- Telugu News Photo Gallery Business photos Under Rs 1 Lakh Range, From ola S1x to Electric Luna, check details
ఈ స్కూటర్లు ఐఫోన్ కంటే వెరీ చీప్.. ఒక్క ఛార్జ్‌తో 95 కిమీ జర్నీ.! ఓసారి లుక్కేయండి..
పెట్రోల్ వాహనాలపై మోజు తగ్గింది.. ఇప్పుడు అందరూ ఎలక్ట్రిక్ వాహనాలపైనే దృష్టి సారించారు. డానికి కారణం లేకపోలేదు. వారం.. వారం.. పెట్రోల్‌కి బడ్జెట్ పక్కనపెట్టాల్సిన పన్లేదు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు.. పెట్రోల్ బండి వచ్చే దూరం కంటే.. ఎక్కువే ప్రయాణించవచ్చు.
Updated on: Feb 15, 2024 | 1:22 PM

పెట్రోల్ వాహనాలపై మోజు తగ్గింది.. ఇప్పుడు అందరూ ఎలక్ట్రిక్ వాహనాలపైనే దృష్టి సారించారు. డానికి కారణం లేకపోలేదు. వారం.. వారం.. పెట్రోల్‌కి బడ్జెట్ పక్కనపెట్టాల్సిన పన్లేదు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు.. పెట్రోల్ బండి వచ్చే దూరం కంటే.. ఎక్కువే ప్రయాణించవచ్చు. అందుకేనేమో.. ఈ మధ్యకాలంలో మార్కెట్‌లోకి వివిధ సంస్థలకు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్లు క్యూ కట్టాయి. ఓలా, ఒకినావా, కైనెటిక్ గ్రీన్, ఏసర్ కంపెనీల నుంచి తక్కువ బడ్జెట్‌లో అద్భుతమైన ఫీచర్లు ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులోకి వచ్చాయి. ఇక వీటితో పాటు ఇటీవల లూనా సంస్థ కూడా తమ ఎలక్ట్రిక్ అవతార్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ల ధర ఎంత.? ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. ఎంత దూరాన్ని కవర్ చేస్తాయి.? లాంటివి ఇప్పుడు చూసేద్దాం..

ఓలా S1X.. 1 లక్ష కంటే తక్కువ ధరకే, మీరు ఈ Ola ఎలక్ట్రిక్ స్కూటర్‌ని పొందొచ్చు. ఈ స్కూటర్‌లోకి రెండు బ్యాటరీల ఎంపిక దొరుకుతుంది. అది 2 kWh లేదా 3 kWh. 2 kWh బ్యాటరీ మోడల్‌ను పూర్తి ఛార్జ్ చేస్తే.. 95 కిలోమీటర్ల వరకు జర్నీ చేయవచ్చు. అదే 3kWh మోడల్ 143 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఈ స్కూటర్ ధర రూ.79,999 నుంచి ప్రారంభమవుతోంది.

ఒకినావా ప్రైజ్ ప్రో.. ఒకినావా కంపెనీకి చెందిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 81 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. 56kmph గరిష్ట వేగంతో ఈ స్కూటర్ ధర రూ. 99,645(ఎక్స్-షోరూమ్).

ఎలక్ట్రిక్ లూనా.. కైనెటిక్ గ్రీన్ సంస్థ తమ లూనా ఎలక్ట్రిక్ అవతార్‌ను భారతీయ మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ వాహనం ధర రూ. 69,990. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే, ఈ మోపెడ్ బ్యాటరీ 110 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించగలదు.

కైనెటిక్ జింగ్.. లూనా ఎలక్ట్రిక్ అవతార్‌ను ఉత్పత్తి చేసిన కైనెటిక్ గ్రీన్ కంపెనీ.. ఈ E-బైక్‌ను తక్కువ ధరలో అందుబాటులో ఉంచింది. రూ.71,990 ధర కలిగిన ఈ ఈ-బైక్ ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే 70 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది.

Acer MUVI 125 4G ఏసర్ కంపెనీ కూడా ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలోకి ప్రవేశించింది. గరిష్టంగా 75 kmph వేగంతో వచ్చే ఈ స్కూటర్ ధర రూ.99,999. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 80 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు.




