Car Offers: మారుతీ సుజుకీ కార్లపై బంపర్ ఆఫర్.. ఏకంగా రూ. 62,000 వరకూ భారీ డిస్కౌంట్లు.. త్వరపడండి..
మీరు కారు కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? ఏమైనా మంచి ఆఫర్లు ఉంటే బాగుండని భావిస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. మన దేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే మారుతీ సుజుకీ కార్లపై అదిరే ఆఫర్లు ఉన్నాయి. 2024 ఫిబ్రవరి నెలాఖరు వరకూ ఆఫర్లు అందుబాటులో ఉండనున్నాయి. మారుతీ సుజుకీలోని దాదాపు అన్ని మోడళ్లపై ఈ ఆఫర్లు ఉన్నాయి. ముఖ్యంగా అల్టో కే10 కారుపై గరిష్టంగా రూ. 62,000 వరకు.. వ్యాగన్ ఆర్, ఎస్-ప్రెస్సో, సెలెరియోపై రూ. 61,000 వరకు, డిజైర్ పై రూ. 37,000 వరకు తగ్గింపులతో పాటు మరిన్ని ప్రయోజనాలు కూడా ఉంటాయి. అయితే మారుతీ సుజుకీ ఎర్టిగా, బ్రెజ్జా కార్లపై ఎటువంటి ఆఫర్లు లేవు.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
