SIM Cards: మీ ఆధార్‌ కార్డుపై ఇతరులు సిమ్‌ కార్డు తీసుకున్నారని అనుమానం ఉందా? ఇలా చెక్ చేసి బ్లాక్‌ చేయించుకోండి

ప్రస్తుతం ఆధార్‌ లేనిది ఏ పని జరగదు. ప్రభుత్వ, ప్రైవేటు, ఇతర చిన్నపాటి పనులకు కూడా ఆధార్‌ తప్పనిసరైంది. సిమ్‌ కార్డు తీసుకోవాలన్న ఆధార్‌ తప్పనిసరి కావాల్సిందే. అయితే చాలా..

SIM Cards: మీ ఆధార్‌ కార్డుపై ఇతరులు సిమ్‌ కార్డు తీసుకున్నారని అనుమానం ఉందా? ఇలా చెక్ చేసి బ్లాక్‌ చేయించుకోండి
Sim Card
Follow us

|

Updated on: Nov 26, 2022 | 3:19 PM

ప్రస్తుతం ఆధార్‌ లేనిది ఏ పని జరగదు. ప్రభుత్వ, ప్రైవేటు, ఇతర చిన్నపాటి పనులకు కూడా ఆధార్‌ తప్పనిసరైంది. సిమ్‌ కార్డు తీసుకోవాలన్న ఆధార్‌ తప్పనిసరి కావాల్సిందే. అయితే చాలా మంది సిమ్‌కార్డులను తీసుకుంటారు. నిబంధనల ప్రకారం.. ఒకరి పేరుపై 9 సిమ్‌ కార్డులను తీసుకోవచ్చు. ఈ సిమ్‌కార్డులన్నింటికి కూడా ఆధార్‌ కావాల్సిందే. ఆధార్‌ కార్డు ఆధారంగానే సిమ్‌ కార్డును జారీ చేస్తుంటాయి టెలికాం కంపెనీలు. ఇక ఉచితంగా సిమ్‌కార్డులు, ఉచితంగా బ్యాలెన్స్‌ వస్తుండటంతో చాలా మంది సిమ్‌కార్డులను తీసుకుంటారు. బ్యాలెన్స్‌ అయిపోయిన తర్వాత ఆ సిమ్‌కార్డును పక్కనపెడుతుంటారు. కొందరే సిమ్‌కార్డులను పోగొట్టుకుంటారు. తర్వాత వేరే సిమ్‌ కార్డు తీసుకోవడం, లేదా ఒకటి కంటే ఎక్కువ సిమ్‌ కార్డులను ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరికి 9 సిమ్‌ కార్డులు మాత్రమే ఉండాలని, అంతకంటే ఎక్కువ సిమ్‌ కార్డులు ఉంటే తొలగించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

మరి మీ పేరుపై ఎన్ని సిమ్‌ కార్డులున్నాయి?

ఇక కొందరికైతే వారి పేరుపైన ఎన్ని సిమ్‌ కార్డులు ఉన్నాయనే విషయం కూడా తెలియదు. కానీ ఇప్పుడు టెక్నాలజీ అభివృద్ది చెందిన కారణంగా ఒక వ్యక్తిపై ఎన్ని సిమ్‌ కార్డులు ఉన్నాయో తెలుసుకోవచ్చు. అలాగే ఒక వేళ వాడని సిమ్‌ కార్డులు ఉంటే కూడా వాటిని బ్లాక్‌ చేసుకునే సదుపాయం ఉంది. కొందరు సైబర్‌ నేరగాళ్లు ఇతరుల పేర్లపై సిమ్‌ కార్డులను తీసుకుని మోసాలకు పాల్పడుతుంటారు.

ఆధార్‌తో లింకైన సిమ్‌ కార్డుల దుర్వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని టెలికాం శాఖ ఇటీవల టూల్‌ అనలటిక్స్‌ ఫర్‌ ఫ్రాడ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ కన్జూమర్‌ ప్రొటెక్షన్‌ (TAFCOP)ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆన్‌లైన్‌ టూల్‌, పోర్టల్‌తో యూజర్లు ఆధార్‌ నెంబర్‌తో లింకైన మొబైల్‌ నెంబర్లను అన్నింటిని తెలుసుకునే వెసులుబాటు ఉంది.

కొందరు ఇతరుల ఆధార్‌ కార్డును ఉపయోగించుకుని సిమ్‌కార్డులను తీసుకుంటారు. ఆ విషయం మీకు తెలిసి ఉండదు. ఇలా మీకు తెలియకుండా వేరే వాళ్లు సిమ్‌కార్డులను తీసుకుని నేరాలకు పాల్పడే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో ఈ వెబ్‌సైట్‌ ద్వారా మీ ఆధార్‌ కార్డు పై ఇప్పటి వరకు ఎన్ని సిమ్‌ కార్డులను ఉపయోగించారో తెలుసుకోవచ్చు. ఇక మీకు తెలియకుండా మీ ఆధార్‌ నెంబర్‌తో ఏదైనా ఫోన్‌ నెంబర్‌ లింకైనట్లు తేలినట్లయితే మీరు ఫిర్యాదు చేయవచ్చు. దీని వల్ల మీరు మోసాల బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు. మీరు వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీ ఫోన్‌ నెంబర్‌ను ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ మొబైల్‌ నెంబర్‌కు వచ్చిన ఓటీపీ (OTP)ని ఎంటర్‌ చేస్తే మీ పేరుపై ఉన్న మొబైల్‌ నెంబర్లు కనిపిస్తాయి. వాటిని బ్లాక్‌ చేసుకునే సదుపాయం కూడా ఉంటుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
యువతకు ఆదర్శంగా నిడదవోలు నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థి..
యువతకు ఆదర్శంగా నిడదవోలు నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థి..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..