UPI: యూపీఐ చెల్లింపు వ్యవస్థను ఎన్ని దేశాలు ఉపయోగిస్తున్నాయో తెలుసా..?
యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) సేవల వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. భారత్‌లో ప్రజాదరణ పొందిన సర్వీస్. ఇప్పుడు భారత్‌లోనే కాకుండా విదేశాలకు కూడా విస్తరిస్తోంది. భారతీయులు విదేశాల్లో ప్రయాణిస్తున్నట్లయితే అక్కడ కూడా యూపీఐ సేవలు సులభంగా వినియోగించుకోవచ్చు. భారత్ క్రమ క్రమంగా ఈ యూపీఐ సేవలను ఇతర దేశాలకు మరింతగా విస్తరించే విధంగా చర్యలు చేపడుతోంది. ఇప్పటికే చాలా దేశాలలో మన యూపీఐ సేవలు వినియోగిస్తుండగా,ఇటీవల మరో రెండు నగరాల్లో ప్రారంభం అయ్యాయి.
Updated on: Feb 15, 2024 | 10:52 AM

యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) సేవల వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. ఇప్పుడు ఈ జాబితాలోకి శ్రీలంక, మారిషస్ పేర్లు కూడా చేరాయి. ఈ రెండు దేశాల్లో యూపీఐతో పాటు రూపే కార్డ్ సేవలు కూడా ప్రారంభం అయ్యాయి.

ఫిన్‌టెక్ ఇన్నోవేషన్, డిజిటల్ సర్వీసెస్ నెట్‌వర్క్‌లను బలోపేతం చేయడం ద్వారా భారతదేశం మరింత ముందుకెళ్తోందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. భారతదేశ అభివృద్ధి అనుభవాలు, ఆవిష్కరణలను భాగస్వామ్య దేశాలతో పంచుకోవడంపై ప్రధాని మోదీ ఉద్ఘాటించారు.

భారతదేశం కాకుండా మీరు భూటాన్, మలేషియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సింగపూర్, ఒమన్, ఖతార్, రష్యా, ఫ్రాన్స్, శ్రీలంక, మారిషస్‌లలో యూపీఐని ఉపయోగించవచ్చు. యూపీఐ త్వరలో నేపాల్‌లో కూడా ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి.

UPI

ఇది కాకుండా, చాలా యూరోపియన్ దేశాలు కూడా త్వరలో ఈ సదుపాయాన్ని ప్రారంభించవచ్చు. థాయిలాండ్, సౌదీ అరేబియా, ఆస్ట్రేలియా, USA, బహ్రెయిన్, జపాన్, ఫిలిప్పీన్స్ వంటి దేశాల్లో కూడా UPI త్వరలో ప్రారంభించవచ్చు.




