Pradhan Mantri Fasal Bima Yojana: రైతులకు శుభవార్త.. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన స్కీమ్‌లో కీలక మార్పులు

ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన అనేది రైతుల ప్రయోజనం కోసం కేంద్ర ప్రభుత్వంచే అమలు చేయబడిన పథకం. ఈ పథకం కింద ప్రభుత్వం రైతుల పంటలకు బీమా సౌకర్యం (పీఎంఎఫ్‌బీవై) అందిస్తుంది..

Pradhan Mantri Fasal Bima Yojana: రైతులకు శుభవార్త.. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన స్కీమ్‌లో కీలక మార్పులు
Pradhan Mantri Fasal Bima Yojana
Follow us
Subhash Goud

|

Updated on: Nov 26, 2022 | 4:23 PM

ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన అనేది రైతుల ప్రయోజనం కోసం కేంద్ర ప్రభుత్వంచే అమలు చేయబడిన పథకం. ఈ పథకం కింద ప్రభుత్వం రైతుల పంటలకు బీమా సౌకర్యం (పీఎంఎఫ్‌బీవై) అందిస్తుంది. వాతావరణం, ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నాశనమైతే మోడీ ప్రభుత్వం రైతులకు పరిహారం అందజేస్తుంది. ఇది కష్టాల్లో ఉన్న రైతులకు అతిపెద్ద ఆర్థిక సహాయం అందజేస్తుంది. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఈ పథకంలో పెద్ద మార్పులు చేయాలని యోచిస్తోంది. ఈ ఏడాది దేశంలోని ఒరిస్సా, మహారాష్ట్ర, హర్యానా, పంజాబ్ వంటి పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. అదే సమయంలో ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ వంటి దేశంలోని కొన్ని ప్రాంతాల్లో చాలా వర్షాలు కురిశాయి. దీంతో రైతుల పంటలైన వరి తదితర పంటలు చాలా నష్టపోయాయి.

వాతావరణ సంక్షోభం కారణంగా వాతావరణ మార్పుల కారణంగా ప్రభుత్వం ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనలో రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కొన్ని పెద్ద మార్పులు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో దేశంలోని మరింత మంది రైతులకు కష్టకాలంలో ప్రభుత్వం సహాయం చేస్తుంది. ఈ విషయంపై వ్యవసాయ కార్యదర్శి మనోజ్ అహుజా మాట్లాడుతూ.. వాతావరణ సంక్షోభం, సాంకేతికతకు అనుగుణంగా ప్రభుత్వం ఈ మార్పు చేస్తుందని చెప్పారు. పంట నష్టపోయిన ప్రతి ఒక్క రైతుకు ఈ సదుపాయం అందించే విధంగా కేంద్రం మరిన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

మారుతున్న వాతావరణం కారణంగా ప్రస్తుతం పంటల బీమా పథకానికి డిమాండ్ పెరగవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అటువంటి పరిస్థితిలో, దేశంలోని ప్రతి వర్గానికి ఈ పథకం ప్రయోజనం లభిస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలపై ఎక్కువ శ్రద్ధ చూపుతుంది. పీఎం ఫసల్ బీమా యోజన ప్రయోజనాన్ని పొందాలనుకుంటే మీరు నిర్ణీత ప్రీమియం చెల్లించాలి. ఈ ప్రీమియం చాలా తక్కువ. ఖరీఫ్ పంట కోసం, మీరు బీమా మొత్తంలో 2% వరకు ప్రీమియం చెల్లించాలి. మరోవైపు రబీ పంటకు 1.5 శాతం వరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అలాగే వాణిజ్య, ఉద్యాన పంటలకు మొత్తం ప్రీమియంలో గరిష్టంగా 5 శాతం చెల్లించాలి.

ఇవి కూడా చదవండి

ఈ స్కీమ్ కింద ఎలా రిజిస్ట్రర్ చేసుకోవాలి?

ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన స్కీమ్ కింద రిజిస్టర్ చేసుకోవడం చాలా సులభం. రైతులు ఈ స్కీమ్ ప్రయోజనాలను సులభంగానే పొందవచ్చు. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా ఈ స్కీమ్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చు. దగ్గరిలోని బ్యాంక్ బ్రాంచ్‌ కోఆపరేటివ్ బ్యాంక్, పబ్లిక్ సర్వీస్ సెంటర్, లేదంటే ఆథరైజ్డ్ ఇన్సూరెన్స్ కంపెనీ వద్దకు వెళ్లి రిజిస్టర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఆన్‌లైన్‌లో కూడా పంట బీమా కోసం నమోదు చేసుకోవచ్చు. దీని కోసం పీఎంఎఫ్‌బీవై వెబ్‌సైట్‌లోక వెళ్లాలి. అలాగే క్లెయిమ్ కూడా ఆన్‌లైన్‌లోనే చేసుకోవచ్చు. క్లెయిమ్ స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇంకా ఏమైనా ఫిర్యాదులు ఉన్న వెబ్‌సైట్లో చేయవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి