Credit Card: క్రెడిట్ కార్డు బిల్లు సకాలంలో చెల్లించినా పెనాల్టీ పడిందా.. డోంట్ వర్రీ.. ఇలా చేస్తే మీ డబ్బులు వెనక్కి

ఈ రోజుల్లో క్రెడిట్‌ కార్డులు వాడే వారి సంఖ్య పెరిగిపోయింది. అయితే కొన్ని సార్లు క్రెడిట్‌ కార్డు బిల్లు సమయానికి చెల్లించినా నెక్స్ట్‌ వచ్చే బిల్లు వడ్డీ, పెనాల్టీ ఛార్జీలతో వస్తుంటుంది. అంటే క్రెడిట్‌ కార్డు బిల్లు చెల్లించనట్లుగా..

Credit Card: క్రెడిట్ కార్డు బిల్లు సకాలంలో చెల్లించినా పెనాల్టీ పడిందా.. డోంట్ వర్రీ.. ఇలా చేస్తే మీ డబ్బులు వెనక్కి
Credit Card
Follow us
Subhash Goud

|

Updated on: Nov 26, 2022 | 3:54 PM

హైదరాబాద్ కు చెందిన రోహిత్ కు రెండురోజుల క్రితం క్రెడిట్ కార్డ్ బిల్లు వచ్చింది. ఆ బిల్లు చూసిన అతనికి మతిపోయినంత పనైంది. ఎందుకంటే, తాను వాడిన దానికన్నా ఎక్కువగా బిల్లు వచ్చింది. అంత బిల్లు ఎందుకువచ్చింది అని చెక్ చేసుకున్నాడు రోహిత్. గత నెలలో తాను బిల్లు మొత్తం చెల్లించినా.. ఆ బిల్లుపై వడ్డీ, జరిమానా కలిపి ఇప్పుడు బిల్లుకు అదనంగా చేర్చి తాజా బిల్లు ఇచ్చినట్టు తేలింది. దీంతో షాక్ అయ్యాడు రోహిత్. వెంటనే సంబంధిత బ్యాంకుకు వెళ్ళాడు. తన సమస్య పై కంప్లైంట్ ఇచ్చాడు. అయినా ఫలితం లేకుండాపోయింది. ఇప్పడు ఏమి చేయాలో తెలియక రోహిత్ కంగారూ పడుతున్నాడు. రోహిత్ లాగా మీ బ్యాంకు కూడా మీదగ్గర ఇష్టానుసారంగా ఛార్జీలు వసూలు చేస్తుంటే.. మీరు కంప్లైంట్‌ చేసినా ఫలితం లేకపోతే ఏం చేయాలి?

ఈ రోజుల్లో క్రెడిట్‌ కార్డులు వాడే వారి సంఖ్య పెరిగిపోయింది. అయితే కొన్ని సార్లు క్రెడిట్‌ కార్డు బిల్లు సమయానికి చెల్లించినా నెక్స్ట్‌ వచ్చే బిల్లు వడ్డీ, పెనాల్టీ ఛార్జీలతో వస్తుంటుంది. అంటే క్రెడిట్‌ కార్డు బిల్లు సమయానికి చెల్లించనట్లుగా ఉంటుంది. ఇలా క్రెడిట్ కార్డ్ బిల్లును సకాలంలో చెల్లించినా వడ్డీ, జరిమానాతో వచ్చే నెల బిల్లు వచ్చింది. సిస్టమ్‌లో పేమెంట్‌ను అప్‌డేట్ చేయకపోవడంతో ఒక్కోసారి ఇలా జరుగుతుంటుందని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. మరి అలాంటి సమయంలో ఏం చేయాలి..? ఇలా సమయానికి బిల్లు చెల్లించినా కూడా వడ్డీ, పెనాల్టీ ఛార్జీలు పడితే ఏం చేయాలో తెలుసుకుందాం.

ఇలాంటి పరిస్థితుల్లో సదరు కస్టమర్‌ నేరుగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ)కి కంప్లైంట్‌ చేయవచ్చు. కస్టమర్ల బ్యాంకింగ్‌కు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి ఆర్‌బిఐ ఒక పోర్టల్‌ను రూపొందించింది. మీరు బ్యాంకుకు సంబంధించి ఏదైనా ఫిర్యాదు చేయాలంటే ఆర్బీఐ ‘కంప్లైంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్’లో ఫిర్యాలు చేయాలి. అంటే cms.rbi.org.inలో బ్యాంక్‌కి సంబంధించిన కంప్లైంట్‌ చేయవచ్చు. ఇది ఆర్బీఐకి సంబంధించిన అంబుడ్స్‌మన్‌కి అనుసంధానించిన ఇంటిగ్రేటెడ్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్. నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, ప్రీపెయిడ్ చెల్లింపు సాధనాలపై కంప్లైంట్‌లు వంటివి ఈ పోర్టల్‌ ద్వారా చేసే అవకాశం ఉంటుంది.

ఫిర్యాదు చేసే ముందు బ్యాంకును సంప్రదించాలి

మీ బ్యాంక్‌పై మీకు ఏదైనా ఫిర్యాదు చేయాలంటే ముందుగా మీరు మీ బ్యాంకు శాఖకు వెళ్లి ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. ఈ కంప్లైంట్‌ను బ్యాంకు వెబ్‌సైట్ ద్వారా కూడా చేయవచ్చు. అంతే కాదండోయ్‌ మీరు చేసే కంప్లైంట్‌ రికార్డును మీ వద్ద ఉంచుకోవడం చాలా ముఖ్యం. మీ ఫిర్యాదు గురించి ఎవరైనా అడిగినా మీ వద్ద ఉండే ఫ్రూప్‌ను చూపించవచ్చు. అయితే మీరు బ్యాంక్‌కు ఫిర్యాదు చేసినా ఎటువంటి స్పందన రాకపోయినా.. లేదా బ్యాంక్ ప్రతిస్పందనతో మీరు సంతృప్తి చెందకపోతే అప్పుడు మీరు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) లేదా లోక్‌పాల్‌లో ఫిర్యాదు చేయవచ్చు. అయితే ఇంకో విషయం ఏంటంటే ఈ ఫిర్యాదును బ్యాంక్‌కి ఫిర్యాదు చేసిన తేదీ నుంచి 30 రోజుల తర్వాత మాత్రమే నమోదు చేయాలి. అటువంటి ఫిర్యాదును ఒక సంవత్సరం లోపు సబ్మిట్‌ చేయవచ్చు.

ఆన్‌లైన్‌ ఆఫ్‌లైన్‌లో ఫిర్యాదు ఎలా చేయాలి?

ఆర్బీఐకి చేసే మీ ఫిర్యాదును ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో కూడా చేసేకునే సదుపాయం ఉంటుంది. మీరు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయాలనుకుంటే..

☛ ముందుగా cms.rbi.org.inకి వెళ్లాలి.

☛ ఆ తర్వాత మీరు ‘ఫైల్ ఏ కంప్లైంట్‌’పై క్లిక్ చేయాలి.

☛ అప్పుడు స్క్రీన్‌పై కనిపించే క్యాప్చా ఎంటర్ చేయాలి.

☛ ఆ తర్వాత ఒక కొత్త పేజీ ఓపెన్‌ అవుతుంది.

☛ దీనిపై మీరు మీ పేరు, మొబైల్ నంబర్‌ను ఎంటర్‌ చేయడం మర్చిపోవద్దు.

☛ తర్వాత అక్కడ కనిపించే OTP కోసం క్లిక్ చేయండి.

☛ దీని తర్వాత మీరు బ్యాంక్ పేరు, మీరు దేని కోసం ఫిర్యాదు చేస్తున్నారో దానికి సంబంధించిన వివరాలు నమోదు చేయాలి.

☛ మీరు బ్యాంక్ నుంచి నష్టపరిహారాన్ని కూడా డిమాండ్ చేయవచ్చు.

☛ చివరగా మీరు మీ కంప్లైంట్‌ను సబ్మిట్‌ చేయాలి. మీరు ఈ ప్రాసెస్‌ పూర్తి చేసిన తర్వాత మీకు కంప్లైంట్‌ నంబర్ వస్తుంది.

☛ ఈ నంబర్‌ మీ ఫిర్యాదును ట్రాక్ చేయడానికి ఉపయోగపడుతుంది. దానిని సేవ్‌ చేసుకుని ఉంచుకోవడం ముఖ్యం. అంతేకాకుండా బ్యాంకులకు సంబంధించిన ఎటువంటి ఫిర్యాదులు అయినా రిజర్వ్‌ బ్యాంక్‌కు ఆఫ్‌లైన్‌లో కూడా పంపించే అవకాశం ఉంది.

మరి ఆర్బీఐకి ఆఫ్‌లైన్‌లో ఫిర్యాదు చేయడం ఎలా?

ఇలా ఆన్‌లైన్‌లో కాకుండా నేరుగా ఆర్బీఐకి కూడా ఫిర్యాదు చేయవచ్చు. దీని కోసం మీరు ఫిర్యాదు పూర్తి వివరాలతో ఆర్బీఐకి లేఖ రాయాల్సి ఉంటుంది. ఈ లేఖలో మీరు దేని గురించి ఫిర్యాదు చేస్తున్నారో దానికి సంబంధించి పూర్తి వివరాలు క్లుప్తంగా ఉండాలి. అలాగే ఆ ఫిర్యాదు కాపీపై మీరు సంతకం చేయాల్సి ఉంటుంది. ఈ లేఖను ‘సెంట్రలైజ్డ్ రసీదు .. ప్రాసెసింగ్ సెంటర్’ 4వ అంతస్తు, సెక్టార్ 17, చండీగఢ్ పిన్‌కోడ్- 160017కు పోస్టు చేయాలి. తర్వాత మీ ఫిర్యాదు అందినట్లుగా మీకు ఓ SMS ద్వారా అందుతుంది. ఈ ఫిర్యాదును మీ సౌలభ్యం కోసం ఇంగ్లీష్ లేదా హిందీలో కూడా ఆర్బీఐ వెబ్‌సైట్‌లో చేయవచ్చు.

ఇలాంటి ఫిర్యాదులపై బ్యాంకింగ్ నిపుణుడు సురేష్ కుమార్ బన్సాల్ మాట్లాడుతూ.. మీకు బ్యాంక్‌పై ఏదైనా ఫిర్యాదు చేయాలనుకుంటే ముందుగా బ్రాంచ్‌కి వెళ్లి బ్యాంక్ మేనేజర్‌తో మాట్లాడడమే ఉత్తమమైన మార్గం. అతను మీ ఫిర్యాదును పట్టించుకోకపోతే రాతపూర్వకంగా చేయాలి. అప్పటికీ స్పందన లేకపోతే బ్యాంకు ప్రధాన కార్యాలయంలో ఫిర్యాదు చేయండి అని ఆయన అన్నారు. ఇలా చేసినా ఒక నెల పాటు సంతృప్తికరమైన సమాధానం రాకపోతే మీ ఫిర్యాదును ఆర్బీఐ వెబ్‌సైట్ లేదా బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌తో నమోదు చేసుకోండి. దీనికి మీకు న్యాయవాది అవసరం లేదు. ఫిర్యాదును నమోదు చేయడానికి ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. మీరు బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ సెటిల్‌మెంట్ లేదా ఆర్డర్ సంతృప్తికరంగా లేనట్లయితే .. మీరు వినియోగదారుల ఫోరమ్‌లో అండర్‌టేకింగ్‌ను ఫైల్ చేయాలి అని వివరించారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా
విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా
బాలకృష్ణ చేయాల్సిన సినిమాతో హిట్టు కొట్టిన ఎన్టీఆర్.
బాలకృష్ణ చేయాల్సిన సినిమాతో హిట్టు కొట్టిన ఎన్టీఆర్.
లావా నుంచి మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌.. రూ.10వేల కంటే తక్కువ ధరల్లో..
లావా నుంచి మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌.. రూ.10వేల కంటే తక్కువ ధరల్లో..
పుష్ప 2 టికెట్స్ ఇచ్చి ఆ స్టార్ హీరో సినిమా వేశారు.. ఎక్కడంటే?
పుష్ప 2 టికెట్స్ ఇచ్చి ఆ స్టార్ హీరో సినిమా వేశారు.. ఎక్కడంటే?
విద్యాశాఖ కీలక నిర్ణయం.. స్కూల్లో టీచర్ల ఫోటోలు..
విద్యాశాఖ కీలక నిర్ణయం.. స్కూల్లో టీచర్ల ఫోటోలు..
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!