AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO Insurance: మీకు ఈపీఎఫ్‌ అకౌంట్‌ ఉందా? రూ. 7 లక్షల వరకు ఉచిత బీమా ఉందని తెలుసా? ఇదిగో వివరాలు

పీఎఫ్‌ వల్ల ఎన్నో లాభాలున్నాయి. ఈపీఎఫ్‌ ఖాతా కలిగిన ప్రతి ఒక్క ఉద్యోగికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) నిర్వహించే ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్స్యూరెన్స్..

EPFO Insurance: మీకు ఈపీఎఫ్‌ అకౌంట్‌ ఉందా? రూ. 7 లక్షల వరకు ఉచిత బీమా ఉందని తెలుసా? ఇదిగో వివరాలు
ఉద్యోగుల ఖాతాకు పాన్ కార్డును లింక్ చేసి ఉంటే 10% TDS విధిస్తారు. పాన్ కార్డ్ లింక్ చేయకుంటే 30% ఉన్న TDS ను 10శాతం తగ్గించి.. 20శాతంగా చేశారు.
Subhash Goud
|

Updated on: Nov 26, 2022 | 6:06 PM

Share

పీఎఫ్‌ వల్ల ఎన్నో లాభాలున్నాయి. ఈపీఎఫ్‌ ఖాతా కలిగిన ప్రతి ఒక్క ఉద్యోగికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) నిర్వహించే ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్స్యూరెన్స్ (ఈడీఎల్‌ఐ) స్కీమ్‌కు అర్హులు. అంటే ఈపీఎఫ్ అకౌంట్ ఉంటే చాలు ఈడీఎల్ఐ స్కీమ్‌కు అర్హత సాధించినట్లే. అసలు ఈడీఎల్ఐ స్కీమ్ అంటే ఏమిటి? ఈ స్కీమ్ గురించి తెలిసినవారు తక్కువే మంది ఉంటారు. ఇదొక బీమా పథకం. అంటే ఈపీఎఫ్ ఖాతాదారులందరికీ ఈపీఎఫ్ఓ అందించే బీమా ప్రయోజనం. ఇటీవల ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్స్యూరెన్స్ స్కీమ్‌లో కొన్ని సవరణలు చేసింది ఈపీఎఫ్ఓ. ఎక్కువ మంది పీఎఫ్ ఖాతాదారులకు ఈ ఇన్స్యూరెన్స్ లాభాలు అందించేందుకు ఈపీఎఫ్ఓ అధికారులు ఓ నిర్ణయం తీసుకున్నారు.

కుటుంబ సభ్యులకు ప్రయోజనం:

ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్ చనిపోవడానికి ముందు 12 నెలల కాలంలో ఒకటి కన్నా ఎక్కువ సంస్థల్లో పనిచేసి సర్వీసులో మరణించినట్లయితే వారి కుటుంబ సభ్యులకు కూడా బీమా ప్రయోజనం కల్పించాలని ఈపీఎఫ్ఓ నిర్ణయించింది. ఈ స్కీమ్ ద్వారా రూ.2.5 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు ఉచితంగా బీమా పొందే అవకాశం దక్కుతుంది. ఈపీఎఫ్ ఖాతాదారులు సర్వీసులో ఉండగా మరణిస్తే నామినీకి ఈ బీమా మొత్తం లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

నెలకు బేసిక్‌ సాలరీ ఎంతుండాలి?

ఈడీఎల్ఐ స్కీమ్ నెలకు బేసిక్ సాలరీ రూ.15,000 లోపు ఉన్న వారందరికీ వర్తిస్తుంది. బేసిక్ సాలరీ రూ.15,000 దాటితే గరిష్టంగా రూ.7 లక్షల వరకే బీమా ఉంటుంది. ఈడీఎల్ఐ స్కీమ్‌లో చేరడానికి ఉద్యోగులు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎంప్లాయర్ మాత్రం బేసిక్ సాలరీలో 0.5% లేదా గరిష్టంగా రూ.75 ప్రతీ నెల చెల్లించాలి. ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్ సర్వీసులో చనిపోతే నామినీ ఈ బీమాను క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇందుకోసం చనిపోయిన వ్యక్తి డెత్ సర్టిఫికెట్, ఫామ్ 5 ఐఎఫ్, నామినీ అకౌంట్‌కు చెందిన క్యాన్సల్డ్ చెక్ కావాల్సి ఉంటుంది. ఏదైనా వివరాలు అవసరం ఉన్నా ఈపీఎఫ్‌వో కార్యాలయంలో సంప్రదిస్తే తెలియజేస్తారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత