AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అక్కడికి ఎలా వెళ్లావ్ మావ.. ఫ్రిజ్‌ ఓపెన్ చేసి కంగుతిన్న మహిళ..

పాముల్ని అస్సలు నమ్మే పని లేదు. అవి ఈ వేడికి ఇళ్లలోకి చొరబడి ఎక్కడైనా నక్కి ఉండొచ్చు. అలక్ష్యంగా ఉంటే కాటు పడుతుంది మరి. అయితే తాజాగా ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇందులో ఏకంగా ఇంట్లోని ఫ్రిజ్ లోపల నాగుపాము దర్శనమివ్వడంతో మహిళ కంగుతింది.

Viral Video: అక్కడికి ఎలా వెళ్లావ్ మావ.. ఫ్రిజ్‌ ఓపెన్ చేసి కంగుతిన్న మహిళ..
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఫ్రిజ్ నుంచి నీటిని తీసిన వెంటనే తాగకూడదు. దానిలోని చల్లని శాతం తగ్గిన తర్వాతే దానిని తాగాలి. ఆరోగ్యాంగా ఉండాలంటే ఫ్రిజ్‌లోని నీటిని తాగడానికి బదులుగా మట్టి కుండలో నిల్వ చేసిన నీటిని తాగడం మంచిది.
Ram Naramaneni
|

Updated on: Apr 23, 2025 | 9:48 PM

Share

ప్రస్తుతం పాములకు మేటింగ్ సీజన్. అందుకే ఎక్కడ చూసినా అవి సయ్యాటలు ఆడుతున్న వీడియోలు వైరల్ అవుతున్నాయ్. అయితే ఇది సమ్మర్ సీజన్ అని కూడా గుర్తుపెట్టుకోవాలి. అవి ఆవాసాలను కోల్పోయి.. వేడి తాపానికి తట్టుకోలేక జనావాసాల్లోకి వచ్చే అవకాశం ఉంది. అలక్ష్యంగా ఉంటే ప్రమాదాల్లో పడాల్సి వస్తుంది. పాములు వాహనాల్లో, ఇళ్లలో తలుపుల వెంట, బూట్లలో, బ్యాగుల్లో నక్కడం ఇప్పటివరకు చూసి ఉంటారు. కానీ ఎలా చేరిందో ఏమో తెలియదు కానీ ఓ పాము ఏకంగా ఫ్రిజ్ లోపల తిష్ట వేసింది. డోర్ తీయగానే పడగ విప్పి కనిపించడంతో గుండె ఆగినంత పనయింది.

ప్రస్తుతం పీక్ సమ్మర్ కారణంగా అందరూ వేడి, ఉక్కపోతకు అల్లాడిపోతున్నారు. వేడి నుంచి రిలీఫ్ కోసం చల్లిని నీటిని తాగుతున్నారు. అలానే ఓ మహిళ తన ఇంటిని ఫ్రిజ్‌లోని చల్లటి నీరు తాగాలని ఆరాటపడింది. అయితే రిఫ్రిజిరేటర్ డోర్ తెరవగానే నాగరాజా కనిపించడంతో కంగుతింది. వెంటనే ఆ ఫ్రిజ్‌కు దూరంగా జరిగి.. ఆ పామును వీడియో తీసింది. అయితే పాము ఫ్రిజ్‌లోకి ఎలా వెళ్లింది అనే అంశంపై వివరాలు వెల్లడించలేదు. సోషల్ మీడియాలో ఈ వీడియోకు ఓ రేంజ్‌లో షేర్లు, కామెంట్స్ వస్తున్నాయి. ‘వామ్మో, ఇకపై మనం ఇంట్లో కూడా జాగ్రత్తగా ఉండాలని’ ఓ నెటిజన్ వ్యాఖ్యానించాడు. ‘ఏ తప్పేముంది బయట వేడిగా ఉంది. కాస్త చల్లదనం కోసం ఫ్రిజ్‌లోకి వెళ్లింది’ అని మరో యూజర్ ఫన్నీగా కామెంట్ పెట్టాడు. అయితే ఈ వీడియోను పామును ఫ్రిజ్ లోపల ఉంది..  కావాలని వీడియో తీశారని మరికొందరు చెబుతున్నారు.

View this post on Instagram

A post shared by kAshiKyaTrA (@kashikyatra)

NOTE: ఈ వీడియో సోషల్ మీడియా నుంచి సేకరించబడింది. ప్రామాణికతను టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు..

Follow Us
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరి పంట పండినట్లే
శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరి పంట పండినట్లే