AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NPS Tax Benefits: పాత, కొత్త ట్యాక్స్ రెజీమ్‌లతో గందరగోళం! ఎన్‌పీఎస్ పన్ను ప్రయోజనాలు ఎలా ఉంటాయంటే..

భారతదేశంలోని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) నియంత్రణలో ఉండే స్వచ్ఛంద, దీర్ఘకాలిక పదవీ విరమణ పొదుపు పథకం. దీనిలో పెట్టుబడులు పెట్టే వారు పదవీ విరమణ తర్వాత ఒకేసారి ఆదాయాన్ని పొందడంతో పాటు నెలవారీ పింఛన్ లాగా కూడా తీసుకోవచ్చు. దీనిలో ప్రధానమైన ప్రయోజనం ఏమిటంటే పన్ను ప్రయోజనం. ఈ పన్ను ప్రయోజనాలను పొందుతూనే పదవీ విరమణ కోసం ఆదా చేయడానికి ఎన్పీఎస్ ఒక గొప్ప మార్గం.

NPS Tax Benefits: పాత, కొత్త ట్యాక్స్ రెజీమ్‌లతో గందరగోళం! ఎన్‌పీఎస్ పన్ను ప్రయోజనాలు ఎలా ఉంటాయంటే..
Nps
Madhu
|

Updated on: Feb 17, 2024 | 8:53 AM

Share

ఆదాయ పన్ను చెల్లించే వ్యక్తులు ఆ పన్ను మినహాయింపు పొందే అవకాశం ఆదాయ పన్ను చట్టం అందించింది. అందుకోసం కొన్ని పథకాలు కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అటువంటి పథకాలలో నేషనల్ పెన్షన్ సిస్టమ్(ఎన్పీఎస్) ఒకటి. ఇది భారతదేశంలోని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) నియంత్రణలో ఉండే స్వచ్ఛంద, దీర్ఘకాలిక పదవీ విరమణ పొదుపు పథకం. దీనిలో పెట్టుబడులు పెట్టే వారు పదవీ విరమణ తర్వాత ఒకేసారి ఆదాయాన్ని పొందడంతో పాటు నెలవారీ పింఛన్ లాగా కూడా తీసుకోవచ్చు. దీనిలో ప్రధానమైన ప్రయోజనం ఏమిటంటే పన్ను ప్రయోజనం. ఈ పన్ను ప్రయోజనాలను పొందుతూనే పదవీ విరమణ కోసం ఆదా చేయడానికి ఎన్పీఎస్ ఒక గొప్ప మార్గం. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే ఎన్పీఎస్ అనేది పదవీ విరమణ వరకు లాక్-ఇన్ వ్యవధి ఉండే దీర్ఘకాలిక పెట్టుబడి పథకం అని నిపుణులు చెబుతున్నారు. ఈక్రమంలో కొత్త, పాత ట్యాక్స్ రిజైమ్స్ లో ఈ ఎన్పీఎస్ వల్ల వచ్చే పన్ను ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఎన్పీఎస్ పై పన్ను ప్రయోజనం

ఆర్థిక సంవత్సరం ముగింపు సమీపిస్తున్న కొద్దీ, ఉద్యోగులు తమ పన్ను బాధ్యతలను తగ్గించుకునే వార్షిక పనిలో నిమగ్నమై ఉంటారు. పెట్టుబడుల రుజువు కోసం హెచ్‌ఆర్ డిపార్ట్‌మెంట్ ప్రాంప్ట్ చేయడంతో, చాలా మంది వ్యక్తులు తమ పన్ను భారాన్ని తగ్గించుకునే మార్గాలను అన్వేషించడం ప్రారంభిస్తారు. ఈ క్రమంలో వారికి ఉపయోగపడే సాధనం ఎన్పీఎస్.

పాత రెజీమ్‌లో ప్రయోజనాలు ఇవి..

  • ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 సీసీడీ (1) కింద రూ. 1.5 లక్షల వరకు తగ్గింపు.
  • ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 సీసీడీ (1బీ) కింద రూ. 50,000 ప్రత్యేక తగ్గింపు.
  • కార్పొరేట్ ఎన్పీఎస్ మోడల్‌లోని సబ్‌స్క్రైబర్‌లు ప్రాథమిక జీతంలో 10% వరకు పెట్టుబడిపై ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీసీడీ (2) కింద అదనపు పన్ను ప్రయోజనాలను పొందవచ్చు. ఈ ప్రయోజనం రూ. 7.5 లక్షలకు పరిమితం చేసి ఉంటుంది (పీఎఫ్, సూపర్‌యాన్యుయేషన్ ఫండ్, ఎన్పీఎస్ తో సహా).
  • పాత ఆదాయపు పన్ను విధానంలో ప్రయోజనాలు పొందే వారికి పైన పేర్కొన్న పన్ను సంబంధిత మినహాయింపులన్నీ వర్తిస్తాయి.

కొత్త రెజీమ్‌లో ఎన్పీఎస్ ప్రయోజనాలు..

కొత్త పన్ను విధానం, పన్ను నిర్మాణాన్ని సరళీకృతం చేయడానికి, తగ్గించిన పన్ను రేట్లను అందించిన సందర్భంలో వ్యక్తులు పన్నులపై ఆదా చేయడానికి భిన్నమైన విధానాన్ని అనుసరించాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. వివిధ పన్ను తగ్గింపులు, మినహాయింపులతో మునుపటి వ్యవస్థ వలె కాకుండా, కొత్త పన్ను విధానం తక్కువ పన్ను రేట్లతో వస్తుంది కానీ పరిమిత తగ్గింపులతో వస్తాయని సూచిస్తున్నారు. పైన పేర్కొన్న విధంగానే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీసీడీ (2) కింద దీనిలోనూ మినహాయింపులు ఉంటాయి.

ఇవి కూడా చదవండి

అదే విధంగా ఎన్పీఎస్ అనేది మినహాయింపు-మినహాయింపు-మినహాయింపు (EEE) ఉత్పత్తి. దీనిలో మొదటి మినహాయింపు ఏంటంటే సబ్‌స్క్రైబర్‌లు ముందుగా వివరించిన విధంగా ఎన్పీఎస్ కంట్రిబ్యూషన్‌లపై పన్ను మినహాయింపులను క్లెయిమ్ చేయవచ్చు. రెండో మినహాయింపు ఎలాంటి పన్ను మినహాయింపు లేకుండా కాంట్రిబ్యూష్ తో పాటు మీరు పొందే రాబడిపైనా పన్ను మినహాయింపుఉంటుంది. ఉపసంహరణ (60% వరకు) కూడా పన్ను మినహాయింపు. కార్పస్‌లో 40%తో యాన్యుటీ ఉత్పత్తిని కొనుగోలు చేయడం కూడా పన్ను-మినహాయింపు పొందొచ్చు. యాన్యుటీలో పెట్టుబడి నుంచి పెన్షన్ చెల్లింపులు పొందే సమయంలో సబ్‌స్క్రైబర్ వర్తించే రేటు ప్రకారం పన్ను విధిస్తారు.

ఇవి కూడా ట్రై చేయొచ్చు..

మీ ఆర్థిక పరిస్థితి, ఆదాయ భాగాలు, కొత్త పన్ను విధానంలో తగ్గింపులు మరియు మినహాయింపుల ప్రభావాన్ని జాగ్రత్తగా విశ్లేషించడం చాలా అవసరం. అలాగే, పదవీ విరమణ కోసం పొదుపు చేయడానికి ఎన్పీఎస్ మాత్రమే కాక, పీపీఎఫ్, మ్యూచువల్ ఫండ్స్, యులిప్స్ వంటి ఇతర పెట్టుబడి ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. ఇవి కూడా పన్ను ప్రయోజనాలను అందిస్తాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రేపటితో డెడ్ లైన్ పూర్తి.. ఈ ఒక్క పని చేయకపోతే ఇబ్బందులే..
రేపటితో డెడ్ లైన్ పూర్తి.. ఈ ఒక్క పని చేయకపోతే ఇబ్బందులే..
దురంధర్‌‌ రికార్డులపై టాలీవుడ్ స్టార్ కన్ను.. బ్రేక్ చేసేస్తాడా?
దురంధర్‌‌ రికార్డులపై టాలీవుడ్ స్టార్ కన్ను.. బ్రేక్ చేసేస్తాడా?
Horoscope Today: వారి ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి..
Horoscope Today: వారి ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి..
తెలంగాణలో మరో ఎన్నికల జాతర.. ఫిబ్రవరిలో షెడ్యూల్..!
తెలంగాణలో మరో ఎన్నికల జాతర.. ఫిబ్రవరిలో షెడ్యూల్..!
ఒకేసారి రూ.3 వేలు తగ్గిన బంగారం ధరలు.. ఇదే మంచి అవకాశం
ఒకేసారి రూ.3 వేలు తగ్గిన బంగారం ధరలు.. ఇదే మంచి అవకాశం
బ్లూ లైట్ గ్లాసెస్ వాడుతున్నారా? ఇది కచ్చితంగా తెలుసుకోండి..
బ్లూ లైట్ గ్లాసెస్ వాడుతున్నారా? ఇది కచ్చితంగా తెలుసుకోండి..
మేడారం కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. ఎక్కడినుంచి ఎక్కడికంటే..
మేడారం కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. ఎక్కడినుంచి ఎక్కడికంటే..
పిల్లల్లో ఫిట్స్ వ్యాధికి ఆ కూరగాయలే కారణమా?
పిల్లల్లో ఫిట్స్ వ్యాధికి ఆ కూరగాయలే కారణమా?
ట్రిప్‌కు వెళ్లి అనుకోని చిక్కుల్లో.. OTTలో మిస్టరీ థ్రిల్లర్
ట్రిప్‌కు వెళ్లి అనుకోని చిక్కుల్లో.. OTTలో మిస్టరీ థ్రిల్లర్
వందే భారత్ స్లీపర్ రైళ్లపై బిగ్ అప్డేట్.. ప్రారంభం ఎప్పుడంటే..?
వందే భారత్ స్లీపర్ రైళ్లపై బిగ్ అప్డేట్.. ప్రారంభం ఎప్పుడంటే..?