Business Idea: హెల్దీ ఫుడ్స్ ఐటెమ్స్‌కి మార్కెట్లో ఫుల్ డిమాండ్.. ఇలా చేస్తే మీ బిజినెస్ సూపర్ హిట్..
ప్రజలు రోజూ తినే ఆహార పదార్థాలపై అవగాహన పెంచుకోవాలి. వాటిని ఆర్డర్ చేయగానే అందించే వ్యవస్థ ఉండాలి. సత్వర డెలివరీ ఆప్షన్స్ అందుబాటులో ఉంచుకోవాలి.
ఆహార ఉత్పత్తుల వ్యాపారంలో కస్టమరే రాజు. వారి టేస్ట్, ఇష్టం, అలవాట్లను బట్టి వ్యాపారులు ఉత్పత్తులు అందించాల్సిందే. ప్రజల ఆహార అలవాట్లు మారుతున్నాయి. ఇటీవల కాలంలో జంక్ ఫుడ్స్ కి దూరం జరుగుతూ, మంచి న్యూట్రిషన్ గుణాలున్న ఆహార పదార్థాలు తీసుకునేందుకు మొగ్గుచూపుతున్నారు. అది కూడా రుచికరమైన పౌష్టికాహారమై ఉండాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మెక్‌డొనాల్డ్స్, కేఎఫ్‌సీ, పెప్సీ, కోక్ వంటి కంపెనీలు కూడా ఇప్పుడు తక్కువ కొవ్వు, తక్కువ చక్కెర, తక్కువ సోడియం ఆహార పదార్థాలను తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నాయి. ఈ క్రమంలో మీరు ఏదైనా ఆహార ఉత్పత్తుల వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే మీరు దృష్టి పెట్టాల్సిన అంశాలు ఏంటి? ఏ ఆహారాన్ని మనం వ్యాపారంగా మలుచుకోవాలి? అనే విషయాల గురించి తెలుసుకుందాం..
మార్కెట్‌లో దొరకని పదార్థం అయితే..
మీరు ఒక ఆహార ఉత్పత్తితో వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచన చేస్తే.. ముందు మార్కెట్లో లభ్యమవుతున్న వస్తువుల గురించి అధ్యయనం చేయాలి. ఏ పదార్థానికి మార్కెట్లో డిమాండ్ ఉంది.. ఏది సులువుగా దొరకడం లేదు అన్న విషయాలు తెలుసుకోవాలి. మీరు వ్యాపారం చేయాలనుకొంటున్న ప్రదేశంలో దొరకని ఫుడ్‌ని మీ వ్యాపార వస్తువుగా మార్చుకోవాలి.
న్యూట్రిషన్ ఫుడ్‌కి డిమాండ్..
కరోనా అనంతరం ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెరిగింది. ఎక్కువ ప్రోటీన్లు ఉన్న ఆహారం తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. తక్కువ కేలరీలతో పాటు, ఆరోగ్యానికి మంచి చేసే ఫుడ్ వైపే మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుత ట్రెండ్‌కు అనుగుణంగా న్యూట్రిషన్ ఫుడ్ బిజినెస్ పెట్టడం బెస్ట్..
ప్రయోజనాలు వివరించాలి..
మీరు వ్యాపార వస్తువుగా మలచుకున్న న్యూట్రిషన్ ఫుడ్ ని మార్కెటింగ్ చేసుకోవాలి. అందుకోసం దానిని ఇది వరకే వినియోగించిన వారి చేత ఆ ఫుడ్ గురించి చెప్పించగలగాలి. అప్పుడు మార్కెట్ త్వరగా గ్రాబ్ చేసే వీలుంటుంది. ఈ ఫుడ్ వల్ల కలిగే ప్రయోజనాలు, ఆరోగ్యంపై అది చూపే ప్రభావాన్ని కస్టమర్లు సులువుగా అర్థం చేసుకోవడానికి దీని ద్వారా వీలవుతుంది.
ఆహార సంస్థలు ఇచ్చే డిస్కౌంట్స్..
చాలా ఆహార సంస్థలు తమ ఉత్పత్తులను విక్రయించేందుకు సహేతుకమైన అద్దెను చెల్లిస్తాయి. వారి ఉద్యోగులను ప్రోత్సహించే నెట్‌వర్క్‌లలో భాగం అవుతాయి. అటువంటి వాటి కోసం వెతకాలి. అలాగే కొన్ని సార్లు ప్రభుత్వాలు కొన్ని ప్రోత్సాహకాలు అందిస్తాయి. వాటని తెలుసుకోవాలి. ఉదాహరణకు కేరళలో పురుగుమందులు లేకుండా కూరగాయలు పండించేవారికి ప్రభుత్వం బహుమతులను అందిస్తోంది.
ప్రజలు రోజూ తినే ఆహార పదార్థాలపై అవగాహన పెంచుకోవాలి. వాటిని ఆర్డర్ చేయగానే అందించే వ్యవస్థ ఉండాలి. సత్వర డెలివరీ ఆప్షన్స్ అందుబాటులో ఉంచుకోవాలి.
ప్రజలను ఒప్పింపజేయాలి..
మీరు ప్రమోట్ చేస్తున్న ఉత్పత్తిలో ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాలు ఉన్నాయని ప్రజలను ఒప్పించడం సవాలుగా ఉంటుంది. వారు పొందే ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఎక్కువ డబ్బు ఖర్చు చేయడానికి వారు అంగీకరించకపోవచ్చు. ఒకవేళ తక్కువ ధర ఉన్నా కొనుగోలు చేయడానికి ఇష్టపడకపోవచ్చు. అటువంటి వారిని ఒప్పించేందుకు అవసరమైన మార్కెటింగ్‌స్కిల్స్ ఉన్న వారిని సిబ్బందిగా నియమించుకోవాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..