2023 Honda SP 125: హోండా నుంచి మరో కొత్త బైక్‌.. ధర కేవలం రూ.85,121 మాత్రమే.. పూర్తి వివరాలు తెలుసుకోండి..

హోండా 2023 ఎస్పీ 125 పేరుతో సరికొత్త బైక్‌ ని విడుదల చేసింది. బీఎస్ 6 ప్రమాణాలతో రూపొందించిన ఈ బైక్ రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

2023 Honda SP 125: హోండా నుంచి మరో కొత్త బైక్‌.. ధర కేవలం రూ.85,121 మాత్రమే.. పూర్తి వివరాలు తెలుసుకోండి..
Honda Sp125
Follow us
Madhu

|

Updated on: Apr 05, 2023 | 3:00 PM

మన దేశంలో టూ వీలర్‌ కంపెనీల్లో హోండాకు మంచి పేరుంది. ఆ కంపెనీకి చెందిన ద్విచక్ర వాహనాలపై ప్రజల్లో డిమాండ్‌ ఉంది. ముఖ్యంగా హోండా యాక్టివా, షైన్‌, యూనికార్న్‌ వంటి మోడళ్లు ప్రజాదరణ పొందాయి. దీంతో హోండా వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా తన ఉత్పత్తులను అప్‌ గ్రేడ్‌ చేస్తోంది. అందులో భాగంగా ఓ కొత్త బైక్‌ ను లాంచ్‌ చేసింది. హోండా 2023 ఎస్పీ 125 పేరుతో సరికొత్త బైక్‌ ని విడుదల చేసింది. బీఎస్ 6 ప్రమాణాలతో రూపొందించిన ఈ బైక్ రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

డిజైన్‌, లుక్‌.. డిజైన్ పరంగా 2023 హోండా SP 125 ఆకట్టుకుంటోంది. అగ్రెసివ్ ట్యాంక్ డిజైన్, ఆకర్షణీయమైన అల్లాయ్ వీల్స్, ఎల్‌ఈడీ డీసీ హెడ్ ల్యాంప్ కారణంగా స్పోర్టీ లుక్‌లో కనిపిస్తోంది.

ఫీచర్లు.. ఇంజిన్ స్టార్ట్/స్టాప్ స్విచ్, 5 స్పీడ్ గేర్ బాక్స్, రియర్ సస్పెన్షన్, కాంబీ బ్రేక్ సిస్టం(సీబీఎస్) డిజైన్‌, వెనుక నుంచి బోల్డ్ లుక్‌లో కనిపించే టెయిల్ ల్యాంప్ బైక్‌కు హైలైట్‌గా నిలుస్తున్నాయి. రైడర్‌కి ఇన్‌ఫర్మేషన్ ఇచ్చే డిజిటల్ మీటర్‌ ఆకట్టుకుంటోంది. ఫ్యూయల్ ఎఫీషియన్సీ, గేర్ పొజిషన్ ఇండికేటర్, సర్వీస్ డ్యూ ఇండికేటర్, ఈసీవో ఇండికేటర్‌లను డిజిటల్ మీటర్ రైడర్‌కి చూపిస్తుంది.

ఇవి కూడా చదవండి

ధర ఎంతంటే.. హోండా 2023 ఎస్పీ 125 బైక్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. డ్రమ్, డిస్క్ బైక్‌లను కస్టమర్లు కొనుగోలు చేయవచ్చు. ఢిల్లీ ఎక్స్ షోరూం ధర ప్రకారం డ్రమ్ వేరియంట్ రూ.85,121 వస్తుండగా, డిస్క్ వేరియంట్ రూ.89,131కి అందుబాటులో ఉంది.

కలర్‌ ఆప్షన్స్‌.. ఈ కొత్త బైక్‌ మొత్తంగా ఐదు రంగుల్లో లభిస్తోంది. బ్లాక్, మ్యాటె యాక్సిక్ గ్రే మెటాలిక్, ఇంపీరియల్ రెడ్ మెటాలిక్, పియర్ల్ సిరెన్ బ్లూ, న్యూమ్యాట్ మార్వెల్ బ్లూ మెటాలిక్ కలర్స్‌లలో ఈ బైక్ అందుబాటులో ఉంది.

సామర్థ్యం.. 2023 హోండా SP 125లో 125 సీసీ PGM-FI ఇంజన్ అందించారు. ఇది గరిష్టంగా 10.7 హార్స్ పవర్‌, 10.9 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఈ ఇంజన్ 5 – స్పీడ్ గేర్‌బాక్స్‌తో పెయిర్ అయింది.

బెస్ట్ చాయిస్ అవుతుంది..

కస్టమర్ల అంచనాలకు అనుగుణంగా OBD2 కాంప్లియంట్ హోండా 2023 SP 125 బైక్‌ని లాంచ్ చేసినట్లు హోండా మోటార్‌సైకిల్, స్కూటర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అత్సుతి ఒగాటా వెల్లడించారు. స్పోర్టీ, స్టైలిష్‌గా ఉండటంతో పాటు అందుబాటు ధరలోనే బైక్ కస్టమర్లను చేరుకుంటోందని ఒగాటా తెలిపారు. మోటార్ సైకిల్ ఔత్సాహికులను తప్పకుండా సంతృప్తి పరుస్తుందని ఒగాటా ధీమా వ్యక్తం చేశారు. అలాగే హోండా మోటార్‌సైకిల్, స్కూటర్ ఇండియా సేల్స్, మార్కెటింగ్ ఆపరేటింగ్ ఆఫీసర్ యోగేష్ మాథుర్ మాట్లాడుతూ ఈ కొత్త ఎస్పీ 125 కస్టమర్‌లకు బెస్ట్ చాయిస్ గా నిలుస్తుందని అన్నారు. పనితీరు, సౌకర్యం కోసం కొత్త ప్రమాణాలను సెట్ చేస్తుందని తాము విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..