- Telugu News Photo Gallery Business photos Mxmoto M16 Electric Cruiser Bike Launched In India Know Price And Battery Range
EV Bike: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 220 కి.మీ రయ్.. రయ్.. 8 ఏళ్లు వారంటీ! ధర ఎంతో తెలిస్తే..
భారత మార్కెట్లో కొత్త కొత్త బైక్‌లు విడుదల అవుతున్నాయి. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు భారీగానే ఉండటంతో ఆయా వాహనాల తయారీ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల తయారీ వైపు అడుగులు వేస్తున్నాయి. మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలు వస్తుండటంతో వాహనదారులు కూడా వాటి వైపు మొగ్గు చూపుతున్నారు. భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్‌తో పాటు కొత్త మోడల్‌ల సంఖ్య కూడా నిరంతరం పెరుగుతోంది. ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల..
Updated on: Feb 16, 2024 | 11:42 AM

భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్‌తో పాటు కొత్త మోడల్‌ల సంఖ్య కూడా నిరంతరం పెరుగుతోంది. ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ mXmoto ఇప్పుడు తన కొత్త క్రూయిజర్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ mXmoto M16ని విడుదల చేసింది.

ఆకర్షణీయమైన లుక్స్, శక్తివంతమైన బ్యాటరీ ప్యాక్‌తో కూడిన ఈ బైక్ ప్రారంభ ధర రూ.1,98,000 (ఎక్స్-షోరూమ్). ఈ బైక్‌తో కంపెనీ 8 సంవత్సరాలు లేదా 80,000 కిలోమీటర్ల వరకు వారంటీని కూడా అందిస్తోంది కంపెనీ.

ఈ ఎలక్ట్రిక్ బైక్‌లో ఎల్‌ఈడీ లైటింగ్, సింగిల్ పీస్ సీటుతో రౌండ్ షేప్ హెడ్‌ల్యాంప్ ఉంది. M-ఆకారపు హ్యాండిల్‌బార్, సౌకర్యవంతమైన రైడింగ్ స్థానం ఈ బైక్‌ను మెరుగైన క్రూయిజర్‌గా మార్చడంలో సహాయపడతాయి.

ఈ ఎలక్ట్రిక్ బైక్‌లో 4,000 వాట్ల BLDC హబ్ మోటార్ ఉంది. ఇది 140 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 80 AMP హై ఎఫిషియెన్సీ కంట్రోలర్‌ను కూడా కలిగి ఉంది. ఇది రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్‌తో పవర్ అవుట్‌పుట్‌ను 16% పెంచుతుంది.

ఈ బైక్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 160-220 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్‌ను అందిస్తుందని, దీని బ్యాటరీ ఫుల్ ఛార్జింగ్‌పై 1.6 యూనిట్ల విద్యుత్‌ను మాత్రమే వినియోగిస్తుందని కంపెనీ పేర్కొంది. దీని బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి కేవలం 3 గంటలు పడుతుంది.

కంపెనీ mXmoto M16లో స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ సౌకర్యాన్ని కూడా అందించింది. ఇది కాకుండా, క్రూయిజ్ కంట్రోల్, రివర్స్ అసిస్ట్, యాంటీ-స్కిడ్ అసిస్ట్, పార్కింగ్ అసిస్ట్, ఆన్-బోర్డ్ నావిగేషన్, ఆన్-రైడ్ కాలింగ్, బ్లూటూత్ కనెక్టివిటీ, సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.




