ఆర్బీఐ వద్ద ఎంత బంగారం ఉంది? భారతీయ మహిళల దగ్గర ఉన్న గోల్డ్‌ ఎంత?

19 April 2025

Subhash

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా దగ్గర ఎక్కువ బంగారం ఉందా? భారతీయ మహిళల దగ్గర ఎక్కువ గోల్డ్‌ ఉందా? ఈ పోటీలో మహిళలే మహరాణులు అంటున్నారు నిపుణులు.

ఆర్బీఐ

అసలు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) దగ్గర ఎంత గోల్డ్‌ నిల్వలు ఉన్నాయి? మహిళా భారతంలో ఎంత పసిడి ఉందో లెక్కలు చూద్దాం. ముందుగా RBI Gold రిజర్వ్స్‌ ఎంత ఉన్నాయో చూద్దాం.

ఆర్బీఐ

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) వద్ద 879 టన్నుల పసిడి నిల్వలు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

ఆర్బీఐ దగ్గర బంగారం

రిజర్వ్‌ బ్యాంకు వద్ద ఉన్న బంగారం విలువ రూ. 6.83 లక్షల కోట్లు. విదేశీ మారక నిల్వల్లో వాటా 11.4 శాతానికి పెరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి.

రిజర్వ్‌ బ్యాంకు

భారత్‌లో బంగారానికి పన్ను కూడా విధిస్తారు. దీంతో గోల్డ్ రేట్‌ పెరుగుతుంది. అందుకే చాలా మంది దుబాయ్‌ నుంచి భారత్‌కు బంగారాన్ని తీసుకువస్తారు. అక్కడ  ఎలాంటి ట్యాక్స్‌ ఉండదు.

రిజర్వ్‌ బ్యాంకు

అయితే ఆర్బీఐ వద్ద ఉన్న బంగారం 2019లో ఇది కేవలం 6.7శాతం. గత కొన్ని సంవత్సరాలుగా బంగారం నిల్వలు పోగేస్తోంది ఆర్బీఐ. 2024లో 72.6 టన్నులు గోల్డ్‌ కొనుగోలు చేసింది.

ఆర్బీఐ వద్ద 

ఇది ప్రపంచంలోని మొత్తం గోల్డ్‌ నిల్వల్లో 11 శాతం. గృహిణుల దగ్గరే అత్యధిక పసిడి నిల్వలు ఉన్నట్లు ఆర్బీఐ చెబుతోంది. ఆభరణాల రూపంలో ఎక్కువగా ఉన్న పుత్తడి ఉంది.

 ప్రపంచంలోని మొత్తం గోల్డ్‌

అమెరికా, జర్మనీ, స్విట్జర్లాండ్‌, IMF నిల్వలను మించి భారతీయ మహిళల దగ్గర పసిడి ఉన్నట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది.

ఇతర దేశాలకంటే..

సో.. ప్రపంచంలో ఉన్న మొత్తం బంగారం నిల్వల్లో 11 శాతం భారతీయ మహిళల దగ్గరే భద్రంగా ఉంది. RBI దగ్గర ఉన్న పసిడి నిల్వల కంటే 30 రెట్లు ఎక్కువ. 

మొత్తం బంగారం