AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Income Tax: రూ.10 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్నా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.. ఎలాగంటే..

పన్ను శ్లాబ్ ప్రకారం అధిక ఆదాయంపై ప్రజలు పన్ను చెల్లించాలి. పాత పన్ను విధానంలో రూ. 2.5 లక్షల వరకు వార్షిక ఆదాయంపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని ఆదాయపు పన్ను నిబంధన చెబుతోంది. 2.5-5 లక్షల ఆదాయంపై 5% పన్ను నిబంధన ఉంది. 5-10 లక్షల వార్షిక ఆదాయంపై 20% పన్ను వసూలు చేస్తారు. 10 లక్షలు, అంతకంటే ఎక్కువ వార్షిక ఆదాయంపై 30% పన్ను స్లాబ్ ఉంది.

Income Tax: రూ.10 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్నా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.. ఎలాగంటే..
Income Tax
Subhash Goud
|

Updated on: Feb 17, 2024 | 8:34 AM

Share

పన్ను ఆదా సీజన్ వచ్చేసింది. ఎక్కువ సంపాదించే వ్యక్తులు పన్ను ఆదా కోసం కష్టపడటం ప్రారంభిస్తుండటారు. కొత్త పన్ను విధానంలో రూ.7 లక్షల వరకు ఆదాయంపై పన్ను మినహాయింపును కేంద్ర ప్రభుత్వం కల్పించగా, పాత పన్ను విధానంలో రూ.5 లక్షల వరకు వార్షిక ఆదాయానికి మినహాయింపు ఇచ్చారు. అయితే మీ వార్షిక ఆదాయం ఈ రెండు పరిమితుల కంటే ఎక్కువగా ఉంటే మీరు పన్ను చెల్లించాల్సి రావచ్చు.

పన్ను శ్లాబ్ ప్రకారం అధిక ఆదాయంపై ప్రజలు పన్ను చెల్లించాలి. పాత పన్ను విధానంలో రూ. 2.5 లక్షల వరకు వార్షిక ఆదాయంపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని ఆదాయపు పన్ను నిబంధన చెబుతోంది. 2.5-5 లక్షల ఆదాయంపై 5% పన్ను నిబంధన ఉంది. 5-10 లక్షల వార్షిక ఆదాయంపై 20% పన్ను వసూలు చేస్తారు. 10 లక్షలు, అంతకంటే ఎక్కువ వార్షిక ఆదాయంపై 30% పన్ను స్లాబ్ ఉంది.

రూ.10.50 లక్షల ఆదాయంపైనా పన్ను ఆదా

ఇవి కూడా చదవండి

నివేదికల ప్రకారం మీ వార్షిక ఆదాయం రూ.10 లక్షలు అయితే మీరు 30% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే, మీరు అనుకుంటే ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది మాత్రమే కాదు.. మీ జీతం రూ.10.50 లక్షలు అయినప్పటికీ, మీరు పెట్టుబడి పెట్టడం ద్వారా, మినహాయింపుల ప్రయోజనాన్ని పొందడం ద్వారా పన్ను మొత్తాన్ని ఆదా చేసుకోవచ్చు.

10.50 లక్షల ఆదాయంపై పన్నును ఎలా ఆదా చేయవచ్చు?

1. స్టాండర్డ్ డిడక్షన్‌గా రూ.50 వేల వరకు రాయితీ లభిస్తుంది. అటువంటి పరిస్థితిలో ఇప్పుడు రూ. 10 లక్షలపై పన్ను విధించబడుతుంది.

2. PPF, EPF, ELSS, NSC వంటి పథకాలలో పెట్టుబడి పెట్టడం ద్వారా, మీరు ఆదాయపు పన్ను సెక్షన్ 80C కింద రూ. 1.5 లక్షల పన్నును ఆదా చేయవచ్చు. ఇప్పుడు రూ.10 లక్షల నుంచి రూ.1.5 లక్షలు తీసివేస్తే రూ.8.5 లక్షలు పన్ను పరిధిలోకి వస్తాయి.

3. అదేవిధంగా మీరు నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS)లో ప్రత్యేకంగా సంవత్సరానికి రూ. 50,000 వరకు పెట్టుబడి పెడితే సెక్షన్ 80CCD (1B) కింద అదనంగా రూ. 50 వేల ఆదాయపు పన్ను ఆదా చేయడంలో మీకు సహాయం ఉంటుంది. ఇప్పుడు రూ.50 వేలు ఎక్కువ తీసివేస్తే రూ.8 లక్షలు పన్ను పరిధిలోకి వస్తాయి.

4. గృహ రుణం కూడా తీసుకున్నట్లయితే, ఆదాయపు పన్ను సెక్షన్ 24B కింద దాని వడ్డీపై రూ. 2 లక్షల వరకు పన్ను ఆదా చేయవచ్చు. రూ.8 లక్షల నుంచి మరో రూ.2 లక్షలు తీసివేస్తే మొత్తం పన్ను ఆదాయం రూ.6 లక్షలు అవుతుంది.

5. ఆదాయపు పన్ను సెక్షన్ 80డి కింద మెడికల్ పాలసీ తీసుకోవడం ద్వారా రూ.25 వేల వరకు పన్ను ఆదా చేసుకోవచ్చు. ఈ ఆరోగ్య బీమాలో మీ పేరు, మీ భార్య, పిల్లల పేర్లు ఉండాలి. ఇది కాకుండా, మీరు మీ తల్లిదండ్రుల పేరు మీద ఆరోగ్య బీమాను కొనుగోలు చేస్తే మీరు రూ. 50,000 వరకు అదనపు తగ్గింపును పొందవచ్చు. ఇలాంటప్పుడు రూ.6 లక్షల నుంచి 75 వేలు తీసివేస్తే మొత్తం పన్ను బాధ్యత రూ.5.25 లక్షలు అవుతుంది.

6. మీరు ఏదైనా సంస్థకు విరాళం ఇస్తే, మీరు రూ. 25,000 వరకు పన్ను ప్రయోజనాన్ని పొందవచ్చు. ఆదాయపు పన్ను సెక్షన్ 80G కింద, మీరు విరాళంగా ఇచ్చిన మొత్తంపై రూ. 25,000 వరకు పన్ను మినహాయింపును పొందవచ్చు. రూ.25 వేలు తీసివేసిన తర్వాత, మీ ఆదాయం ఇప్పుడు రూ.5 లక్షల పన్ను శ్లాబ్‌లోకి వస్తుంది. ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం, రూ. 5 లక్షల వరకు ఆదాయంపై పాత పన్ను విధానంలో ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి