Elon Musk: గూగుల్, ఆపిల్‌కు మస్క్ మామ వార్నింగ్.. ఓ రేంజ్‌లో ఇచ్చిపడేశాడుగా..

ఆపిల్, గూగుల్ సంస్థలకు పరోక్షంగా సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు ఎలన్ మస్క్. ఇది అట్టాంటి ఇట్టాంటి వార్నింగ్ కాదండోయ్.. ‘తిక్క లెక్కలు చేస్తే నా ఎంట్రీ మామూలుగా ఉండదంటూ ఓ భారీ డైలాగే పేల్చేశాడు’.

Elon Musk: గూగుల్, ఆపిల్‌కు మస్క్ మామ వార్నింగ్.. ఓ రేంజ్‌లో ఇచ్చిపడేశాడుగా..
Elon Musk
Follow us

|

Updated on: Nov 26, 2022 | 1:34 PM

ఆపిల్, గూగుల్ సంస్థలకు పరోక్షంగా సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు ఎలన్ మస్క్. ఇది అట్టాంటి ఇట్టాంటి వార్నింగ్ కాదండోయ్.. ‘తిక్క లెక్కలు చేస్తే నా ఎంట్రీ మామూలుగా ఉండదంటూ ఓ భారీ డైలాగే పేల్చేశాడు’. ఆపిల్, గూగుల్ తమ తమ యాప్ స్టోర్‌ల నుంచి ట్విట్టర్‌నూ బూట్ చేయాలని నిర్ణయించుకుంటే తానే స్మా్ర్ట్‌ఫోన్ రంగంలోకి దిగుతానని స్పష్టం చేశారు. ఇందుకు వెనుకాడే ప్రసక్తే లేదన్నారు. ఇటీవల ట్విట్టర్ విషయంలో పెద్ద రచ్చనే నడుస్తుంది. ఆపిల్, గూగుల్ యాప్ స్టోర్ నుంచి ట్విట్టర్‌ను తొలగించడం వల్ల కలిగే చిక్కుల గురించి చర్చిస్తూ మస్క్ ప్రత్యామ్నాయ ఫోన్‌ను తీసుకువస్తానని ప్రకటించారు. తప్పని పరిస్థితే వస్తే.. ఆపిల్, గూగుల్ ఫోన్లకు ప్రత్యామ్నాయంగా సరికొత్త స్మార్ట్ ఫోన్‌ను తీసుకువస్తానని స్పష్టం చేశారు.

తాజాగా తన ట్వీట్‌లో ‘ఆ పరిస్థితి రాదని నేను ఖచ్చితంగా ఆశిస్తున్నాను. అయితే, వేరే ఆప్షన్ లేకపోతే మొబైల్‌ మార్కెట్‌లోకి ఎంటరవుతాను, ప్రత్యామ్నాయ ఫోన్‌ను తయారు చేస్తాను.’ అని స్పష్టం చేశారు మస్క్. అంతేకాదు.. తనను తాను పూర్తి స్వేచ్ఛా వాదిగా పేర్కొన్నారు మస్క్. ఆపిల్, గూగుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ పక్షపాతం వహిస్తే ప్రత్యామ్నాయం ఆలోచిస్తానని అన్నారు.

అంతరిక్ష ప్రయాణం, ఎలక్ట్రిక్ వాహనాలు, సొరంగాలు నిర్మించడం వంటి వ్యాపారాలలో రాణిస్తున్న ఎలన్ మస్క్ ఇప్పుడు సోషల్ మీడియా సామ్రాజ్యంలోకీ దిగాడు. ఈ బిలియనీర్ ఇప్పుడు చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. మస్క్ నెక్ట్స్ టార్గెట్.. స్మార్ట్ ఫోన్, స్వంత ఆపరేటింగ్ సిస్టమ్ అని అర్థమైపోతుందంటున్నారు నిపుణులు.

ఇవి కూడా చదవండి

ప్రపంచంలోనే అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఆపరేటింగ్ సిస్టమ్‌లు iOS, Android ఆపిల్, గూగుల్ రన్ చేస్తున్న విషయం తెలిసిందే. దాదాపు ఒకటిన్నర దశాబ్ధాలుగా ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్‌తో యావత్ ప్రపంచాన్ని ఏలుతున్నాయి. ఇక మస్క్ ప్రకటించినట్లు కొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌ను రూపొందించడం, మార్కెట్‌లో మంచి గుర్తింపు పొందాలంటే.. పెద్ద సవాలేనని అంటున్నారు నిపుణులు. అయితే, ఆపరేటింగ్ సిస్టమ్స్ డెవలపర్స్ కోసం ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. ఇది మస్క్‌కు కలిసి వచ్చే అంశమని అంటున్నారు.

ఆపిల్ యాప్ స్టోర్ ఎగ్జిక్యూటీవ్ ఫిల్ షిల్లర్ తన ట్విట్టర్ అకౌంట్‌ను తొలగించడంతో ఆపిల్ యాప్ స్టోర్ నుంచి ట్వి్ట్టర్‌ను తొలగించడంపై అనుమానాలు పెరిగాయి. యాపిల్ యాప్ స్టోర్.. ట్విట్టర్ యాప్‌నే తీసేయడానికి మోడరేషన్ కౌన్సిల్ లేకపోవడం కూడా కారణంగా చూపొచ్చని అంటున్నారు. మోడరేషన్ కోసం విధానాలను రూపొందించడానికి ఒక కౌన్సిల్‌ను ఏర్పాటు చేస్తానని మస్క్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఇటీవల ఆ వాగ్దానం నుంచి మస్క్ యూ టర్న్ తీసుకున్నాడు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..