముఖ్యంగా ఏసీ రకం, స్టార్‌ రేటింగ్‌, కెపాసిటీ వంటివి తప్పక తెలుసుకోవాలి. ఆ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

రెండు రకాలున్నాయి..

ఎయిర్ కండీషనర్లు(ఏసీ)లో రెండు రకాలు ఉంటాయి. అవి స్ల్పిట్ ఏసీ, విండో ఏసీ. స్ల్పిట్ ఏసీకి ఇండోర్, అవుట్ డోర్ యూనిట్లు ఉంటాయి. ఇండోర్ యూనిట్ గదిలో గోడకు ఉంటుంది. ఔట్‍డోర్ యూనిట్ బయటి ప్రదేశంలో ఉంచుకోవాలి. అదే విండో ఏసీ అయితే.. ఒకే యూనిట్ ఉంటుంది. కిటికీ అంత స్పేస్‍లో కూలింగ్ ఇచ్చే వైపును గదిలోపలికి వచ్చేలా గోడకు సెట్ చేసుకోవాలి. అయితే విండో ఏసీతో పోలిస్తే స్ప్లిట్ ఏసీ.. ఎక్కువగా కూలింగ్ ఇవ్వటంతో పాటు గదిలో గాలిని బాగా విస్తరింపజేయగలదు. ఎయిర్ ఫ్లో బాగుంటుంది. లుక్ పరంగానూ స్ల్పిట్ ఏసీ బావుంటుంది. విండో ఏసీలు అంత ఆకర్షణీయంగా ఉండవు. స్ప్లిట్ ఏసీని గదిలో వేరే చోటికి సులభంగా మార్చుకోవచ్చు. విండో ఏసీని ఒక్కసారి సెట్ చేస్తే వేరే చోటికి మార్చడం కష్టంతో కూడుకున్న పని. అయితే, విండో ఏసీల కంటే స్ల్పిట్ ఏసీలు ధర ఎక్కువగా ఉంటాయి. స్ప్లిట్ ఏసీలకు మెయింటెనెన్స్ కూడా ఎక్కువగా అవసరం.

కెపాసిటీ.. ఏసీకి సంబంధించి టోనేజ్ కెపాసిటీ అనేది ముఖ్యమైన విషయం. మీరు ఏసీ ఏర్పాటు చేయాలనుకుంటున్న గదికి ఎంత కెపాసిటీ ఏసీ అవసరం అవుతుందో ముందుగా తెలుసుకోవాలి. మీ రూమ్ సైజును బట్టి ఏసీ కెపాసిటీని ఎంపిక చేసుకోవాలి. 120 నుంచి 140 స్క్వేర్ ఫీట్ (చదరపు అడుగులు) విస్తీర్ణం వరకు ఉండే గదికి ఒక టన్ కెపాసిటీ ఉండే ఏసీ సరిపోతుంది. అదే 140 నుంచి 200 చదరపు అడుగుల వరకు విస్తీర్ణం ఉండే రూమ్‍కు 1.5 టన్ కెపాసిటీ ఉండే ఏసీని ఎంపిక చేసుకోవాలి. ఇక200 చదరపు అడుగులకు మించి మీ రూమ్ సైజ్ ఉంటే 2 టన్నుల కెపాసిటీ ఏసీని తీసుకోవాల్సి ఉంటుంది. కన్వర్టబుల్ ఏసీ తీసుకుంటే అవసరాన్ని బట్టి కెపాసిటీని తగ్గించుకునే ఫీచర్ కూడా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

స్టార్ రేటింగ్ చాలా ముఖ్యం.. ఎయిర్ కండీషనర్లకు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) ఇచ్చే రేటింగ్ చాలా ముఖ్యం. ఎక్కువ స్టార్ రేటింగ్ ఉన్న ఏసీలు తక్కువ విద్యుత్‍ను వాడుకుంటాయి. 1 నుంచి 5 స్టార్ రేటింగ్ వరకు ఏసీలు ఉంటాయి. 2 స్టార్ ఏసీతో పోలిస్తే 5 స్టార్ రేటింగ్ ఉండే ఏసీ తక్కువ విద్యుత్‍ను వాడుకుంటుంది. 5 స్టార్ రేటింగ్ ఏసీల వల్ల విద్యుత్ ఆదా అవుతుంది. అలాగే ఇన్‍బుల్ట్‌గా ఇన్వర్టర్ ఫీచర్ ఉండే ఏసీలు తక్కువ విద్యుత్‍ను వాడుకుంటాయి.

కాయిల్స్‌ కూడా.. ఎయిర్ కండీషనర్‌లోని భాగాలు ఏ మెటీరియల్‍తో తయారయ్యాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. కండెన్సర్ కాయిల్.. కాపర్‌తో ఉండే ఏసీలు మెరుగ్గా పనిచేస్తాయి. అల్యూమినియమ్ కాయిల్‍లతో పోలిస్తే కాపర్ కాయిల్ ఉన్న ఏసీలు మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తాయి.

సర్వీస్ ఎలా.. ఎయిర్ కండీషనర్ కొన్న తర్వాత సర్వీస్ అనేది కూడా చాలా ముఖ్యమైన విషయం. మీరు కొనాలనుకుంటున్న కంపెనీ సర్వీస్ ఎలా ఉందో ముందుగా తెలుసుకోవాలి. మీ ఇంటికి ఎంత దూరంలో ఆ కంపెనీ సర్వీస్ సెంటర్ ఉందో సమాచారం తెలుసుకోవాలి. ఏసీ కొనే ముందు ఆ కంపెనీ డీలర్‌నో లేకపోతే సర్వీస్ సెంటర్‌కో ఫోన్ చేసి సర్వీస్‍పై మీకు ఉన్న సందేహాలన్నింటికీ సమాధానాలు తెలుసుకోవాలి. కంపెనీ సర్వీస్ రికార్డు ఎలా ఉందో వాకబు చేయాలి. వారెంటీ విషయంలో వివరాలను స్పష్టంగా చూడాలి.

ఫీచర్లు చెక్‌ చేసుకోండి.. ఇటీవలి కాలంలో ఏసీలు స్మార్ట్ ఫీచర్లతో వస్తున్నాయి. వైఫై, వాయిస్ కంట్రోల్స్, స్మార్ట్ ఫోన్ నుంచి కంట్రోల్ చేసేలా యాప్ సపోర్ట్ సహా మరిన్ని ఫీచర్లను కలిగి ఉంటున్నాయి. ఏసీని కొనే ముందు ఫీచర్లను కూడా తెలుసుకోవాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
నేడు మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు
నేడు మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా
విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!