Personal Loan: అత్యంత చౌకగా పర్సనల్ లోన్‌ అందిస్తోన్న 5 బ్యాంకులు.. ఇంట్రెస్ట్ రేట్‌ ఎంతంటే..

ఎలాంటి పూచికత్తు లేకుండా పొందే రుణం పర్సనల్ లోన్‌. మంచి సిబిల్‌ స్కోర్‌ ఉంటే చాలు క్షణాల్లో డబ్బులు ఖాతాల్లో జమ అవుతాయి. అందుకే చాలా మంది పర్సనల్ లోన్‌కు మొగ్గు చూపుతారు. మరే ఇతర లోన్‌ కావాలన్నా భూమి, బంగారం అవసరపడుతుంది. కానీ పర్సనల్‌ లోన్‌కి ఇవేవి అవసరం లేకుండానే పొందొచ్చు...

Personal Loan: అత్యంత చౌకగా పర్సనల్ లోన్‌ అందిస్తోన్న 5 బ్యాంకులు.. ఇంట్రెస్ట్ రేట్‌ ఎంతంటే..
Personal Loan
Follow us

|

Updated on: Nov 26, 2022 | 5:19 PM

ఎలాంటి పూచికత్తు లేకుండా పొందే రుణం పర్సనల్ లోన్‌. మంచి సిబిల్‌ స్కోర్‌ ఉంటే చాలు క్షణాల్లో డబ్బులు ఖాతాల్లో జమ అవుతాయి. అందుకే చాలా మంది పర్సనల్ లోన్‌కు మొగ్గు చూపుతారు. మరే ఇతర లోన్‌ కావాలన్నా భూమి, బంగారం అవసరపడుతుంది. కానీ పర్సనల్‌ లోన్‌కి ఇవేవి అవసరం లేకుండానే పొందొచ్చు. అందుకే పర్సనల్‌ లోన్‌కు వడ్డీని ఎక్కువగా వసూలు చేస్తుంటారు. మరీముఖ్యంగా ఆర్‌బీఐ ఇటీవల రెపో రేటు పెంచినత తర్వాత వడ్డీ రేట్లు మరింత పెరిగాయి. అయితే ఇలాంటి సమయంలో తక్కువ వడ్డీ రేటుకే వ్యక్తిగత రుణాలను అందిస్తోన్న కొన్ని బెస్ట్‌ బ్యాంకులు, వడ్డీ రేట్ల వివరాలపై ఓ లుక్కేయండి..

* బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర రూ. 20 లక్షల వరకు వ్యక్తిగత రుణాలపై 84 నెలల కాలవ్యవధికి 8.90 శాతానికి పైగా వడ్డీని వసూలు చేస్తుంది.

* బ్యాంక్ ఆఫ్ ఇండియా 84 నెలల కాలవ్యవధికి గాను రూ. 20 లక్షల వరకు రుణం ఇస్తోంది, దానిపై వడ్డీ 9.75 శాతం నుంచి 14.25 శాతంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

* పంజాబ్ నేషనల్ బ్యాంక్ 60 నెలల కాలవ్యవధికి గాను రూ. 10 లక్షల వరకు రుణాన్ని ఇస్తోంది, దానిపై వడ్డీ 9.80 శాతం నుంచి 16.35 శాతం వరకు వసూలు చేస్తున్నారు.

* కరూర్ వైశ్యా బ్యాంక్ 12 నుంచి 60 నెలల వరకు 10 లక్షల రుణానికి 9.85 శాతం నుంచి 12.85 శాతం వరకు వడ్డీని వసూలు చేస్తుంది.

* ఐడీబీఐ బ్యాంక్‌ రూ. 25,000 నుంచి రూ. 5 లక్షల వరకు రుణాలపై 12 నుంచి 60 నెలల వరకు 9.90 నుంచి 15.50 శాతం వరకు వడ్డీని వసూలు చేస్తుంది.

ఇదిలా ఉంటే పర్సనల్‌ లోన్‌ ఇచ్చేందుకు బ్యాంకులు ప్రాసెసింగ్‌ ఫీజును వసూలు చేస్తాయి. ఇది మనం తీసుకునే రుణంపై ఆధారపడి ఉంటుంది. SBI బ్యాంక్ రుణ మొత్తంలో 0.50 నుంచి 1 శాతం వరకు ప్రాసెసింగ్ ఫీజుని వసూలు చేస్తుంది. పీఎన్‌బీ బ్యాంక్‌ 1 శాతం వరకు వసూలు చేస్తుంది. అలాగే ఈఎమ్‌ఐ చెల్లించడంలో విఫలమైతే పెనాల్టినీ కూడా చెల్లించాల్సి ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..